ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన "భారతదేశంలో ఆరోగ్యం , సైన్స్ లో మార్పుకు మహిళల నాయకత్వం‘ అనే అంశం పై సదస్సు


మహిళలు అభివృద్ధి చెందడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 06 DEC 2022 3:01PM by PIB Hyderabad

‘‘స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు వివిధ రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ చర్యల ద్వారా మన దేశంలో లింగ సమానత్వ విత్తనాలు నాటబడ్డాయి; ఇది మొత్తం మీద మన సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యవసానంగా, మహిళా సాధికారత భారతదేశ సమానమైన, సమ్మిళితమైన వైవిధ్యమైన వృద్ధి కథకు దారితీస్తుంది‘‘ అని కేంద్రఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. భారతదేశంలో ఆరోగ్యం , సైన్స్ లో మార్పుకు మహిళల నాయకత్వం  అనే అంశం పై ఢిల్లీ లో జరిగిన సదస్సుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో కలసి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అధ్యక్షత వహించారు. శ్రీమతి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పవార్ మాట్లాడుతూ,  ఆనందీబాయి జోషి, కదంబిని గంగూలీ, కల్పనా చావ్లా వంటి భారతీయ మహిళా ప్రముఖుల నుండి మనం ప్రేరణ పొందాలి, వారు అన్ని అడ్డంకులను అధిగమించి వారి రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించారు.

మనం వారి వల్ల ప్రభావితం కావాలి. జరుపుకోవాలి. అనేక విధాలుగా ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి‘‘ అన్నారు.

కోవిడ్ -19 కీలక సమయంలో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల పంపిణీలో ముందంజలో ఉన్న  దాదాపు పది లక్షల మంది ఆశా కార్యకర్తలు (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త) 75 వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు -2022 ను అందుకున్నారనే వాస్తవం నుండి మన పురోగతిలో మహిళల కీలక పాత్ర ప్రాముఖ్యతను నిర్ణయించవచ్చని ఆమె అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను ప్రస్తావిస్తూ, "మన మహిళలను ప్రతి రంగంలోనూ సమర్థులుగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది‘‘ అని డాక్టర్ పవార్ తెలిపారు. నిరంతర ప్రయత్నాలు చేస్తూ, ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థల ద్వారా స్కాలర్ షిప్ లు, ఆర్థిక సహాయం మొదలైన వాటి మునుపటి జోక్యాలను కొనసాగిస్తోంది, ఇది మహిళలు వృద్ధి చెందడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థకు దారితీస్తుంది.

స్వాతంత్ర్యానంతరం భారతదేశ వృద్ధి గాథలోని ఈ అంశానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ గౌరవ ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఈ దిశగా అనేక చర్యలు అమలులోకి వచ్చాయి. 'బేటీ బచావో, బేటీ పడావో', ఉచిత వంట గ్యాస్ కోసం ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, పీఎం జన్ ధన్ యోజన ద్వారా ఆర్థిక సమ్మిళితం,  వ్యవస్థాపక ఆకాంక్షల కోసం ముద్ర పథకం, మన రక్షణ సేవలలో శాశ్వత కమిషన్ వంటి ప్రధాన పథకాలు మహిళల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా సాధికారత కోసం కూడా ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన జోక్యాలని మంత్రి వివరించారు.

మహిళా శ్రామిక శక్తిని పురుషుల శ్రామిక శక్తితో సమానంగా తీసుకురావాలని, సమగ్ర అభివృద్ధికి మహిళా కేంద్రీకృత కార్యక్రమాలు ఈ సమయంలో అవసరమని డాక్టర్ పవార్ నొక్కి చెప్పారు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(ఆకామ్) స్వర్ణ కాలానికి తగిన వేడుక అని అన్నారు.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,  ‘‘సమాజంలో మహిళలు తమ మంచి స్థానాన్ని పొందుతున్నారని, లింగ నిర్దిష్ట పాత్రల గత అవశేష చాందసాన్ని మనం తొలగించాలి. ఆకామ్ స్ఫూర్తితో, ప్రభుత్వ పథకాలను సంక్షేమ కోణం నుండి కాకుండా వారి సంకల్పాన్ని బలోపేతం చేసే వేదికగా చూడాలి. మహిళలు మన మానవ వనరులలో కీలకమైన భాగం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే వారు మన దేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేయగలరు " అని అన్నారు.

ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అత్యవసర నగదు బదిలీ వంటి కీలకమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని, ఇది లింగ ఉద్దేశపూర్వక విధానానికి గొప్ప ఉదాహరణ అని మెలిండా ఫ్రెంచ్ గేట్స్ అన్నారు. ‘‘లింగ సమాన దేశాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం అట్టడుగు నుండి ముందుకు సాగుతోంది" అన్నారు. భాగస్వామ్య లక్ష్యాలను సాధించడానికి , దేశంలో లింగ సమానత్వ భావనను మరింత మెరుగుపరచడానికి గేట్స్ ఫౌండేషన్,.  భారత ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి) కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే, డిబిటి మాజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, డబ్ల్యూ హెచ్ ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, బి ఐ ఆర్ ఎ సి ,డిబిటి అండ్ ఎండి సీనియర్ అడ్వైజర్ డాక్టర్ అల్కా శర్మ, ఉమెన్ లిఫ్ట్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి అమీ బాట్సన్, గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా మిషన్ డైరెక్టర్ డాక్టర్ శీర్షేందు ముఖర్జీ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1881243) Visitor Counter : 104