రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ఎఫ్ఏఐ వార్షిక సదస్సును ప్రారంభించిన కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


మా ప్రభుత్వం వివిధ సంస్కరణలు అమలు చేసి రైతులకు సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉండేలా చేసింది : డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 07 DEC 2022 6:14PM by PIB Hyderabad

 ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఏఐ  ) వార్షిక సదస్సు 2022 (2030 నాటికి ఎరువుల రంగం)ను కేంద్ర రసాయనాలు మరియు ఎరువులు, మరియు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ సింఘాల్, డీజీ ఎఫ్ఏఐ శ్రీ అరవింద్ చౌదరి, ఎఫ్ఏఐ చైర్మన్ శ్రీ కేఎస్ రాజు, పరిశ్రమల ప్రతినిధులు, మంత్రిత్వ శాఖలోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

సదస్సులో మాట్లాడిన  ఆహార భద్రతను అందించడంలో ఎరువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు.  గత మూడేళ్లుగా ఎరువులు, ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయన్నారు. మంత్రి మాట్లాడుతూ “మా ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేసింది. దేశ  రైతులకు సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసింది.  ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని ఎక్కువ  ద్వారా సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులోకి వచ్చేలా చేశాము.  మహమ్మారికి ముందు 2019-20  సంవత్సరానికి సబ్సిడీ  10 బిలియన్ అమెరికా  డాలర్ల వరకు ఉండేది.  ప్రస్తుత సంవత్సరంలో సబ్సిడీని దాదాపు  27 బిలియన్ అమెరికా డాలర్ల వరకు పెంచడం ద్వారా ప్రభుత్వం రైతులకు ప్రయోజనం కలిగించింది" అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 

 

 

“ప్రపంచం నేడు ఎరువుల ధరల పెరుగుదల మరియు లభ్యతలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.   ప్రపంచ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎరువులకు సంబంధించిన అంశాల్లో దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలు సహేతుకమైన మరియు పారదర్శకమైన విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు.   ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం, కోవిడ్-19 అనంతర పరిణామాలు, వాతావరణంలో వస్తున్నా మార్పుల రూపంలో ప్రపంచం మూడు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నదని డాక్టర్ మాండవీయ వ్యాఖ్యానించారు. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని దేశ ఎరువుల సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఆహార, ఆరోగ్య భద్రత రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. " దీర్ఘ కాలం అమలులో ఉండే ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు లక్ష్యాన్ని సాధించడానికి ఉపకరిస్తాయి. వీటివల్ల లక్ష్య సాధన దేశంలో వేగంగా అడుగులు పడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎరువులు ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు, విదేశీ సరఫరాదారుల మధ్య ఒప్పందాలు, అవగాహన కుదిరేలా చూసి ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చూసేందుకు చర్యలు అమలు చేసింది' అని డాక్టర్ మాండవీయ వివరించారు. 

'ఉత్పత్తి, కార్మిక రంగం,వ్యవసాయ రంగం, విద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేసి సులభతర వాణిజ్యానికి ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం అమలు చేసిన చర్యలు ఆర్థిక రంగం తిరిగి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. దీనిలో భాగంగా 'మేక్ ఇన్ ఇండియా' విధానాన్ని ఎరువుల రంగంలో అమల్లోకి తెచ్చి మూతబడిన 5 యూరియా ప్లాంట్లను ప్రభుత్వం తిరిగి తెరిచింది. 2225 నాటికి యూరియా రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. ఇటీవల ప్రభుత్వం' ఒక దేశం. ఒక ఎరువు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం యూరియా, ఎంఓపి,డీఏపీ, ఎన్ పీ కె లు భారత్ బ్రాండ్ కింద విక్రయించబడతాయి. దీనివల్ల నాణ్యత, బ్రాండ్ విషయంలో దేశం అంతటా ఒకే విధమైన విధానం అమలులో ఉంటుంది.' అని మాండవీయ పేర్కొన్నారు. 

దేశంలో పనిచేస్తున్న దాదాపు మూడు లక్షల ఎరువుల  విక్రయ కేంద్రాలను “ప్రధాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు”పేరిట రైతుల కోసం ఏక గవాక్ష  సేవా కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించామని  మంత్రి తెలియజేశారు.

మొత్తం విలువ గొలుసును సానుకూలంగా ప్రభావితం చేసి, స్థిరమైన లక్ష్యాలను సాధించడంలో గణనీయంగా సహాయపడే  పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నూతన  వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు కృషి చేయాలని మంత్రి సూచించారు.   పరిశ్రమ తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఎరువులు మరియు కొత్త-యుగం స్మార్ట్ పరిష్కారాల అంశంలో  పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని  ఆయన అన్నారు. సమర్థత, ఆర్థిక అభివృద్ధి,   జీవావరణ అంశాలలో  నానో ఎరువులు ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. 

 కార్యక్రమంలో మూడు  ఎఫ్ఏఐ   ప్రచురణలు మరియు  ఎఫ్ఏఐ  డేటా పోర్టల్‌ను  కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ పోర్టల్ ఏకరీతి డేటా బేస్‌ను అభివృద్ధి చేస్తుంది. ఎఫ్ఏఐ సమాచారాన్ని భౌతికంగా నమోదు చేసే విధానానికి పోర్టల్ స్వస్తి పలుకుతుంది. 

ఈ సంవత్సరం  '2030 నాటికి ఎరువుల రంగం' అనే అంశంపై  ఎఫ్ఏఐ వార్షిక సదస్సు జరుగుతుంది. ఆకుపచ్చ ఎరువుల కోసం సాంకేతికతలు,  గ్రీన్ ఫైనాన్సింగ్ మరియు రవాణా ఖర్చు తగ్గించడం,వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించడం,వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు  వంటి అంశంపై సదస్సులో చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. సదస్సులో నిపుణుల అభిప్రాయాలు, చర్చలు వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై  విధాన రూపకర్తలకు , వ్యవసాయం మరియు ఎరువుల రంగాలకు సంబంధించిన వారందరికీ ఉపయోగపడే కొన్ని ఉపయోగకరమైన సిఫార్సులకు దారితీస్తాయి.

***



(Release ID: 1881695) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi , Punjabi