భారత ఎన్నికల సంఘం
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభల , ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉత్తర ప్రదేశ్ లోని ఒక పార్లమెంటరీ నియోజక వర్గం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
Posted On:
07 DEC 2022 6:12PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభలకు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి 116 కౌంటింగ్ కేంద్రాలలో గురువారం జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శ్రీ అనూప్ చంద్ర పాండే, శ్రీ అరుణ్ గోయల్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘం ఈ రోజు సమీక్షించింది.
ఓట్ల లెక్కింపునకు సంబంధించి కమిషన్ ఎప్పటికప్పుడు వివరణాత్మక సూచనలు , ఎస్ఓపిలను జారీ చేసింది, ఇది పైన పేర్కొన్న నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సమయంలో కూడా వర్తిస్తుంది.
- హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 250 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశా, రాజస్థాన్, బీహార్, చత్తీస్ గఢ్ , ఉత్తరప్రదేశ్ లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్ లోని ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 08.12.2022 (గురువారం) ఉదయం 8 గంటల నుంచి జరగనుంది.
- ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా జరిగేలా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అసెంబ్లీ స్థానాలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క కౌంటింగ్ పరిశీలకుని నియమించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ల్లో ఇద్దరేసి ప్రత్యేక పరిశీలకులు క్షేత్రస్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు.
- అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృత, పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఓట్లు పోలైన ఈవీఎం లు భద్రపరచ బడిన అన్ని స్ట్రాంగ్ రూమ్ లు కేంద్ర సాయుధ దళాల మూడు అంచెల భద్రత వలయం లో ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 24×7 సిసిటివి కవరేజీ కూడా ఉంది.
- ఎన్నికల సమయంలో ఈవీఎంల ఏర్పాటుకు సంబంధించి ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు/అభ్యర్థులు పాల్గొంటారు.
- ప్రతి దశలో, ప్రతి ఈవిఎం సీరియల్ నంబర్ (పోలైన వాటితో సహా) రాజకీయ పార్టీలు / అభ్యర్థులకు షేర్ చేస్తారు.
- పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబంధిత జిల్లా యంత్రాంగాలు 144 వ సెక్షన్ విధించాయి.
- ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 8 గంటల లోపు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కు తీసుకుంటారు.ఎస్ వో పిల ప్రకారం ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ను ఉదయం 08:00 గంటలకు చేపట్టి పూర్తయ్యే వరకు కొనసాగిస్తారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఉన్న అన్ని ఆదేశాలను పాటించాలి.
*పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల విరామం తరువాత, ఈవిఎం ఓట్ల లెక్కింపు ఉదయం 08:30 గంటలకు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు దశతో సంబంధం లేకుండా ఈవీఎం లెక్కింపు మే 18, 2019 నాటి ఈసీఐ ఆదేశాల మేరకు కొనసాగుతుంది.
*ప్రతి రౌండ్ కౌంటింగ్ తరువాత, నిర్ణీత ఫార్మెట్ లో ఫలితాల పట్టిక చేయబడుతుంది. దీని మీద ఆర్ ఓ, అబ్జర్వర్ సంతకం చేస్తారు. ఒక కాపీని అభ్యర్థులతో పంచుకుంటారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించిన తర్వాత, ప్రస్తుత సూచనల ప్రకారం తదుపరి రౌండ్ లెక్కింపు చేపట్టబడుతుంది.
*అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలను పొందిన తరువాత పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను కూడా నిర్ణీత ఫార్మాట్ లో షేర్ చేస్తారు.
*2019 నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం/ సెగ్మెంట్లకు యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఐదు పోలింగ్ స్టేషన్ల నుంచి వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చుతున్నారు.
*రిటర్నింగ్ అధికారి (ఆర్ ఓ) రౌండ్ వారీగా ఫలితాలను ఎన్ కోర్ లో నమోదు చేయాలి, తరువాత ఎన్నికల సంఘం రిజల్ట్ వెబ్ సైట్ (https://results.eci.gov.in) లో డిస్ ప్లే
చేస్తారు.
*ఒకవేళ ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లనివిగా తిరస్కరించబడిన పోస్టల్ బ్యాలెట్ పత్రాల సంఖ్య కంటే గెలుపు విజయ మార్జిన్ తక్కువగా ఉన్నట్లయితే, తిరస్కరించబడిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా 2019 మే 18 నాటి ఈసిఐ ఆదేశాల ప్రకారం ఫలితాన్ని ప్రకటించడానికి ముందు ఆర్ వో ద్వారా తప్పనిసరిగా తిరిగి ధృవీకరించ బడతాయి. అటువంటి రీ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగినా, 2009 జనవరి 21 నాటి ఈసిఐ ఆదేశాల ప్రకారం మొత్తం ప్రొసీడింగ్స్ ను వీడియో గ్రాఫ్ చేయాలి.
9.రౌండ్ల వారీగా ఫలితాల పోకడలను వెల్లడించడానికి ప్రతి కౌంటింగ్ ప్రదేశంలో మీడియా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మీడియా పాస్ లు కూడా జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించడానికి 6000 కి పైగా అధికార లేఖలు మీడియాకు జారీ చేయబడ్డాయి.
10.అధీకృత వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతించాలి.
11.08.12.2022 న ఉదయం 8.00 గంటల తరువాత, సమాచార వ్యాప్తి కోసం అన్ని కౌంటింగ్ కేంద్రాలతో పాటు క్రింది మాధ్యమాలలో ట్రెండ్స్ , ఫలితాలు అందుబాటులో ఉంటాయి:
1. ఫలితాలు భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ (https://results.eci.gov.in) లో ప్రదర్శించబడతాయి. ప్రతి నియోజకవర్గం రౌండ్ల వారీ ట్రెండ్స్ , ఫలితాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు.
2. గూగుల్ ప్లే స్టోర్ , ఆపిల్ యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్న "ఓటర్ హెల్ప్ లైన్ యాప్" మొబైల్ యాప్ ద్వారా కూడా ట్రెండ్స్ , ఫలితాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కౌంటింగ్ కేంద్రాల నుంచి రిటర్నింగ్ అధికారులు నింపిన సమాచారాన్ని వెబ్ సైట్ /మొబైల్ యాప్ లో డిస్ ప్లే చేస్తారు. రిటర్నింగ్ అధికారులు నింపిన సమాచారాన్ని ఆయా కౌంటింగ్ కేంద్రాల నుంచి సిస్టమ్ లో ఈసీ ప్రదర్శిస్తుంది.
12.కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా పూర్తి కావడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో సహా సంబంధిత అన్ని వర్గాల నుండి పూర్తి సహకారం ఉంటుందని కమిషన్ ఆశిస్తోంది.
****
(Release ID: 1881701)
Visitor Counter : 139