సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తి కష్టాలపై రూపొందిన ఇరానీ చిత్రం ‘నర్గేసి’ ఐఎఫ్‌ఎఫ్‌ఐ53లో ఐసిఎఫ్‌టి-యునెస్కో గాంధీ పురస్కారం గెలుచుకుంది.


‘డౌన్స్ సిండ్రోమ్’ ఉన్న వ్యక్తులు దేవదూతలు.వారి జీవితం గురించిన చాలా అద్భుతమైన కథలు వినాలి: దర్శకుడు పాయం ఎస్కందారి

మహాత్మా గాంధీ సూచించిన శాంతి, సహనం మరియు అహింస యొక్క ఆదర్శాలను ఉత్తమంగా ప్రతిబింబించే చిత్రంగా దర్శకుడు పాయం ఎస్కందారి రచించిన ఇరానియన్ చిత్రం నర్గేసి 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఐసిఎఫ్‌టి-యునెస్కో గాంధీ పురస్కారాన్ని గెలుచుకుంది.

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తి  జీవితంలో అది సృష్టించే భారం మరియు పరిణామాల గురించి ఈ చిత్రం ఉంటుంది. అవార్డు గెలుచుకున్న ఈ చిత్రంలో కరుణ మరియు సున్నితత్వం  రెండు లక్షణాలు.

డైరెక్టర్ పాయం ఎస్కందారి తన వర్చువల్ సందేశంలో ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు "ఈ అవార్డును అందుకోవడం చాలా గొప్ప గౌరవం, నన్ను నమ్మిన వారికి, ఈ సినిమాను రూపొందించినందుకు, ముఖ్యంగా నా కుటుంబానికి - నా ప్రియమైన భార్య మరియు నర్గేసిలోని నటీనటులు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను." అని తెలిపారు.

 

image.png


అతను ఇంకా మాట్లాడుతూ.. 'డౌన్స్ సిండ్రోమ్' ఉన్న వ్యక్తులు  దేవదూతలు అని తాను నమ్ముతున్నానని మరియు వారి జీవితం గురించి చాలా అందమైన కథలు వినవలసి ఉంది." అని చెప్పారు.

ఈ సంవత్సరం ఐసిఎఫ్‌టి-యునెస్కో గాంధీ మెడల్ కోసం పోటీ పడేందుకు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ విభాగంలో పోటీ పడిన చిత్రాలు:

 

  • ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ (బంగ్లాదేశ్ | 2022)
  • ఫార్చ్యూన్ (తజికిస్తాన్ | 2022)
  • తల్లి (బల్గేరియా | 2022)
  • నాను కుసుమ (భారతదేశం | 2022)
  • నర్గేసి (ఇరాన్ | 2021)
  • పలోమా (బ్రెజిల్, పోర్చుగల్ | 2022)
  • సౌదీ వెల్లక్క (భారతదేశం | 2022)
  • కాశ్మీర్ ఫైల్స్ (భారతదేశం | 2021)
  • వైట్ డాగ్ (కెనడా | 2022)


ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రతిసంవత్సరం ఐసిఎఫ్‌టి పారిస్ మరియు యునెస్కో ఉమ్మడిగా ఒక చిత్రానికి గాంధీ పురస్కారాన్ని అందజేస్తాయి. ఐసిఎఫ్‌టి-యునెస్కో గాంధీ అవార్డు కోసం పోటీపడే సినిమాలు మొదట ఐఎఫ్‌ఎఫ్ఐలో ప్రదర్శించబడతాయి మరియు ఐసిఎఫ్‌టి జ్యూరీ యునెస్కో ఆదర్శాల ఆధారంగా చిత్రాలను అంచనా వేస్తుంది.

మహాత్మా గాంధీ 125వ జయంతిని పురస్కరించుకుని యునెస్కో 1994లో స్మారక పతకాన్ని విడుదల చేసింది. అప్పటి నుండి ఐసిఎఫ్‌టి యునెస్కో గాంధీ అవార్డు మహాత్మా గాంధీ నిర్దేశించిన శాంతి, సహనం మరియు అహింస  ఆదర్శాలను ఉత్తమంగా ప్రతిబింబించే చిత్రానికి ఇవ్వబడుతుంది.

 
చిత్రం: నర్గేసి

ఇరాన్ | 2021 | పర్షియన్ | 84 నిమిషాలు | కలర్‌

 

image.png

తారాగణం & సిబ్బంది

దర్శకుడు & స్క్రీన్ రైటర్: పాయం ఎస్కందారి

నిర్మాత: షహబ్ హొస్సేనీ

డిఓపి: మహ్మద్ నమ్దార్

తారాగణం: హోస్సేన్ ఎస్కందారి, షహబ్ హోస్సేనీ, గజల్ నాజర్


కథాంశం:

ఈ చిత్రం డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తి చేసిన పోరాటాలను వర్ణిస్తుంది. అతని గొప్ప కోరిక ప్రేమను కనుగొని వివాహం చేసుకోవడం మరియు ఆ నేపథ్యంలో అతను ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఒక బహుమతి అతని జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే వరకు ప్రస్తుత ప్రపంచం అతనికి మరియు అతని ప్రేమకు చోటు ఇవ్వదు.
 
డైరెక్టర్ గురించి:

‘నర్గేసి’, ‘ది గుడ్, ది బ్యాడ్, ది కార్నీ’ (2017) మరియు ‘మోహే’ (2016) చిత్రాలతో గుర్తింపు పొందిన ఇరాన్ యువ దర్శకుడు పాయం ఎస్కందారి..నటుడిగా మరియు రచయితగా కూడా పనిచేశారు.

 

 

***

iffi reel

(Release ID: 1879688) Visitor Counter : 203