సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
"గతాన్ని వర్తమానంతో కలపడాన్ని మనం అన్వేషించాలనుకుంటున్నాము": డైరెక్టర్ ఆండ్రియా బ్రాగా
స్పానిష్ చిత్రమైన ‘సెల్ఫ్ డిఫెన్స్’ యొక్క ప్రధాన ఇతివృత్తం వ్యవసాయంలో టాక్సిన్స్ మరియు పురుగుమందుల సమస్య
గోవాలో జరుగుతున్న 53వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ‘ ఐఎఫ్‌ఎఫ్ఐ టేబుల్ చర్చల’లో పాల్గొన్న ‘సెల్ఫ్ డిఫెన్స్’ చిత్ర తారాగణం & సిబ్బంది
గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పిఐబి నిర్వహించిన 'ఐఎఫ్‌ఎఫ్‌ఐ టేబుల్ టాక్స్' సందర్భంగా 'సెల్ఫ్ డిఫెన్స్' గురించి దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ ప్లే రచయిత ఆండ్రియా బ్రాగా మాట్లాడుతూ “సినిమాలో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే మన వ్యవసాయ రంగంలో టాక్సిన్స్ మరియు పురుగుమందులతో ఎదురయ్యే సమస్యలు " అని తెలిపారు.
'ఐఎఫ్‌ఎఫ్‌ఐ టేబుల్ టాక్స్'లో డైరెక్టర్ ఆండ్రియా బ్రాగా
ఈ చిత్రం నుండి మరపురాని సన్నివేశం గురించి అడిగినప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కళాకారుడు ఇలా అన్నాడు “ సినిమా కథానాయకుడు క్లైమాక్స్‌లో చాలా ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని కళ్ల ముందు గత జ్ఞాపకాలు మెరుస్తుంటాయి. వర్తమానంతో గతం యొక్క సమ్మేళనాన్ని మేము అన్వేషించాలనుకున్నా" అని తెలిపారు.
పూర్తి నిడివి గల చలనచిత్రాన్ని చిత్రీకరించడం షార్ట్ ఫిల్మ్‌ల షూటింగ్‌కు భిన్నం కాదని తొలి చిత్రనిర్మాత ప్రేక్షకులతో పంచుకున్నారు. “సామాగ్రి మరియు సిబ్బంది వృత్తి నైపుణ్యం మెరుగుపడినప్పటికీ దర్శకుడిగా ప్రాజెక్ట్ ముందుకు వచ్చినప్పుడు నేను కథకు న్యాయం చేయాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.
సినిమా ఎడిటర్ మారిసియో హాలెక్ తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ ”మేము స్నేహితులం కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడం గొప్ప అనుభవం. మేము భారతదేశంలో సినిమాని ప్రదర్శించడం ఇదే మొదటిసారి. దీనికి స్పందన అద్భుతంగా ఉంది. ” అని తెలిపారు.
‘సెల్ఫ్ డిఫెన్స్’ సినిమాలోని స్టిల్
గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్’ విభాగంలో స్పానిష్ సినిమా ‘సెల్ఫ్ డిఫెన్స్’ ప్రదర్శించబడింది. 7 అంతర్జాతీయ మరియు భారతీయ ఫిక్షన్ ఫీచర్ ఫిల్మ్ అరంగేట్రం ఈ వర్గం కింద పోటీ పడుతోంది.
కథాంశం:
ఎడ్వర్డో అనే ప్రాసిక్యూటర్ వరుస హత్యలను పరిశోధించడానికి తన స్వగ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంటాడు. అతనికి కొంతమంది పాత స్నేహితులతో పాటు పౌలా మరియు పట్టణ కమీషనర్ రామిరోచే జంట స్వాగతం పలుకుతారు. పరిశోధన కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రసాయనాల దుర్వినియోగంపై ఆధారపడిన అవినీతి పర్యావరణ వ్యవస్థను ఆవిష్కరిస్తుంది. ఈ ఫలితాల ద్వారా, ఎడ్వర్డో గాయాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. అతను ఒంటరిగా లేడు, అయితే: అతను చూసిన ప్రతిచోటా ఛిద్రమైన జీవితాల కథలు ఉన్నాయి.
తారాగణం & సిబ్బంది:
దర్శకుడు: ఆండ్రియా బ్రాగా
నిర్మాత: ఆండ్రియా బ్రాగా
స్క్రీన్ ప్లే: ఆండ్రియా బ్రాగా
సినిమాటోగ్రాఫర్: గిల్లెర్మో “గురి” సపోస్నిక్
ఎడిటర్: మారిసియో హాలెక్
తారాగణం: అల్ఫోన్సో టోర్ట్ (ఎడ్వర్డో పాస్టోర్), జేవియర్ డ్రోలాస్ (రామిరో సార్టోరి), వియోలేటా ఉర్టిజ్‌బెరియా (పౌలా పెన్నాటి)
2022 | స్పానిష్ | 97 నిమిషాలు | కలర్
డైరెక్టర్ గురించి:
ఆండ్రియా బ్రాగా 1986లో ఇటలీలోని బ్రెస్సియాలో జన్మించారు. అతను నిర్మాత, దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. యూనివర్శిటీ డెల్ సాక్రో డి బ్రెస్సియాలో సాహిత్యం మరియు తత్వశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఎస్క్యూలా ప్రొఫెషనల్ డి సినీ డి ఎలిసియో సుబీలా (బ్యూనస్ ఎయిర్స్)లో సినిమాటోగ్రఫీలో డిగ్రీ చేశారు. అక్కడ ఆయన ఉపాధ్యాయుడు కూడా. 2014 నుండి ఆయన ఫిల్మ్ మరియు మ్యూజిక్ వీడియోల ప్రొడక్షన్‌లో పనిచేస్తున్నాడు. దర్శకుడిగా మరియు స్క్రీన్ రైటర్‌గా అతని కెరీర్ ఎవెలిన్ (2015) మరియు మెమోరియా ఇంటర్నా (2017) అనే కాల్పనిక లఘు చిత్రాలతో ప్రారంభమైంది. ఆ రెండూ అవార్డులు మరియు ప్రపంచ గుర్తింపు పొందాయి. 2021లో ఆయన కుమో సిని అనే తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు. పెన్సా మరియు రొక్కా సినితో కలిసి తన తొలి చిత్రం సెల్ఫ్-డిఫెన్స్‌ను చిత్రీకరించారు.
పూర్తి చర్చను ఇక్కడ చూడవచ్చు:
* * *
(Release ID: 1879022)
Visitor Counter : 164