నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఐఎంఓ వ్యూహాత్మక ప్రణాళికలో డిజిటైజషన్ ను చేర్చాలన్న యూఏఈ ప్రతిపాదనకు భారత్ మద్దతు
అన్ని ఐఎంఓ కన్వెన్షన్‌ల ప్రకారం అవసరమైన అన్ని షిప్‌ల ధృవీకరణలు మరియు వాణిజ్య పత్రాల డిజిటలైజ్
మారిటైమ్ సింగిల్ విండో సిస్టమ్‌ను స్వీకరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుంది: డాక్టర్ సంజీవ్ రంజన్, కార్యదర్శి, ఎంఓపిఎస్డబ్ల్యూ
Posted On:
30 NOV 2022 3:53PM by PIB Hyderabad
లండన్‌లో జరుగుతున్న కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) 128వ సెషన్‌లో పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ (ఎంఓపిఎస్డబ్ల్యూ) సెక్రటరీ డాక్టర్ సంజీవ్ రంజన్ మాట్లాడుతూ, డిజిటలైజేషన్ అంశాన్ని చేర్చాలనే యూఏఈ ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇస్తుందని, తదుపరి వ్యూహాత్మక ప్రణాళిక అలాగే డిజిటలైజేషన్ చొరవలో భాగంగా మారిటైమ్ సింగిల్ విండో సిస్టమ్‌ను స్వీకరించడాన్నీ భారత్ సమర్థిస్తుందని అన్నారు. ఎందుకంటే ఇది మెరిటైం పరిశ్రమలో ఎదుర్కొంటున్న నియంత్రణ అడ్డంకులను పరిష్కరించడంలో సహాయపడుతుందని, డిజిటైజేషన్ కోసం నిర్ధారిత కాలపరిమితితో కూడిన కార్యాచరణలు ఐఎంఓ వ్యూహాత్మక దిశలలో భాగంగా ఉండాలని చెప్పారు.
డాక్టర్ సంజీవ్ రంజన్, కాప్ 27లో భారతదేశం ప్రకటనపై మరింత స్పష్టం చేశారు. మానవాళికి సురక్షితమైన ప్రపంచం లోకి వెళ్లడం అనేది మన మార్గదర్శక సూత్రంగా వాతావరణ న్యాయంతో సమానత్వంతో చేపట్టాల్సిన ఉమ్మడి ప్రయాణం అని అన్నారు. ఇందుకోసం డీకార్బొనైజేషన్ మరియు నిధులనుసమకూర్చడం అన్నది ప్రత్యేక వ్యూహాత్మక దిశగా వెళ్లాల్సి ఉంటుందని అయన తెలిపారు.
'ఎవరినీ మినహాయించ కూడదు' అనే భావనతో సహా 'సామర్థ్యం-నిర్మాణ దశాబ్దం 2021-2030' వ్యూహంపై యూఏఈ ప్రతిపాదనను భారతదేశం అభినందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు సహాయం చేయడానికి సాంకేతిక సహకార కమిటీ పని ద్వారా ఐఎంఓతో అందుబాటులో ఉన్న ఆర్థిక , సాంకేతిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి భారతదేశం ఈ అంశాన్ని కీలకమైనదిగా పరిగణిస్తుంది' అని డాక్టర్ సంజీవ్ రంజాన్ తెలిపారు.
భద్రత, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడం, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను నియంత్రించడం - డిజిటల్ విప్లవాన్ని షిప్పింగ్ స్వీకరించగలదని నిర్ధారించడానికి ఐఎంఓ పని చేస్తోంది. షిప్పింగ్, పోర్ట్‌లు, లాజిస్టిక్స్ నుండి సంబంధిత వాటాదారులందరి మధ్య సహకారం, షిప్పింగ్ డిజిటలైజేషన్‌ను నడపడానికి, దాని సామర్థ్యాన్ని స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి చాలా ముఖ్యమైనది.
***
(Release ID: 1880174)
Visitor Counter : 131