సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
"ఫిక్సేషన్" చలన చిత్రం సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు కొరియా అధివాస్తవిక సినిమాల నుండి ప్రేరణ పొందింది : దర్శకుడు మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్
"ఫిక్సేషన్" అనేది ఒక ప్రయోగాత్మక చిత్రానికీ, కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రానికీ మధ్య ఒక చక్కని సమ్మేళనం : ప్రధాన నిర్మాత మాక్స్ టాప్లిన్
53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో, మిడ్ ఫెస్ట్ చలన చిత్రంగా, అంతర్జాతీయ ప్రీమియర్, మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం, "ఫిక్సేషన్" ను ప్రదర్శించారు. ఇది ఒక అధివాస్తవిక, మానసిక ఉద్రేకాలను రేకెత్తించే చిత్రం. ఇది సమాజంలోని వాస్తవికతను వెలుగు లోకి తీసుకువచ్చి, దుర్వినియోగ దారులను ప్రోత్సహించే శక్తులను బహిర్గతం చేస్తుంది, అదేవిధంగా, దుర్వినియోగం వల్ల దెబ్బతిన్న వారిని కూడా వెలుగులోకి తీసుకు వస్తుంది. చలన చిత్రోత్సవం సందర్భంగా పి.ఐ.బి. ఇఫీ 'టేబుల్ టాక్స్' లో మీడియాతోనూ, ఇతర ప్రతినిధులతోనూ, "ఫిక్సేషన్" డైరెక్టర్ మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్ మాట్లాడుతూ, సిగ్మండ్ ఫ్రాయిడ్ తో పాటు అతని ప్రసిద్ధ రోగి డోరా యొక్క కేస్ స్టడీ నుండి తన చిత్రం ప్రేరణ పొందిందని అన్నారు. ఇది ఒక అధివాస్తవిక చిత్రం కావడంతో, అమెరికా సినిమాల్లో సర్రియలిజం అంతగా లేనందువల్ల, "ఫిక్సేషన్" చిత్రం యూరోపియన్ మరియు కొరియా సినిమాల నుంచి కూడా ప్రేరణ పొందింది.
ఈ చిత్రం ప్రారంభం గురించి దర్శకురాలు వివరిస్తూ, ఈ కథ ఆమెకి, ఆమెకి తెలిసిన అనేక మంది మహిళలకు చాలా వ్యక్తిగతమైనదని చెప్పారు. "ఎక్కడైతే ప్రజలు ఏకాంత ప్రదేశాలలో నివసిస్తారో, ఎక్కడైతే మీరు పరిమిత వ్యక్తులకు మాత్రమే తెలుస్తారో, అలాంటి చాలా చిన్న పట్టణంలో నేను పెరిగాను. ఎవరైనా ఒక విషయం వాస్తవమని చెప్పినప్పుడు, అది నిజమో అబద్ధమో మనం కనీసం తెలుసుకోలేము. మీరు ఈ వాస్తవిక మైదానంలో ఇరుక్కోబోతున్నారు. మనకు ఖచ్చితంగా తెలియని ఈ విషయాలను మనం సందేహిస్తూ, మనకి మనం ప్రశ్నించుకోవడంతో పాటు, మన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రశ్నించడం ప్రారంభిస్తాము. ఒక చిత్ర నిర్మాతగా మన వీక్షకులకు అలాంటి అధివాస్తవిక అనుభూతిని అందించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
![](https://ci6.googleusercontent.com/proxy/r_KoDb3o1ioOYgQWSP9r11-1IKmccCI0vf2zTRdZ7C2SKCREtej8pHkiFPen1yBOEw4qZzrmyxouE5N5ohnRx9w2VcjNvNN4E4LYhfS3CJeiydkf03-P0O6I-pg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/midfest-16CRG.jpg)
మానసిక సంబంధమైన చిత్రాలపై తనకున్న ప్రేమను మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్ వెల్లడిస్తూ, ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ముందు ఏమి జరుగుతుందా అని ఆలోచిస్తూ, పాత్రలతో జీవించే విధంగా వారిని ప్రేరేపించాలని తాను కోరుకున్నట్లు, చెప్పారు. ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, సినిమాలోని ప్రతి పాత్ర వారి స్వంతమైన విభిన్న మార్గాల్లో కథను ముందుకు నడిపిస్తాయని, పేర్కొన్నారు.
