ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ

Posted On: 26 NOV 2022 9:25AM by PIB Hyderabad

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ రోజంతా వరకు వేడుకలు ఏర్పాటు చేసింది.

హిందీ, ఆంగ్లంలో రాజ్యాంగ పీఠిక పఠనంతో వేడుక ప్రారంభమైంది.

ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంలో, "భారతదేశం - ప్రజాస్వామ్యానికి జనని / भारत लोक तन्त्र की जननी" పేరిట నినాదాల రాత పోటీని నిర్వహించారు.

ఈ పోటీ తర్వాత, భారత రాజ్యాంగం గురించి మంత్రిత్వ శాఖ అధికారులు పరస్పర చర్చలు జరిపారు.

భారతదేశం, భారత రాజ్యాంగం అంశాల మీద మంత్రిత్వ శాఖ ఒక క్విజ్ కూడా నిర్వహించింది. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది అందరూ చురుగ్గా పాల్గొన్నారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో పోస్టర్లను ప్రదర్శించారు. 


 

*******


(Release ID: 1879044)