ఆర్థిక మంత్రిత్వ శాఖ

డిఆర్ఐ 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


భారతదేశంలో స్మగ్లింగ్ రిపోర్ట్ 2021-22 విడుదల

ఎన్ డి పి ఎస్ కేసులలో ప్రధాన నిర్వాహకులు, నేరస్థులు/ఫైనాన్సర్లను పట్టుకుని వారి నేరాలకు ముగింపు పలకాలని డి ఆర్ ఐ అధికారులకు ఆర్థిక మంత్రి ఉద్భోధ

ఎన్ డి పి ఎస్ కేసుల్లో సహించే ధోరణి ఉండరాదని స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి

ముంబై జోనల్ యూనిట్ కు చెందిన శ్రీమతి మిషాల్ క్వీనీ డి'కోస్టా, కోల్ కతా జోనల్ యూనిట్ కు చెందిన శ్రీ బిపుల్ బిశ్వాస్ లకు వారి ధైర్యసాహసాలకు గాను 2022 సంవత్సరానికి 'డిఆర్ఐ బ్రేవరీ అవార్డు' ల ప్రదానం

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్) 1964 బ్యాచ్ అధికారి శ్రీ ఆర్ గోపాలనాథన్ కు విశిష్ట నిబద్ధతా సేవలకు గాను డిఆర్ఐ 'ఉత్క్రిష్ట్ సేవా సమ్మాన్, 2022' పురస్కారం ప్రదానం

Posted On: 05 DEC 2022 6:08PM by PIB Hyderabad

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు  (సీబీఐసీ) ఆధ్వర్యంలో ప్రధాన యాంటీ స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ- డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈరోజు ఢిల్లీలో 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.

కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా,  సిబిఐసి చైర్మన్ శ్రీ వివేక్ జోహ్రి , డిఆర్ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ మోహన్ కుమార్ సింగ్, ఇంకా బోర్డు సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సీబీఐసీ మాజీ చైర్ పర్సన్లు, సభ్యులు, డీఆర్ఐ మాజీ డీజీలతో పాటు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది భౌతికంగా హాజరయ్యారు.  ఇంకా వందలాది మంది డిఆర్ఐ, సిబిఐసి, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, భారత ప్రభుత్వ ఇతర అధికారులతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు.

బంగారం స్మగ్లింగ్, నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, వన్యప్రాణులు, వాణిజ్య మోసాలు, అంతర్జాతీయ ఎన్ ఫోర్స్ మెంట్ ఆపరేషన్స్, సహకారం వంటి ధోరణులను విశ్లేషించే "స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2021-22" (https://dri.nic.in/writereaddata/smuggling_in_india_report_2021_2022.pdf) ను కేంద్ర ఆర్థిక మంత్రి విడుదల చేశారు. డిఆర్ఐ డిజి శ్రీ ఎం కె సింగ్ ప్రముఖులకు స్వాగతం పలికారు గత ఆర్థిక సంవత్సరంలో డిఆర్ఐ పనితీరు గురించి ఒక నివేదికను సమర్పించారు.

డిఆర్ఐ , దాని అధికారుల పనితీరుకు,  ప్రశంసనీయమైన సేవలకు గాను శ్రీమతి సీతారామన్ అభినందనలు తెలిపారు. డిఆర్ఐ , దాని అధికారుల వృత్తిపరమైన ప్రతిభను ఆర్థిక మంత్రి ప్రశంసించారు మెరుగైన లక్ష్యాలను సాధించడంలో డిఆర్ఐ ప్రతి సంవత్సరం తన బెంచ్ మార్క్ ను మెరుగుపరిచిందని అన్నారు.

