నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రధాన పోర్టుల అధికారులకు జెఎన్పిఎ పునశ్చరణ తరగతులు. ఆయా రంగాల నిపుణులు, ప్రముఖ అధ్యాపకులతో తరగతుల నిర్వహణ
Posted On:
29 NOV 2022 3:35PM by PIB Hyderabad
భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ (జెఎన్పిఎ), జెఎన్.పి.ఎ శిక్షణ సంస్థలో ప్రధాన పోర్టు అధికారులకు పునశ్చరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది . రెండువారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 2022 నవంబర్ 28న ప్రారంభించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 9,2022 న ముగుస్తుంది. షిప్పింగ్ మాజీ డి.జి ,ఇండియన్ మారీ టైమ్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ మాలిని శంకర్, ఈ పునశ్చరణ తరగతులను ప్రారంభించారు. జె.ఎన్.పి.ఎ ఛైర్మన్ శ్రీ సంజయ్ సేథి,ఐఎఎస్, ఎం.పి.ఎస్.ఇ.జడ్ మాజీ డైరక్టర్ శ్రీ రాజీవ్ సిన్హ, నిపుణులైన ఫాకల్టీ సభ్యులు దేశంలోని ప్రధాన పోర్టులకు చెందిన వారి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
దేశంలోని ప్రధాన పోర్టులకు చెందిన అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడం అనేది ఈ తరహా శిక్షణలలో ఇదే మొదటిది. పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వశాఖ వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పబ్లిక్, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు తమ నైపుణ్యాలను ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారితో పంచుకునేందుకు అవకాశం కల్పించారు. పోర్టుల నిర్వహణలో నూతన ధోరణులను తీసుకువచ్చేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షిప్పింగ్ మాజీ డిజిపి, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మాలిని శంకర్, దేశంలోని అన్ని ప్రధాన పోర్టులకు చెందిన అధికారుల నైపుణ్యాలను మరింత మెరుగు పరిచేందుకు,
వారి సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు నిపుణులైన ఫాకల్టీ సభ్యుల చేత ఈ పునశ్చరణ శిక్షణా తరగతులను నిర్వహించడంలో జెఎన్ పిఎ అద్భుత చొరవ తీసుకున్నదని అన్నారు. రెవిన్యూ నమూనా, యాజమాన్య నమూనా, పోర్టుల రంగంలో పిపిపి, లాజిస్టిక్లు సరఫరా చెయిన్ తదితరాల పై శిక్షణ ప్రస్తుతం ఈ రంగంలో గల అవసరాలను , ఆకాంక్షలను తీర్చడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
జెఎన్పిఎ ఛైర్మన్, ఐఎఎస్ అధికారి శ్రీ సంజయ్ సేథి మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం ,ప్రత్యేకించి ప్రస్తుతం మారుతున్న పనిపరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నదన్నారు. రెండు వారాలలో ఈ రంగంలోని అత్యంత నిపుణులైన ఫాకల్టీ ఎన్నో అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారని అన్నారు. ఈ పునశ్చరణ కార్యక్రమం పోర్టు రంగానికి సంబంధించి సమగ్ర దృక్ఫథాన్ని కలిగిస్తుందన్నారు. పోర్టు రంగం మొత్తంగా అభివృద్ధి చెందేందుకు శిక్షణ పట్ల ఆసక్తి కలిగించడమే కాక , తమకు తెలిసిన పరరిజ్ఞానం ఇతరులతో పంచుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుందని అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం మొదటి వారం థీమ్, పోర్టు ఆపరేషన్స్ , ఇకో సిస్టమ్.ఇందుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులైనవారు పోర్ట్ ఆఫ్ అంత్వెర్ప్ ఇంటర్నేషనల్కు చెందిన వారు శిక్షణనిస్తారు. రెండో వారం థీమ్ మేనేజిరియల్ ఎఫెక్టివ్ నెస్ అనే అంశం. ఇందులో ఇండోర్ ఐఐఎం నుంచి నిపుణులైన ప్రోఫెసర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శిక్ణణ ఇవ్వనున్నారు.ఎస్.ఇ.జెడ్,ఎంఎంఎల్పి తదితరాలకు సంబంధించి పానల్ చర్చలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న వారికి ఫీల్డ్ విజిట్లు నిర్వహించనున్నారు.
రెండు వారాల పునశ్చరణ తరగతుల సందర్భంగా, ఈకార్యక్రమంలో పాల్గొనేవారు, పోర్టులకు సంబంధించి వివిధ అంశాలపై సమగ్ర అవగాహన పొందనున్నారు. ఫైనాన్స్, ఆపరేషన్స, డిజిటైజేషన్, డ్రెడ్జింగ్, పోర్టులలో ప్రైవేటు రంగం ప్రమేయం పోర్టుల రంగం వ్యూహం, పోర్టులకు సంబంధించిన బిజినెస్ యూనిట్లు వంటి వాటిపై అవగాహన పొందుతారు.
పిపిపి ప్రాజెక్టుల గుర్తింపు, రాయతీ ఒప్పందానికి రూపకల్పన, మంచి ప్రాజెక్టు కాంట్రాక్టులు, పర్యావరణ అనుమతుల వంటి రెగ్యులేటరీ క్లియరెన్సులు, మోడల్ పోర్టు డవలప్మెంట్ కు సంబంధించి సమగ్ర అంచనా తదితరాలతోపాటు ఎన్నో ఇతర అంశాలు ఈ సందర్బంగా ప్రస్తావనకు రానున్నాయి.
***
(Release ID: 1880175)
Visitor Counter : 115