సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

క్లీన్-ఎ-థాన్ కార్యక్రమ నినాదం "నా గాండ్గీ కరుంగా, నా కర్నే దుంగా."


"క్లీన్ అండ్ గ్రీన్ గోవాకు కట్టుబడి ఉన్నాము." - డాక్టర్ ప్రమోద్ పి సావంత్

"క్లీన్ గోవా భారతదేశానికి పర్యాటక రాజధానిగా మారుతుంది." శ్రీమతి అమృతా ఫడ్నవిస్, దివ్యాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు.

మిరామార్ బీచ్‌లో క్లీన్-ఎ-థాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్

Posted On: 28 NOV 2022 4:42PM by PIB Hyderabad

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ), 2022 చివరి రోజు మిరామార్ బీచ్‌లో క్లీనింగ్ డ్రైవ్‌తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గోవా ప్రభుత్వం..దివ్యాజ్ ఫౌండేషన్ మరియు భామ్లా ఫౌండేషన్‌లతో కలిసి నిర్వహించింది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి చేపట్టిన కార్యక్రమాలలో క్లీన్-ఎ-థాన్ అనేది ఓ కార్యక్రమం. ఇది గోవా రాష్ట్ర నివాసితులకే కాదు, పర్యాటకులకు కూడా వర్తిస్తుంది.

ఈ  ఉదయం మిరామార్ బీచ్‌లో బీచ్ క్లీనింగ్ డ్రైవ్‌తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ పి సావంత్, దివ్యాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి అమృత ఫడ్నవిస్, గోవా క్యాబినెట్ సభ్యులు నాయకత్వం వహించారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, కరణ్ కుంద్రా మరియు కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా కూడా క్లీన్-ఎ-థాన్‌లో పాల్గొన్నారు.

image.png

 

ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ సావంత్ మాట్లాడుతూ “మనం మన బీచ్‌లను శుభ్రంగా ఉంచుకుందాం. అయితే పర్యాటకులకు కూడా చేరువ కావాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. గోవా జనాభాలో చాలా ఎక్కువ భాగం ఉన్న పర్యాటకులు కూడా ఈ ప్రయత్నాలలో పాలుపంచుకున్నప్పుడే మనం గోవాను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచగలము. మనది నీలి ఆర్థిక వ్యవస్థ. నది మరియు సముద్రపు నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు చాలా ముఖ్యం. కాబట్టి నీటిని కలుషితం చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను" అని చెప్పారు. అలాగే  “ గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ప్రారంభించబడిన స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్ కార్యక్రమం 104 కిలోమీటర్ల పొడవైన గోవా తీరప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులు మరియు స్వచ్ఛంద సంస్థలు ఈ మిషన్లలో ఎల్లప్పుడూ పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో పర్యాటకులు చేరినప్పుడు మన పరిశుభ్రత లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించబడుతుంది" అన్నారు. తమ ప్రభుత్వ పర్యావరణ లక్ష్యాలు కేవలం బీచ్‌లకే పరిమితం కాకుండా హైవేలు, మున్సిపాలిటీలకు కూడా విస్తరించాయని ఆయన వివరించారు. ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ "మేము క్లీన్ అండ్ గ్రీన్ గోవాకు కట్టుబడి ఉన్నాము మరియు కొనసాగుతాం" అని తెలిపారు.

 

image.png


ఈ క్లీన్-ఎ-థాన్ కార్యక్రమం అవగాహనను వ్యాప్తి చేయడమే కాకుండా, చర్యను కూడా ప్రారంభించింది. ఈ ఉదయం బీచ్‌ ప్రముఖులు మరియు వాలంటీర్లు స్వయంగా శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా  ఇది స్పష్టమైంది.

ఈ సందర్భంగా శ్రీమతి ఫడ్నవిస్ మాట్లాడుతూ “గోవా తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే సంస్కృతిని కలిగి ఉంది. అయితే మనకు తెలిసిన పాఠాలను సవరించడం చాలా ముఖ్యం, కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చెత్తను వేయకూడదని గుర్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మనం ఆరోగ్యకరమైన సముద్ర జీవిని పొందగలము. మరియు మన పిల్లలకు మంచి వాతావరణం అందించగలం. “నా గాండ్గీ కరుంగా, నా కర్నే దుంగా” అనేదే ఈ కార్యక్రమ నినాదమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం గోవాను భారతదేశ పర్యాటక రాజధానిగా మారుస్తుందని ఆమె ఆశించారు.

 

image.png

 

గోవాలో పరిశుభ్రత కార్యక్రమాలలో విశేషమైన పురోగతిని సాధించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను ఈ కార్యక్రమంలో భాగంగా సత్కరించారు. గోవాను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వమే కాకుండా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు మరియు పర్యాటకులు తమ వంతు కృషి చేయాలన్న స్ఫూర్తిని ఈ కార్యక్రమం తెలిపింది.

 

* * *



(Release ID: 1879663) Visitor Counter : 150