డిఆర్ఐ ఆదర్శప్రాయమైన పనితీరు ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు బెంచ్ మార్క్ ను మరింత పెంచిందని ఆర్థిక మంత్రి అన్నారు. భారతదేశంలో స్మగ్లింగ్ ను ముఖ్యంగా మాదకద్రవ్యాలు , బంగారం స్మగ్లింగ్ ను గుర్తించడాన్ని తాను నిశితంగా పరిశీలిస్తున్నానని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశంలోని 14 ప్రదేశాలలో 44,000 కిలోలకు పైగా మత్తు మందులను డిఆర్ఐ నాశనం చేసిందని, ఇది డిఆర్ఐ పనితీరు , సామర్ధ్యానికి అసాధారణ ప్రదర్శన అని సీతారామన్ ప్రశంసించారు.

ఈ కేసుల్లో ప్రధాన నిర్వాహకులు /నేరస్థులు / ఫైనాన్సర్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్ డి పి ఎస్ కేసులను లాజికల్ ముగింపు నకు తీసుకురావడమే ఇప్పుడు లక్ష్యం అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, నమూనాలపై పనిచేయడం, స్మగ్లర్ల కంటే ముందు డేటా విశ్లేషణ , బంగారం ఎన్ డి పి ఎస్ స్మగ్లింగ్ బెడదను ఎదుర్కోవటానికి వారి కార్యాచరణను పెంచాల్సిన అవసరాన్ని ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు.

ప్రతికూల ఆటగాళ్ళ డేటా చొరబాట్లను నివారించడానికి కఠినమైన నిఘా ఉంచాలని ఆమె నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా ముంబై జోనల్ యూనిట్ డిఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ మిషాల్ క్వీనీ డి కోస్టా, కోల్ కతా జోనల్ యూనిట్ కు చెందిన డీఆర్ఐ సీనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ శ్రీ బిపుల్ బిశ్వాస్ లకు 'డిఆర్ఐ బ్రేవరీ అవార్డ్ 2022'ను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్) 1964 బ్యాచ్ అధికారి శ్రీ ఆర్.గోపాలనాథన్ విశిష్ట, నిబద్ధతతో చేసిన సేవలకు గాను డిఆర్ ఐ ' ఉత్కృష్ట్ సేవా సమ్మాన్, 2022'ను ప్రదానం చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి

శ్రీ పంకజ్ చౌదరి మాట్లాడుతూ, పరిమాణంలో చిన్నదైనప్పటికీ డిఆర్ఐ చాలా సమర్థవంతమైన ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. ఇటీవలి కాలంలో కొన్ని ప్రధాన ఎన్ డి పి ఎస్ స్వాధీనం సందర్భాలను ఆయన ప్రస్తావించారు ఈ కేసులను పట్టుకోవడంలో డిఆర్ఐ వృత్తి నైపుణ్యాన్ని అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా , యువతపై దాని ప్రభావం గురించి మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ డి పి ఎస్ కేసులపై రాజీ ప్రసక్తి ఉండరాదని, బాధ్యుల పట్ల సహించే విధానం కూడదని స్పష్టం చేశారు.

రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా తన ప్రసంగంలో, డిఆర్ ఐ 65 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు.  ఈ 65 సంవత్సరాలలో డిఆర్ఐ చాలా సుదీర్ఘమైన , విశిష్టమైన రికార్డును కలిగి ఉందని, రాబోయే సంవత్సరాల్లో సవాళ్లను ఎదుర్కోవటానికి డిఆర్ఐ మరింత సన్నద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు.

వ్యవస్థాపక దినోత్సవ వేడుకల తరువాత భాగస్వామ్య కస్టమ్స్ సంస్థలు, ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్, యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యుఎన్ఓడిసి) వంటి అంతర్జాతీయ ఏజెన్సీలతో సమర్థవంతంగా సమన్వయం కోసం ఎనిమిదవ ప్రాంతీయ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సమావేశం (ఆర్ సి ఇ ఎం)  జరిగింది.

డిఆర్ఐ, ఢిల్లీ జోనల్ యూనిట్ ప్రిన్సిపల్ ఎడిజి శ్రీ అభయ్ కుమార్ శ్రీవాస్తవ్ 'ధన్యవాదాలు' తో ప్రారంభ కార్యక్రమం ముగిసింది.

****



(Release ID: 1881178) Visitor Counter : 149