సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఒటిటి, డిజిటల్ ప్లాట్ఫాం లతో నటనా రంగంలో అవకాశాలు పెరిగాయి : కాస్టింగ్ డైరక్టర్ ముఖేష్ చంద్ర


53వ ఐఎఫ్ ఎఫ్ ఐ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న కాస్టింగ్ డైరక్టర్లు ముఖేష్ ఛబ్రా, క్షితిజ్ మెహతా

Posted On: 25 NOV 2022 6:50PM by PIB Hyderabad

భారత  చలనచిత్ర రంగంలో కాస్టింగ్ ప్రక్రియ గురించి, కాస్టింగ్ డైరక్టర్ పాత్ర ఆవిర్భావం గురించి ఇఫి 53వ సమావేశాల సందరర్బంగా జరిగిన ముఖాముఖి
కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రముఖ కాస్టింగ్ డైరక్టర్ ముఖేష్ చబ్రా, కాస్టింగ్ అనేది ఎంతో ప్రాచీన ప్రక్రియ అని, అయితే కాస్టింగ్ డైరక్షన్ అనేది ఒక
ప్రత్యేక విభాగంగా నూతన ప్రక్రియ అని ఆయన అన్నారు.గతంలో అందుబాటులో ఉన్న నటీ నటులను డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంపికచేసుకునే వారని, కానీ నిప్పుడు
నటీనటుల ఎంపిక ప్రక్రియ మరింత ప్రొఫెషనల్గా జరుగుతున్నదన్నారు.
భారత చలనచిత్ర పరిశ్రమ రంగంలో కాస్టింగ్ రంగాన్ని ఒక క్రమపద్ధతికి తీసుకురావడంలో ముఖేష్ చబ్రా కీలకపాత్ర పోషించారు. అలాగే  కాస్టింగ్ రంగంలో మరో ముఖ్యమైన
పేరు క్షితిజ్ మెహతా. వీరు ఇరువురూ 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరువురూ, నూతన భారత సినిమాలో కాస్టింగ్ అనే
అంశంపై ఇరువురూ ప్రసంగించారు.కాస్టింగ్ ప్రక్రియ ఆవిర్భౄవంపైనా , భారత చలనచిత్ర రంగంలో కాస్టింగ్ రంగంపై  ఒటిటి  ప్లాట్ ఫాం ల ప్రభావంపైన మాట్లాడారు.అలాగే ప్రత్యేకమైన పాత్రలకు నటీనటుల ఎంపిక విషయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి కూడా ప్రస్తావించారు.  చలనచిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ రంగంపై ఒటిటి ప్లాట్ఫాంలు, డిజిటల్ ప్రపంచం ప్రభావం గురించి ప్రస్తావిస్తూ ముఖేష్ ఛబ్రా,ఒటిటి, డిజిటల్ ప్లాట్ఫారంలు పెరగడం వల్ల నటనా రంగంలో అవకాశాలు మరింతగా పెరిగాయన్నారు. డిజిటల్ రంగం ప్రయోగాలకు అవకాశాన్నిచ్చిందని ఆయన చెప్పారు.ముఖేష్ ఆలోచనలను మరింత ముందుకు తీసుకువెళుతూ క్షితిజ్ మెహతా, ఒటిటి ప్లాట్ఫారంలు కాస్టింగ్ ప్రక్రియను మరింత ఆసక్తిదాయంగా మలిచాయని అన్నారు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ వచ్చిన నటులు ఇప్పుడు వెబ్ సిరీస్లో, ఒటిటి లో చాలా పెద్ద పాత్రలలో కనిపిస్తున్నారన్నారు. ఒటిటి ప్లాట్ ఫారంలలో ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని, సులభతర కాస్టింగ్ కు అవకాశం కల్పించిందని, అందువల్ల ఈ ప్రక్రియ మరింత విశాలమైందన్నారు.నటీనటులకు వర్క్షాప్లు నిర్వహించాల్సిన అవసరం, వాటి ప్రాధాన్యతను గురించి ప్రస్తావిస్తూ, ఈ వర్క్షాప్ల ద్వారా నూతన నటీనటులు ఆయా పాత్రలలో నటించేందుకు వారిని సన్నద్ధులను చేయడానికి వారిలో మరింత పరిపక్వత తీసుకురావడానికి వర్క్షాప్లు ఉపకరిస్తాయన్నారు..శిక్షణ తీసుకోకుండానే కొందరు విజయంసాధించి ఉండవచ్చని అయితే ఈ శిక్షణను పూర్తి చేసుకుంటే వారు తేడాను గమనించగలుగుతారన్నారు. దీర్ఘకాలంలో దీని ప్రయోజనం కనిపిస్తుందని చెప్పారు.సోషల్ మీడియాలో పాపులారిటీ ప్రభావం, కాస్టింగ్ ప్రక్రియపై ఉంటుందా అని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, సోషల్ మీడియాలో పాపులర్ కావడం, నటుడిగా ఎంపికకావడం అనే వాటికి సంబంధం లేదని అన్నారు. ఆయా పాత్రలకు ఆడిషన్ ద్వారా నటీనటుల ఎంపిక జరుగుతుందన్నారు.నటులు కావాలంటే అందుకు శిక్షణ తీసుకోవాలని, నటనకు సంబంధించిన అవగాహన పెంచుకుని ఆ వృత్తికి నూరుశాతం న్యాయం చేసేవిధంగా

సిద్ధం కావాలని అన్నారు. ఈ విషయమై ముఖే ఛబ్రా ఆలోచనలతో క్షితిజ్ మెహతా ఏకీభవించారు.క్షితిజ్ మెహత్, ముఖేష్ ఛబ్రాలు భారతీయ చలనచిత్ర రంగంలో బంధుప్రీతి గురించి ఇతర అంశాల గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే అంశంపై  అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ  వారు, రాజ్కుమార్ రావు, ఆయష్మాన్, ఫాతిమా షేక్, రసికా దుగ్గల్, సన్యా మల్హోత్రా, మృణాల్ ఠాకూర్,వంటి ప్రతిభ కలవారు అవకాశాలను పొందుతున్నారని, వారు చలనచిత్ర పరిశ్రమ రంగంలో బాగా రాణిస్తున్నారని తెలిపారు.

***



(Release ID: 1879453) Visitor Counter : 93