సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఆశతో సాగే జీవిత కథ ఆధారంగా 'ఆయుష్మాన్'

Posted On: 26 NOV 2022 12:05PM by PIB Hyderabad

'ఆయుష్మాన్' ద్వారా హెచ్‌ఐవి రోగులకు సంబంధించిన సామాజిక కళంకం మరియు వివక్ష పరిష్కారానికి జరిగిన ప్రయత్నం ": చిత్ర దర్శకుడు జాకబ్ వర్గీస్
" ఆయుష్మాన్  అనేది హెచ్‌ఐవి రోగులపై సమాజంలో ఉన్న అన్ని సామాజిక కళంకం మరియు వివక్షను అధిగమించడానికి జరిగిన ప్రయత్నం. హెచ్‌ఐవి పాజిటివ్ నిర్ధారణ అయిన వారిపట్ల సమాజం వేసిన కళంకం, వివక్ష రూపుమాపడానికి  గ్రామీణ భారతదేశానికి చెందిన ఇద్దరు   14 ఏళ్ల  అబ్బాయిలు పరిగెత్తడం ద్వారా చేసిన ప్రయత్నం, రోగుల పట్ల సమాజంలో  సానుకూల మార్పు తీసుకురావడం కథ ఆధారంగా 'ఆయుష్మాన్' రూపుదిద్దుకుంది"  అని 'ఆయుష్మాన్'  చిత్ర దర్శకుడు జాకబ్ వర్గీస్ అన్నారు. గోవా టోడాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం  సందర్భంగా పిఐబి   2022 నవంబర్ 25న నిర్వహించిన   'టేబుల్ టాక్స్' సెషన్‌లో  మీడియా మరియు ఫెస్టివల్ ప్రతినిధులతో  జాకబ్ వర్గీస్ మాట్లాడారు.
డాక్యుమెంటరీ చిత్రం నిర్మించడానికి తనను ప్రేరేపించిన సంఘటనలను జాకబ్ వర్గీస్ వివరించారు.
“ పట్టుదలతో పనిచేసిన  అబ్బాయిలు తమ జీవితం ముగిసిపోయిందని భావించలేదు. తమకు ఎదురైన సవాల్ ను వారు ధైర్యంగా ఎదుర్కోవడం నన్ను చిత్రం తీయడానికి ప్రేరణ  మరియు స్ఫూర్తినిచ్చింది. తాము  ఎదుర్కొంటున్న భాదను కూడా బయటకు చెప్పకుండా    సవాలును స్వీకరించి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు." అని జాకబ్ వర్గీస్ తెలిపారు.
చిత్రాన్ని పూర్తి చేయడానికి జాకబ్ వర్గీస్ ఆరు సంవత్సరాలు శ్రమించారు. హెచ్‌ఐవి పాజిటివ్ నిర్ధారణ అయిన  పిల్లల కోసం ఏర్పాటు చేసిన  అనాథాశ్రమంలో అప్పటికి 12 సంవత్సరాల వయస్సు ఉన్న బాబు మరియు మానిక్ అనే అబ్బాయిలు తనకు తారసపడ్డారని   జాకబ్ వర్గీస్ చెప్పాడు.. "వారిలో ఒకరిని పుట్టిన వెంటనే తల్లిదండ్రులు వదిలివేశారు.  మరొకరు అతని కుటుంబం మరియు భవిష్యత్తు గురించి భయాలను అధిగమించడానికి పోరాడుతున్నారు. వారి తప్పు లేకుండా  హెచ్‌ఐవి   పాజిటివ్‌గా జన్మించిన వారిని నేను కలిసినప్పుడు, నాకు కలిగిన  మొదటి ఆలోచన .. వారు తమ జీవితాన్ని ఎలా గడుపుతారు, వారు ఎలా జీవిస్తారు మరియు వారు ఎంతకాలం జీవించి ఉంటారు,” అని  జాకబ్ వర్గీస్ తెలిపారు.    “ఈ ప్రశ్నలకు మా వద్ద సమాధానాలు లేవు.” అని కూడా జాకబ్ వర్గీస్ అన్నారు.
అయితే, ఇద్దరు అబ్బాయిలు ప్రదర్శించిన ధైర్యం జాకబ్ వర్గీస్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా ఇష్టపడే దాన్ని చేయడం అంటే, పరుగు పెట్టడం  ద్వారా తమ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు అని దర్శకుడు చెప్పారు.  పెద్ద లక్ష్యం నిర్ణయించుకుని దానిలో  రాణించాలనే తపనతో చిన్న దూరాలను ఆ తర్వాత  మొదట 10 కిలోమీటర్ల పరుగును ఎంచుకున్నారు.  మరియు తరువాత హాఫ్ మారథాన్ చేయడానికి అర్హత సాధించి  21 కిలోమీటర్ల దూరం పరుగు పందెంలో పాల్గొన్నారు అని జాకబ్ వర్గీస్ అన్నారు.
బాబు మరియు మానిక్ ప్రయాణాన్ని తెరకి ఎక్కించడానికి చేసిన ప్రయత్నాలను జాకబ్ వర్గీస్ వివరించారు. ' వారు తమ లక్ష్య సాధనలో నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించారు. తర్వాత వేగం పుంజుకున్నారు. వారి ప్రయాణం 5 ఖండాలు, 12 దేశాల్లో సాగింది. నేను వారిని అనుసరించాను మరియు వారి జీవితాన్ని డాక్యుమెంట్ చేసాను, ”అని అతను చెప్పాడు.
లక్ష్య సాధనలో  కీలక పాత్ర పోషించిన  శారీరక ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, దర్శకుడు ఇలా చెప్పాడు: “క్రీడలను చేపట్టడం వారికి ఆత్మవిశ్వాసం మరియు శక్తిని పెంపొందించడంలో మాధ్యమంగా పనిచేసింది. కానీ అన్నింటికంటే, వ్యాధికి సంబంధించిన కళంకాలను అధిగమించడంలో వారికి సహాయపడటంలో ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇది సరైన పోషకాహారం మరియు వర్క్ అవుట్ పరంగా వారికి చాలా సానుకూల మార్గంలో సహాయపడుతుంది. ” అని అన్నారు.
కళంకం వల్ల కలిగే మానసిక అశాంతి   శారీరక వ్యాధి వల్ల కలిగేవాటి కంటే చాలా పెద్ద పరిణామాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను కూడా ఆనందానికి దూరం చేస్తున్నాయని అన్నారు. వేగంగా ప్రచారం అవుతున్న అవాస్తవాలు దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. హెచ్‌ఐవి, కుష్టు వ్యాధి వంటి వ్యాధుల గురించి సరైన సమాచారం లేకపోవడంతో దీనికి ప్రధాన కారణమని  వర్గీస్ అన్నారు. జీవితాన్ని పూర్తిగా   అనుభవించడానికి వారికి సరైన వస్తువులు పొందలేని స్థితిలో కళంకం పడిన వ్యక్తులు ఉన్నారని జాకబ్ వర్గీస్ అన్నారు.
 గొప్ప ఆశ సాధన లక్ష్యంగా సాగిన అబ్బాయిల ప్రయాణం వారిలో సానుకూల మార్పు తెచ్చిందని  జాకబ్ వర్గీస్ తెలిపారు. అనాథాశ్రమంలో ఉన్న ఇతర పిల్లలకు వారిద్దరూ ఆదర్శంగా నిలిచారని  వర్గీస్ అన్నారు.  ఇతరులకు విశ్వాసం కల్పిస్తూ స్ఫూర్తి నింపుతూ  బాలురు తమ చివరి శ్వాస వరకు కృషి చేస్తారన్న  విశ్వాసం వ్యక్తం చేశారు.
 “ఇలాంటి సినిమాలకు మీరు ఖర్చు చేసిన డబ్బును కూడా మీరు తిరిగి పొందలేరు మరియు పండుగలు తప్ప వాటిని ప్రదర్శించడానికి మార్గాలు లేవు,” అని అతను నొక్కి చెప్పాడు మరియు బాబు మరియు మాణిక్ కథ నిజమైనది, కాబట్టి నేను నిజమైన వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాను. అందుకే డాక్యుమెంటరీగా తీశాను.”
గోవాలో  జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగంలో ఆయుష్మాన్ ప్రదర్శించబడింది.


