సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (అకాం) కింద ప్రముఖఆధ్యాత్మిక నేతలతో సమావేశాన్ని నిర్వహించినసాంస్కృతిక మంత్రిత్వ శాఖ


భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడానికియువత ఏకం కావాలి: శ్రీ జి. కిషన్ రెడ్డి 

అకాం కింద 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు,150కి పైగా దేశాల్లో లక్షకు పైగా కార్యక్రమాలను నిర్వహించాం: శ్రీ జి. కిషన్ రెడ్డి 

స్వాతంత్ర్య పోరాటంలో ఆధ్యాత్మిక నాయకులు కూడాముఖ్యమైన పాత్ర పోషించారు: భారతదేశ ప్రధాన విలువ ఆధ్యాత్మికత: శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్

Posted On: 30 NOV 2022 7:01PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

సదస్సు కు 26 ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరు

జన్ భగీదరితో ఆకాం ను విజయవంతం చేయడంపై చర్చలు

 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ఆధ్యాత్మిక నాయకుల సమావేశాన్ని నిర్వహించింది, ఇందులో 26 ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో మార్గనిర్దేశం చేయడానికి పాల్గొనడానికి ఆధ్యాత్మిక నాయకులను ప్రోత్సహించారు.

 

ఈ సమావేశానికి సాంస్కృతిక, పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ , సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ , ఆధ్యాత్మిక సంస్థల అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా శ్రీ జి. కిష న్ రెడ్డి మాట్లాడుతూ, " అకాం కింద 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు, 150కి పైగా దేశాల్లో లక్షకు పైగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి ఇది ఒక పెద్ద విజయం. అకామ్ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది 130 కోట్ల మంది భారతీయుల కార్యక్రమం‘‘ అని అన్నారు. భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉందని, మతం, ప్రాంతం, భాషకు అతీతంగా అందరూ కలిసి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.

 

ఈ  సందర్భంగా శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ మాట్లాడుతూ, "భారత దేశ అభివృద్ధికి మానవీయ కోణం ఉండాలని, ఇది ఆధ్యాత్మిక గురువుల మార్గ దర్శకత్వంలో మాత్రమే సాధ్య మవుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారని‘‘ గుర్తు చేశారు. స్వామి వివేకానంద, స్వామి దయానంద్ లను ఉదాహరణగా పేర్కొంటూ, "స్వాతంత్ర్య పోరాటంలో ఆధ్యాత్మిక నాయకులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. భారతదేశ ప్రధాన విలువ ఆధ్యాత్మికత‘‘ అని అన్నారు. ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, అప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశం కల నెరవేరుతుందని ఆయన అన్నారు.

 

ఈ సదస్సులో ఉత్తరాఖండ్ లోని పరమనికేతన్ ఆశ్రమ అధ్యక్షుడు పూజ్య స్వామి చిదానంద్ సరస్వతి , హరిద్వార్ లోని గాయత్రి తీర్థ్ శాంతికుంజ్ అధిపతి డాక్టర్ ప్రణవ్ పాండ్యా; పూరీలోని క్రియా యోగా టీచింగ్ అండ్ మెడిటేషన్ సెంటర్ కు చెందిన స్వామి యోగేశ్వరానంద్ ప్రసంగించారు.

 

ప్రగతిశీల స్వతంత్ర భారతదేశ 75 సంవత్సరాలను స్మరించుకుంటూ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (అకాం)' వేడుకలు జరుగుతున్నాయి. దేశాభివృద్ధికి, దాని పరిణామాత్మక ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన భారత ప్రజలకు ఇది అంకితం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు సంబంధించి సాంస్కృతిక గర్వకారణం అనే ఇతివృత్తంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

****



(Release ID: 1880167) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi , Punjabi