సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) కింద ఏకకాల సంగీత నాటక అకాడమీ అమృత్ పురస్కారాలను ప్రకటించిన సంగీత నాటక అకాడమీ
ప్రదర్శిత కళా ప్రక్రియలకు చెందిన 86 మంది కళాకారులు ఈ పురస్కారాలకు ఎంపిక
प्रविष्टि तिथि:
25 NOV 2022 6:18PM by PIB Hyderabad
ప్రధానాంశాలు:
- సంగీత నాటక అకాడమీ అమృత్ పురస్కారం కింద రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు), తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) కింద, 86 మంది కళాకారులకు ఏకకాల సంగీత నాటక అకాడమీ అమృత్ పురస్కారాలను సంగీత నాటక అకాడమీ ప్రకటించింది.
న్యూదిల్లీలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా'కు చెందిన సంగీత నాటక అకాడమీ సాధారణ సభ్యుల సభ దిల్లీలో ఈ నెల 6-8 తేదీల్లో సమావేశమైంది. ఎనభై ఆరు మంది (86) కళాకారులను ఈ ఏకకాల పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ప్రదర్శిత కళా ప్రక్రియలకు చెందిన, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కళాకారులు వీరిలో ఉన్నారు, తమ జీవితంలో ఇప్పటివరకు ఒక్క జాతీయ స్థాయి పురస్కారాన్ని కూడా అందుకోలేదు.
ఎంపికైన పురస్కార గ్రహీతలు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వివిధ రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. ఈ కళాకారులు భారతదేశంలోని వివిధ కళలను ప్రతిబింబిస్తారు.
సంగీత నాటక అకాడమీ అమృత్ పురస్కారం కింద రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు), తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు.
పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
****
(रिलीज़ आईडी: 1879026)
आगंतुक पटल : 201