 కన్నడ చలనచిత్ర పరిశ్రమలో  జాకబ్ వర్గీస్ తెలివైన, వాణిజ్యపరంగా విజయవంతమైన మరియు అధిక విలువలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.  భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత మరియు రచయిత అయిన జాకబ్ వర్గీస్ తన మనసుకు హత్తుకుని తనపై చిరస్థాయిగా నిలిచిపోయే అంశాల  మీద సినిమాలు తీయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. కదా వస్తువు , వ్యక్తిత్వం మాత్రమే కలిగిన అంశాలు  సినిమాలు చేయడానికి తనకు ప్రేరణ అని అన్నారు.
 “ఇలాంటి సినిమాలఫై  చేసే  ఖర్చు, పెట్టిన పెట్టుబడి  కూడా  తిరిగి రాదు. ఉత్సవాలు మినహా ఇటువంటి చిత్రాలు  మార్గాలు లేవు,” అని  జాకబ్ వర్గీస్  స్పష్టం చేశారు. బాబు మరియు మాణిక్ కథ నిజమైనది, కాబట్టి నేను నిజమైన వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాను. అందుకే డాక్యుమెంటరీగా తీశాను.” అని ఆయన వివరించారు.
గోవాలో  జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగంలో ఆయుష్మాన్ ప్రదర్శించబడింది.
సినిమా గురించి
దర్శకుడు: జాకబ్ వర్గీస్
నిర్మాతలు: దినేష్ రాజ్‌కుమార్ ఎన్, మాథ్యూ వర్గీస్, నవీన్ ఫ్రాంకో
స్క్రీన్ ప్లే: జాకబ్ వర్గీస్
సినిమాటోగ్రాఫర్: జాకబ్ వర్గీస్
ఎడిటర్: కల్వీర్ బిరాదార్, అశ్విన్ ప్రకాష్ ఆర్
సారాంశం:  ఇది గ్రామీణ భారతదేశంలో హెచ్‌ఐవి పాజిటివ్ సోకిన  ఇద్దరు 14 ఏళ్ల పిల్లల కథ. ఒకరు పుట్టుకతోనే అనాధ అయితే మరొకరు భవిష్యత్తుపై ఉన్న భయాలను అధిగమించడానికి పోరాడుతున్నారు. పరిగెత్తడం ద్వారా ప్రేరేపించబడి, వారు అవగాహన కల్పించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా సానుకూల మార్పును తీసుకురావడానికి, సామాజిక కళంకం మరియు వివక్షను అధిగమించారు.
నిర్మాత:  దినేష్ రాజ్‌కుమార్ ఎన్ సీనియర్ జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్ మరియు అవార్డు గెలుచుకున్న సినిమా నిర్మాత. ఆంధియం (2008) మరియు డ్రిబ్లింగ్ విత్ దేర్ ఫ్యూచర్ (2016). చిత్రాలకు దినేష్ రాజ్‌కుమార్ రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు  గెలుచుకున్నాడు.

***

 



(Release ID: 1879101) Visitor Counter : 154