రక్షణ మంత్రిత్వ శాఖ
మాజీ సైనికోద్యోగుల విభాగం రేపు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సిఎస్ఆర్ సదస్సులో పాల్గొననున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
28 NOV 2022 12:17PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి) పరిధిలోని మాజీ సైనికుల విభాగం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ -సిఎస్ఆర్ (సాయుధ దళాల పతాక దినోత్సవ కార్పొరేట్ సామాజిక బాద్యత) నాలుగవ ఎడిషన్‌ను న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వృద్ధులు, వితంతువులు, వారిపై ఆధారపడిన వారి పునరావాసం, తిరిగి బందోబస్తు, సంక్షేమం కోసం ఈ కృషి దిశగా సిఎస్ఆర్ మద్దతును కూడగట్టడం వంటి మాజీ సైనికోద్యోగుల విభాగం చేపట్టే చర్యలను పట్టి చూపడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ సందర్భంగా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ (ఎఎఫ్ఎఫ్‌డిఎఫ్- సాయుధదళాల ఫ్లాగ్ డే నిధి) కోసం ఉద్దేశించిన ఒక నూతన వెబ్‌సైట్‌ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. ఈ నూతన వెబ్‌సైట్‌ను ఎఎఫ్ఎఫ్‌డిఎఫ్‌కి ఆన్‌లైన్ ద్వారా విరాళం ఇవ్వడాన్ని ప్రోత్సహించేందుకు పరస్పర చర్య కలిగిన, ఉపయోగ సౌలభ్యం కలిగిన పోర్టల్‌గా అభివృద్ధి చేశారు. ఈ ఏడాది సాయుధదళాల పతాక దినోత్సవానికి ప్రచారం కోసం రూపొందించిన గీతాన్ని విడుదల చేయడమే కాక నిధికి ప్రముఖ సిఎస్ఆర్ చందాదారులను సన్మానిస్తారు. సాయుధదళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇచ్చే కార్పొరేట్ సంస్థలు కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 135 కింద సిఎస్ఆర్ బాధ్యతను నెరవేరుస్తారు.
ఈ కార్యక్రమంలో రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరామనే, రక్షణ మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. సిఎస్ఆర్ సంస్థల సభ్యులు, మాజీ సీనియర్ సైనికులు, రక్షణ సేవల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
***
(Release ID: 1879554)
Visitor Counter : 158