మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఘనీభవించిన (ఫ్రోజెన్) చేపలు, మత్స్య ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువ చేయడానికి వెబినార్ నిర్వహించిన మత్స్య శాఖ

Posted On: 01 DEC 2022 1:02PM by PIB Hyderabad

* మత్స్య శాఖ కార్యదర్శి  శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షతన  జరిగిన  "ఘనీభవించిన చేపలు మరియు మత్స్య ఉత్పత్తులకు ప్రోత్సాహం" అనే అంశంపై  వెబ్‌నార్‌

*    ఘనీభవించిన  చేపలు మరియు చేపల ఉత్పత్తులను అందుబాటులో ఉంచి వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేయడానికి ప్రయత్నాలు మత్స్య శాఖ కార్యదర్శి

*  మత్స్య శాఖ అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రాధాన్యత అమలు జరుగుతున్న తీరు, మత్స్య రంగం ప్రస్తుత పరిస్థితి  వివరించిన  ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ సంయక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UAQ5.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00387TM.jpg

 

 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా “ఘనీభవించిన చేపలు మరియు చేపల ఉత్పత్తులను ప్రోత్సహించడం” అనే అంశంపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలు 2022 నవంబర్ 29న జాతీయ వెబ్‌నార్‌ను నిర్వహించాయి. మత్స్య శాఖ కార్యదర్శి  శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షతన  జరిగిన వెబినార్ లో  పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు,  వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మత్స్య శాఖ  అధికారులు , రాష్ట్ర వ్యవసాయం, వెటర్నరీ మరియు మత్స్య విశ్వవిద్యాలయాల అధ్యాపక సిబ్బంది, మత్స్య పరిశోధనా సంస్థలు, మత్స్య సహకార అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ నుంచి వాటాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ సంయక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా తన స్వాగత ఉపన్యాసంలో మత్స్య శాఖ అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రాధాన్యత అమలు జరుగుతున్న తీరు, మత్స్య రంగం ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అట్టడుగు వర్గాలకు పోషకాహారం   అందించడానికి, దేశంలో  చేపల వినియోగాన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రపంచ మత్స్యమార్కెట్‌లలో అనిశ్చితి ఏర్పడినప్పుడు తలెత్తే పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశీయంగా   చేపల వినియోగాన్ని పెంపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని   భారతదేశం  రిస్క్ మిటిగేషన్ ప్లాన్  రూపొందిందని అన్నారు. 

వెబినార్ లో  మత్స్య శాఖ కార్యదర్శి  శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. చేపలు తింటున్న వారి సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నామని అన్నారు.  ముఖ్యంగా ఘనీభవించిన  చేపలు మరియు మత్స్య  ఉత్పత్తుల విక్రయానికి ఎక్కువ చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు.   ఘనీభవించిన  చేపలు మరియు చేపల ఉత్పత్తులను వినియోగదారులకు  అందుబాటులోకి తీసుకుని రావడానికి అమలు చేస్తున్న ప్రణాళికను ఆయన ప్రస్తావించారు. వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎగుమతి చేస్తున్న మత్స్య సంపద విషయంలో అమలు చేస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఘనీభవించిన  చేపలు మరియు చేప ఉత్పత్తులకు అమలు చేయాలని  అన్నారు.  అవసరమైన లేబులింగ్,  ధృవపత్రాలతో దేశీయ మార్కెట్‌కు విస్తరించాలని ఆయన సలహా ఇచ్చారు. అదనంగా,పట్టణ ప్రాంతాలు , సెమీ-అర్బన్ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో మరియు వినియోగదారుల సంఖ్యను  పెంచడానికి ఇతర ఉత్పత్తుల  సరఫరాకు ఉపయోగిస్తున్న వ్యవస్థ ద్వారా ఘనీభవించిన  చేపలు మరియు చేప ఉత్పత్తులను సరఫరా చేయడానికి గల అవకాశాలను అన్వేషించాలని సూచించారు. 

సాంకేతిక అంశాలపై జరిగిన కార్యక్రమంలో  పరిశ్రమ నిపుణులు శ్రీ. జీఎస్  రత్ (సీనియర్ జనరల్ మేనేజర్, సేల్స్ మార్కెటింగ్, ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్), శ్రీ ఏజే   తారకన్ (చైర్మన్, అమాల్గామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్), మరియు శ్రీ  మాథ్యూ జోసెఫ్ ( ఫ్రెష్ టు హోమ్ సీఈవో )  తదితరులు మార్కెట్ పరిస్థితులు , వినియోగదారుల అభిరుచులు  మరియు ఘనీభవించిన  చేపలు మరియు చేపల ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే సాంకేతిక అంశాలపై ప్రసంగించారు.  ప్రస్తుత మార్కెట్ పరిస్థితి  మరియు సాంకేతికతలపై జరిగిన చర్చలో నిపుణులు  తాజా చేపలతో పోలిస్తే ఘనీభవించిన చేపలు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడక పోవడం, సరఫరా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, వినియోగదారు మార్కెట్‌లో  ఘనీభవించిన  చేపలు మరియు చేపల ఉత్పత్తులు తక్కువగా లభించడం లాంటి అంశాల వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న   సవాళ్లను కూడా నిపుణులు ప్రస్తావించారు.

మార్కెట్ విస్తరణకు గల అవకాశాలు, అమ్మకాలు ఎక్కువ చేయడానికి అమలు చేయాల్సిన  వ్యూహాలను నిపుణులు  సిఫార్సు చేశారు. వినియోగదారు ఘనీభవించిన  చేపలు మరియు చేపల ఉత్పత్తుల  మార్కెట్  అభివృద్ధి చేయడం లాంటి అంశాలను నిపుణులు వివరించారు. పారదర్శకత ధర, , నాణ్యత మరియు వ్యాపార సౌలభ్యం కోసం క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలను తీసుకురాగల చేపల మార్కెట్లను నిర్వహించడం గురించి విధానాలు అభివృద్ధి చేయడానికి గల అవకాశాలు వివరించారు. 

పారిశ్రామిక విధానాలపై నిపుణులు ప్రదర్శించిన  వీడియోలు, ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు  వెబ్‌నార్ ను విజయవంతం చేశాయి. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసే అంశంపై కూడా చర్చలు జరిగినాయి.    మరియు ఓపెన్ ఫోరమ్‌లో తీసుకున్న ప్రశ్నలు సెషన్‌ను ఇంటరాక్టివ్‌గా మరియు ఫలవంతమైనవిగా చేశాయి. సెక్టోరల్ స్ట్రాటజీలు మరియు యాక్షన్ ప్లాన్‌లను మరింత అభివృద్ధి చేయడానికి అంతర్దృష్టితో కూడిన చర్చల నుండి ఫాలో-అప్ యాక్షన్ పాయింట్‌లు కూడా వచ్చాయి.    మత్స్య శాఖ  అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ ఎస్ కె  ద్వివేది వందన సమర్పణ చేశారు. 



(Release ID: 1880320) Visitor Counter : 154