"ఫిక్సేషన్" అనేది ఒక ప్రయోగాత్మక చిత్రానికీ, మాస్ మార్కెట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు మధ్య చక్కటి సమ్మేళనం అని ఈ సంభాషణలో పాల్గొన్న ఈ చిత్ర ప్రధాన నిర్మాత మాక్స్ టాప్లిన్ పేర్కొన్నారు. "విషయ పరంగా ఇది ప్రయోగాత్మకంగా ఉండవచ్చు. అయితే అదే సమయంలో కమర్షియల్ మాస్ మార్కెట్ సినిమాకి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో చాలా ఉత్సాహంతో పాటు, దృశ్య పరంగా, శబ్ద పరంగా మంచి ప్రేరేపణ ఉంది. గొప్ప ప్రదర్శన. ఇది ఏ విషయంలోనూ, దేనికీ తీసిపోదు.”, అని ఆయన ప్రశంసించారు.
![](https://ci3.googleusercontent.com/proxy/1xeNv5eMJOzq7d6w0GcU3-nyA8wlYxas1YK82Isxcm8y8XLnEVHJzTjVxGf88DT3wADp0xiNtQjuDYboCeK5Yo7WkRmzId4Yk77pooF7B7n2GBmnH0IhkTh7up0=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/midfest-26BTG.jpg)
స్వతంత్ర చిత్రనిర్మాణం చాలా కష్టమైనదనే వాస్తవాన్ని అంగీకరించినప్పటికీ, మాక్స్ టాప్లిన్, దాని గురించి పెద్దగా నిరాశ పడలేదు. ఈ నేపథ్యంలో, కొంచెం విచిత్రమైన, విభిన్నమైన విషయాలు, పరిస్థితులపై తీసిన చాలా సినిమాలు విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయని చెప్పవచ్చు. "అయితే, స్వతంత్ర చిత్ర నిర్మాతలు, చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధులు ఎలా సేకరించాలో గుర్తించాలి. వారి సినిమా విలువల పరంగా ఎంత ఉన్నతమైనదో ఇతర వ్యక్తులకు వివరించి, వారిని ఒప్పించగలగాలి" అని ఆయున అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు కత్రినా కుడ్లిక్, మాయా హెబ్లే కూడా పాల్గొన్నారు.
సారాంశం
ఒక అసాధారణ హత్య విచారణలో భాగంగా శిక్ష విధించే ముందు ఒక యువతి మానసిక వైద్య పరీక్ష చేయించుకుంది. అయితే, ఆ పరీక్షలు మరింత వ్యక్తిగతంగా, భయానకంగా మారడంతో, ఆమె తన వైద్యుల నిజమైన ఉద్దేశాలను ప్రశ్నించడం ప్రారంభించింది. ఒక సాంప్రదాయ విరుద్ధమైన సంస్థ కోసం, గుర్తుపట్టలేని ఒక నేరానికి పాల్పడిన డోరా అనే యువతి పాత్రలో మ్యాడీ హాసన్ నటించారు. నిరంతరాయంగా మత్తుమందులు, కఠినమైన మానసిక మూల్యాంకన శ్రేణికి లోబడి, ఒక అంతుచిక్కని సత్యాన్ని ఒప్పుకో వలసిందిగా డోరా ను బలవంతం చేస్తారు. అయితే వారిని నమ్మొచ్చా?
దర్శకురాలు గురించి:
మెర్సిడెస్ బ్రైస్ మోర్గాన్ ఒక అవార్డు గెలుచుకున్న లాటిన్ దర్శకుడు. మెర్సిడెస్ తొలి చలన చిత్రం 'ఫిక్సేషన్' టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రదర్శించబడింది. ఏ.ఎం.సి. షడర్ తో ఆమె రెండవ ఫీచర్ ఫిలిం 'స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్' అమెరికా లోని టెక్సాస్ లో జరిగిన ఫెంటాస్టిక్ ఫెస్ట్ లో ప్రదర్శించబడింది. ఎం.జి.ఎం., ఫేస్ బుక్ వాచ్, స్నాప్ చాట్, న్యూ ఫోరమ్, ఎకో, ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ / అడాప్టివ్ వంటి అనేక స్టూడియోల కోసం మెర్సిడెస్, ధారావాహిక కార్యక్రమాలకు దర్శకత్వం వహించారు.
*****
(Release ID: 1879023)
Visitor Counter : 189