యు పి ఎస్ సి

యుపిఎస్‌సి స‌భ్యురాలిగా ప‌ద‌వీ స్వీకారం చేస్తూ గోప్య‌త ప్ర‌మాణం చేసిన మాజీ ఐఎఎస్ అధికారి ప్రీతీ సూడాన్

Posted On: 29 NOV 2022 1:41PM by PIB Hyderabad

యుపిఎస్‌సి ప్ర‌ధాన భ‌వనంలోని సెంట్ర‌ల్ హాల్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మాజీ ఐఎఎస్ అధికారి ప్రీతీ సూడాన్ యుపిఎస్‌సి స‌భ్యురాలిగా  ప‌ద‌వీ స్వీకారం చేస్తూ గోప్య‌త ప్ర‌మాణం చేశారు. ఆమె చేత యుపిఎస్‌సి చైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోనీ ప‌ద‌వీ ప్ర‌మాణం చేయించారు. 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేడర్‌కు చెందిన 1983వ బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ప్రీతీ సూడాన్ కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి జులై 2020లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆమె ఆహారం&ప్ర‌జా పంపిణీ విభాగం, మ‌హిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌, ర‌క్ష‌ణ శాఖ‌లో కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. ప్రీతీ సూడాన్ ఎక‌న‌మిక్స్‌లో ఎం.ఫిల్‌ను, సోష‌ల్ పాల‌సీ & ప్లానింగ్‌లో ఎంఎస్సీని లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌న‌మిక్స్ (ఎల్ ఎస్ ఇ) నుంచి పూర్తి చేశారు.
దేశంలో బేటీ బ‌చావ్‌, బేటీ ప‌ఢావ్‌, ఆయుష్మాన్ భార‌త్ వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌డ‌మే కాక‌, జాతీయ మెడిక‌ల్ క‌మిష‌న్‌, ఆలీడ్ హెల్త్ ప్రొఫెష‌న‌ల్స్ క‌మిష‌న్ & ఇ- సిగిరెట్ల‌పై నిషేధం వంటి చెప్పుకోద‌గిన సేవ‌లు అనేకం అందించారు. 

 


ప్ర‌పంచ బ్యాంక్ క‌న్స‌ల్టెంట్‌గా కూడా శ్రీ‌మ‌తి సూడాన్ వ్య‌వ‌హ‌రించారు. ఆమె పొగాకు నియంత్ర‌ణ పై  ఫ్రేమ్‌వ‌ర్క్ క‌న్వెన్ష‌న్ సిఒపి-8 అధ్య‌క్షురాలిగా, ప్ర‌సూతి, న‌వ‌జాత‌, శిశు ఆరోగ్యంలో భాగ‌స్వామ చొర‌వ‌కు ఉపాధ్య‌క్ష‌రాలిగా,  అంత‌ర్జాతీయ డిజిట‌ల్ ఆరోగ్య భాగ‌స్వామ్యం అధ్య‌క్షురాలిగా, మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధ‌త‌, ప్ర‌తిస్పంద‌న పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన స్వ‌తంత్ర ప్యానెల్ స‌భ్యురాలిగా వ్య‌వ‌హ‌రించారు. 

 

***



(Release ID: 1879794) Visitor Counter : 129