రక్షణ మంత్రిత్వ శాఖ
మలేషియా, క్లువాంగ్‌లోని పులాయ్‌లో ప్రారంభమైన భారత్ - మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు హరిమావ్ శక్తి -2022
Posted On:
28 NOV 2022 1:31PM by PIB Hyderabad
భారత్- మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు హరిమావ్ శక్తి -2022 నవంబర్ 28న మలేషియాలో క్లువాంగ్‌లోని పులాయ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు 12 డిసెంబర్ 22న ముగియనున్నాయి. భారత్- మలేసియాల వార్షిక శిక్షణా కార్యక్రమం హరిమావ్ శక్తి విన్యాసాలు. వీటిని 2012 నుంచి నిర్వహిస్తున్నారు.
భారత సైన్యంలో పోరాట అనుభవం కలిగిన గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ దళాలు, మలేషియా సైన్యానికి చెందిన రాయల్ మలయ్ రెజిమెంట్‌కు చెందిన దళాలు ఈ ఏడాది ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి. అటవీ భూభాగంలో వివిధ ఆపరేషన్లకు ప్రణాళికలు రూపొందించుకునేందుకు & అమలు చేయడంలో అంతర్ కార్యాచరణను పెంచేందుకు ఆపరేషన్ల సందర్భంగా తాము పొందిన అనుభవాలను వీరు పంచుకోనున్నారు. అటవీ భూభాగంలో నిర్వహించే సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్లలో ఈ విన్యాసాల పరిధిలో బెటాలియన్ స్థాయిలో కమాండ్ ప్లానింగ్ ఎక్స్‌ర్‌సైజ్ (సిపిఎక్స్), కంపెనీ స్థాయిలో ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ (ఎఫ్‌టిఎక్స్) ఉంటాయి.
ఈ సంయుక్త విన్యాసాల షెడ్యూలులో ఒక జాయింట్ కమాండ్ పోస్ట్ ఏర్పాటు, సంయుక్త నిఘా కేంద్రం, వైమానిక దళాలను ఉపయోగించడంలో నైపుణ్యాలను పంచుకోవడం, సాంకేతిక ప్రదర్శనలు, ఆపదచికిత్సా విభాగ నిర్వహణ & ఆపదలో చిక్కుకున్నవారి తరలింపు మాత్రమే కాకుండా బెటాలియన్ స్థాయిలో లాజిస్టిక్స్‌పై ప్రణాళికలు రూపొందించడం ఉంటాయి. సంయుక్త క్షేత్ర స్థాయి శిక్షణా విన్యాసాలు, సంయుక్త పోరాట చర్చలు, సంయుక్త ప్రదర్శనలతో రెండురోజుల ధ్రువీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఇందులో ఇరు దళాల మధ్య వ్యూహాత్మక నైపుణ్యాలను పెంచుకోవడం, అంతర్ కార్యాచరణను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి మాత్రమే కాక ఇరు సైన్యాల మధ్య సంబంధాలను ప్రోత్సహించడం ఉంటాయి.
హరిమావ్ శక్తి విన్యాసాలు భారతీయ సైన్యం, మలేషియా సైన్యాల మధ్య రక్షణ సహకార స్థాయిని పెంచుతూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందిస్తాయి.
****
(Release ID: 1879556)
Visitor Counter : 195