ఆర్థిక మంత్రిత్వ శాఖ
బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమావేశం
Posted On:
25 NOV 2022 5:39PM by PIB Hyderabad
బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (శాసనసభ గల) ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రుణ పరిమితిని పెంచడం, రెండు అడ్వాన్స్‌డ్ డెవల్యూషన్ వాయిదాలను అందించడం మరియు మూలధన వ్యయానికి ప్రత్యేక సహాయం ద్వారా ఆర్థికంగా సహకారం అందిస్తున్నకేంద్ర ఆర్థిక మంత్రికి సమావేశానికి హాజరైన వారు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో చేర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి పలు సూచనలు చేశారు. 2023-24 బడ్జెట్‌కు సంబంధించి అందించిన సమాచారం, సూచనలు అందించినవారికి కేంద్ర ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అందిన ప్రతి ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
***
(Release ID: 1879000)
Visitor Counter : 115