రక్షణ మంత్రిత్వ శాఖ
74వ వార్షికోత్సవం జరుపుకోనున్న ఎన్‌సీసీ; అమరవీరులకు జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించిన రక్షణ శాఖ కార్యదర్శి
Posted On:
26 NOV 2022 10:52AM by PIB Hyderabad
1948లో ఏర్పాటైన, ప్రపంచంలోనే అతి పెద్ద యూనిఫారంతో కూడిన యువజన సంస్థ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) నవంబర్ 27, 2022న 74వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమణె పుష్పగుచ్ఛంతో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఎన్‌సీసీ తరపున, నవంబర్ 26, 2022న కొత్త దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
ఎన్‌సీసీ గత కొన్నేళ్లుగా విస్తృతంగా అభివృద్ధి చెందిందని, జాతి నిర్మాణానికి సహకరించే ప్రతి ప్రయత్నంలోనూ యూనిఫారంలోని యువత చేతులు కలిపిందని ఈ సందర్భంగా రక్షణ శాఖ ప్రశంసించారు. ఎన్‌సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ జరుపుతారు. మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో క్యాడెట్లు పాల్గొంటారు.
దేశంలో అతి పెద్ద స్వచ్ఛత కార్యక్రమం అయిన పునీత్ సాగర్ అభియాన్ నుంచి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్యాంపులు, స్వచ్ఛ భారత్ ప్రచారం, హర్ ఘర్ తిరంగా, ఎక్స్ యోగ్దాన్ (కొవిడ్ ఉపశమన శిబిరాలు), వరకు ఏ ఒక్క సంస్థ చేపట్టలేని అతి పెద్ద కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు భారీ, శాశ్వత ముద్ర వేశారు. ఇటీవలి కాలంలో లక్ష మంది యువ క్యాడెట్‌లను చేర్చుకోవడం ద్వారా దేశంలోని తీర ప్రాంత, సరిహద్దు ప్రాంతాల్లోనూ ఎన్‌సీసీ విస్తరించింది. ఇది, ఈ ప్రాంతాల్లోని యువతను సాయుధ దళాల్లో చేరడానికి, జాతి నిర్మాణంలో సహకరించడానికి ప్రేరేపించింది.
'యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్'లో (వైఈవీ) భాగంగా, తన క్యాడెట్‌లను శాంతి & ఐక్యత రాయబారులుగా 25కు పైగా దేశాలకు ఎన్‌సీసీ పంపింది. తద్వారా, అంతర్జాతీయ సంబంధాల వృద్ధి వేదికగా నాలుగు దశాబ్దాలుగా నిలుస్తోంది. వైఈపీ కింద 30కి పైగా మిత్రదేశాల క్యాడెట్‌లకు ఎన్‌సీసీ ఆతిథ్యం ఇచ్చింది.
ఎన్‌సీసీ బహుముఖ కార్యకలాపాలు, విభిన్న పాఠ్యాంశాలు స్వీయ అభివృద్ధి దిశగా యువతకు ప్రత్యేక అవకాశాలను అందిస్తాయి. అనేక మంది క్యాడెట్‌లు క్రీడలు, సాహసాల్లో అద్భుత ప్రతిభతో దేశం & సంస్థ గర్వపడేలా చేశారు.
******
(Release ID: 1879046)
Visitor Counter : 214