ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయను కలిసిన శ్రీమతి మెలిండా ఫ్రెంచ్గేట్స్
క్షేత్రస్థాయి సైనికులు: ఇండియాలో కోవిడ్ 19 మహమ్మారి నియంత్రణలో ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎం ల పాత్ర పేరుతో
నివేదిక విడుదల, ఆశా వర్కర్ల అద్వితీయ పాత్రను ప్రశంసించిన నివేదిక
భారతదేశపు కోవిడ్ నియంత్రణ కార్యక్రమం, వాక్సినేషన్ కార్యక్రమాన్ని అలాగే జి–20 కి భారతదేశం నాయకత్వం వహించడాన్ని అభినందించిన మెలిండా ఫ్రెంచ్
Posted On:
05 DEC 2022 7:49PM by PIB Hyderabad
బిల్ అండ్ మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షురాలు శ్రీమతి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయను కలుసుకున్నారు.
భారతదేశం కోవిడ్ `19 వాక్సిన్‌ను విజయవంతంగా చేపట్టినందుకు కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వ కృషిని శ్రీమతి మెలిందా ఫ్రెంచ్‌గేట్స్ అభినందించారు. మహిళలు, యువతులకు ఇంతకుముందెన్నడూ లేనివిఆధంగా వారి పురోభివృద్ధికి వివిధ అవకాశాలు కల్పించినందుకు కేంద్ర హోంమంత్రిని ఆమె అభినందించారు.
భారతదేశం చేపట్టిన ఆరోగ్య రంగ సంస్కరణలలో భాగంగా ఏర్పడే నూతన అవకాశాల గురించి ప్రత్యేకించి ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు, ఆయుష్మాన్ భారత్ కింద డిజిటల్ హెల్త్ మిషన్‌ను బలోపేతం చేయడం గురించి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీమతి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ చర్చించారు.భారతదేశపు వాక్సిన్ తయారీని మరింత ముందుకుతీసుకుపోవడానికి గల అవకాశాలు, డిజిటల్ ఉత్పత్తులు, డిజిటల్ పబ్లిక్ హెల్త్, ప్రత్యేకించి భారతదేశం జి`20 దేశాల అధ్యక్షబాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో చర్చించారు.
డాక్టర్ మాండవీయ , శ్రీమతి మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఇరువురూ కలిసి ‘‘క్షేత్రస్థాయి సైనికులు: భారతదేశంలో కోవిడ్ `19 మహమ్మారిని అదుపుచేయడంలో ఆశా, ఎఎన్‌ఎంల పాత్ర ’’అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించారు.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి), ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్‌నెస్ (ఐఎఫ్‌సి)లు సంయుక్తంగా రూపొందించాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, కోవిడ్ మహమ్మారి సమయంలో మన హెల్త్ కేర్ వర్కర్లు, ఆరోగ్య సంరక్షకులుగా , నాయకులుగా నిజమైన హీరోలుగా సేవలు అందించారని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి వంటి పెద్ద సంక్షోభాన్నిఎదుర్కోవడంలో , దానిని నియంత్రించడంలో వీరు చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేశారన్నారు.ఇలాంటివారి సేవలను నివేదిక రూపంలో రికార్డు చేయడం అవసరమన్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన నివేదిక, ఆశా, ఎఎన్‌ఎంల కీలక పాత్ర తో పాటు, వారి అనుభవాలను కూడా తెలియజేస్తుందన్నారు. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల ప్రజలకుకూడా ఆరోగ్య కార్యకర్తలు తమ సేవలు అందిచారని మంత్రి తెలిపారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వాక్సిన్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలుగా వారు ప్రతి ఇంటి తలుపుతట్టారని, కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో తమ విలువైన సేవలు అందించారని మంత్రి చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహించడం, వాక్సినేషన్, పరిశుభ్ర విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పౌష్టికాహారం, పునరుత్పాదక, శిశు సంరక్షణ సేవలను కల్పించడం, సాంక్రమిక, సాంక్రమికేతర వ్యాధుల నియంత్రణ వంటి వాటిలో వీరు కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు.
అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మన వాక్సినేషన్‌కార్యక్రమం, సమాజ సమష్ఠికృషికి నిలువుటద్దంలా నిలిచిందని, ఈ సంక్షోభాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ బలమైన , సమర్ధ నాయకత్వం లో గత రెండు సంవత్సరాల అనుభవంనుంచి నేర్చుకున్న దానినుంచి దేశ ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠపరచడంతో పాటు, ఆరోగ్య సేవలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా, వారికి నాణ్యమైన వైద్య ఆరోగ్యసేవలు అందుబాటులో ఉంచేలా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందేలా కృషిచేస్తున్నట్టు చెప్పారు.
ఆరోగ్యరంగంలో భారతదేశ పురోగతిని శ్ర్రీమతి మెలిండా ఫ్రెంచ్ గేట్ ప్రశంసించారు. స్వల్పవ్యవధిలో దేశంలోని 90 శాతం ప్రజలకు భారత ప్రభుత్వం వాక్సిన్ వేయించడం అద్బుతమైన విషయమని అన్నారు. కోవిడ్ మహమ్మారి పై పోరాటం విషయంలో నూతన ఆవిష్కరణలకు ఇండియా ఛాంపియన్‌గా నిలిచిందని, పేద వర్గాలపై కోవిడ్ ప్రభావం పడకుండా చూడడంలో గొప్ప కృషి చేసందని ప్రశంసించారు. కోట్లాది మంది ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మాతా శిశు సంరక్షణలో సుస్థిర ప్రగతికి పూచీపడుతున్నదని అన్నారు.సమగ్ర ప్రాథమిక ఆరోగ్యం, డిజిటల్ హెల్త్, వంటి వాటి విషయంలో ప్రపంచం ఇండియా అనుభవాలను స్వీకరించవచ్చని ఆమె అన్నారు.భారత దేశ ఆరోగ్యరంగ ప్రాధాన్యతా అంశాలను, ఆరోగ్యవ్యవస్థను బలోపేతం చేయడం సహా ఇతర అంశాలు,వివిధ వ్యాధులపై పోరాటంలో గేట్స్ ఫౌండేషన్ తమ మద్దతు కొససాగించడానికి కట్టుబడి ఉందని ఆమె అన్నారు. భారతదేశం జి`20 అద్యక్షబాధ్యతలనుచేపట్టినందుకు ఆమె అభినందనలు తెలిపారు.
***
(Release ID: 1881240)
Visitor Counter : 165