సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
తపాలా విభాగంతో కలిసి లేఖారచనా ఉత్సవమైన డాక్‌రూమ్‌ను నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
Posted On:
04 DEC 2022 7:28PM by PIB Hyderabad
ప్రధానాంశాలుః
- కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, గాంధీ స్మృతి, దర్శన్ సమితి మద్దతుతో భారత తపాలా శాఖ డిటిజల్ డిటాక్స్ (నిర్విషీకరణ) చేయాలన్న లక్ష్యంతో విశిష్టమైన లేఖా రచన కార్యక్రమ నిర్వహణ.
- తపాలా బిళ్ళల సేకరణ, చక్కటి దస్తూరీ, స్టేషనరీ రూపకల్పన, చేతిరాతను మెరుగుపరచుకోవడం, గ్రాఫాలజీ (లిప్యధ్యయనం), ఆరిగామీ వంటి సృజనాత్మక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.
- తపాలా విభాగంతో కలిసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీ, రాజ్‌ఘాట్‌లోని గాంధీ దర్శన్‌లో ప్రముఖ లేఖా రచన ఉత్సవం డాక్‌రూంను ఆవిష్కరించారు.
భారతదేశంలో లేఖా రచన కళను పునరుద్ధరించేందుకు డిజిటల్ డిటాక్స్ చేయాలన్న లక్ష్యంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, గాంధీ స్మృతి, దర్శన్ సమితి మద్దతుతో ఇండియా పోస్ట్ (భారత తపాలా) విశిష్టమైన లేఖా రచనా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఉత్సవం ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ముఖ్య అతిథి అయిన గాందీ స్మృతి, దర్శన్ సమితి వైస్ చైర్మన్ శ్రీ విజయ్ గోయెల్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత తపాలా నుంచి వచ్చిన గౌరవ అతిథులు, మద్దతునిచ్చిన ఇతర భాగస్వాములు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల సమక్షంలో ప్రారంభం అయింది.
మన చరిత్ర, సంస్కృతిలో గొప్ప అంశమైన చేతివ్రాతతో సమాచారాన్ని ఇవ్వడాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో డాక్ రూం వంటి చొరవను చేపట్టడం పట్ల నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉమా నండూరి పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో, ప్రజల సంక్షేమం, ఆరోగ్యం కోసం అనేక కార్యకలాపాలు చేపడుతున్నాం. డిజిటల్ నిర్విషీకరణ అన్నది తక్షణ అవసరం, ఇటువంటి చొరవలు ప్రజలు కలాలను, కాగితాలను చేపట్టి అధ్యయనానికి, సమాచార మార్పిడికి ఒక శక్తిమంతమైన పరికరంగా ఉపయోగించేందుకు ప్రేరణను, స్ఫూర్తినిస్తాయన్నారు.
వినూత్నమైన, సృజనాత్మకమైన, ఆకర్షణీయమైన మార్గాల్లో అక్షరాలు రాయడానికి పిల్లలకు, వయోజనులైన వ్యక్తులకు పునఃపరిచయం చేయడానికి ఉద్దేశించిన ప్రత్యేకమైన వేడుకలో లేఖలు రాసి, పోస్ట్ చేయడం అనే అంశాలలో పోటీలు, వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ఈ వేడుకలలో లేఖలు రాయడం పట్ల అన్ని వయసుల వారినీ ఆకర్షించేందుకు వినోదకరమైన రీతులలో తపాలా విభాగం సంగీతం, నాటకాలు, నాట్యం, స్టాండప్ కామెడీ, షాపింగ్, ఆహారం, ఇంటరాక్టివ్ డెమొల వంటి ప్రదర్శనలను నిర్వహించింది.
తపాలా బిళ్ళల సేకరణ, చక్కటి దస్తూరీ, స్టేషనరీ రూపకల్పన, చేతిరాతను మెరుగుపరచుకోవడం, గ్రాఫాలజీ (లిప్యధ్యయనం), ఆరిగామీ వంటి సృజనాత్మక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు.





****
(Release ID: 1880879)
Visitor Counter : 176