వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇండియా `ఆస్ట్రేలియా ఇసిటిఎ ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకుని, ఆస్ట్రేలియాలో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవలసిందిగా స్టీలు పరిశ్రమను కోరినకేంద్రమంత్రి శ్రీగోయల్‌


ఎఫ్‌టిఎలలో కరిగించు,వాడు విధానం ద్వారా ప్రభుత్వం భారత స్టీలు పరిశ్రమను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేసిన శ్రీగోయల్‌

భారత తలసరి స్టీలు వినియోగానికి కనీసం 3 రెట్లు వృద్ధి సాధించేందుకు స్టీలు పరిశ్రమ కృషిచేయాలని సూచించిన మంత్రి

కోకింగ్‌ కోల్‌ కు బదులుగా సుస్థిర ప్రత్యామ్నాయం కోసం ప్రముఖ సంస్థలతో కలసిపనిచేయవలసిందిగా పరిశ్రమ వర్గాలకు సూచించిన మంత్రి.

ఐఎస్‌ఎ 3వ స్టీలు సదస్సు నుద్ధేశించి ప్రసంగించిన శ్రీ గోయల్‌

Posted On: 22 NOV 2022 4:15PM by PIB Hyderabad

ఇండియా `ఆస్ట్రేలియా  ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఇసిటిఎ) ను సద్వినియోగం చేసుకుని, ఆస్ట్రేలియాలో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవలసిందిగా కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి శ్రీ పియోష్‌గోయల్‌ స్టీలు పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. న్యూఢల్లీిలో ఐఎస్‌ఎస స్టీల్‌ 3 వ సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఇండియా`ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఇసిటిఎ)ను ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదించిందని తెలిపారు. ఇది గొప్ప విషయమని అంటూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియా ,తన పటిష్టమైన స్థానం నుంచి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెప్పారు.  అభివృద్ధి చెందిన దేశాలు, భారత ఆర్థిక వృద్ధి ప్రపంచ వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నాయని ఆయన అన్నారు.ఆస్ట్రేలియాతో కుదిరిన ఈ ఒప్పందం అనంతరం, ఆస్ట్రేలియాకు మన స్టీలు ఉత్పత్తులపై సుంకం ఉండదని అన్నారు. స్టీలు పరిశ్రమ ఈ ఒప్పందం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని , ఆస్ట్రేలియాలో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలతో కుదుర్చుకునే ఇలాంటి ఒప్పందాలు మన దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తాయని, వివిధ రంగాలలో వ్యాపార అవకాశాలు లభిస్తాయని అన్నారు.

ఎగుమతుల రాబడికి దోహదపడుతున్న ప్రధాన రంగం స్టీలు పరిశ్రమ అని శ్రీ గోయల్‌ అన్నారు. చాలావరకు భారత స్టీలు కంపెనీలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టీలు సరఫరాదారులుగా ఉన్నారని ఆయన అన్నారు. ఇంజిన్లు, వాల్వులు వంటివాటిని భారత స్టీలు తోనే తయారు చేస్తున్నారని, స్టీలు పరిశ్రమ ఉత్పత్తిచేస్తున్న నాణ్యతా ఉత్పత్తులకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. బ్రాండ్‌ ఇండియాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాల్సిందిగా ఆయన కోరారు. భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చే ఉమ్మడికృషిలో స్టీలు పరిశ్రమ అత్యంత కీలకమైనదని ఆయన అన్నారు.

కోవిడ్‌ సమయంలో స్టీలు రంగం చేసిన అద్భుత కృషిని శ్రీ గోయల్‌ ప్రశంసించారు. వైద్యపరికరాల తయారీ, సరఫరా, కోవిడ్‌ చికిత్సకు ఉపకరించే ద్రవరూప ఆక్సిజన్‌ సరఫరా వంటి వాటి విషయంలో స్టీలు రంగం చేసిన కృషి ఎనలేనిదని ఆయన అన్నారు. అంతేకాదు వైద్య అవసరాల నిమిత్తం ద్రవరూప ఆక్సిజన్‌ ను సరఫరా చేసేందుకు కొన్ని స్టీలు కంపెనీలు తమ ఉత్పత్తినికూడా తగ్గించుకుని కోవిడ్‌ పేషెంట్లను కాపాడాయని ఆయన అన్నారు.

స్టీలు రంగం ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని అంటూ, 2030 నాటికి 300 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవలసిందిగా స్టీలు పరిశ్రమ వర్గాలకు శ్రీ గోయల్‌ సూచించారు.భవిష్యత్తులో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయని , దీనికి అనుగుణంగా పరిశ్రమ సుసంపన్నమై వృద్ధిచెందనున్నదని అన్నారు.స్టీలును పెద్దఎత్తున ఉత్పత్తిచేసే ఎన్నో పెద్ద దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, అయితే ఇండియాకు దేశీయంగా గొప్ప మార్కెట్‌ ఉందన్నారు. పోటీ ధర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విస్తృత శ్రేణి ఉత్పత్తులు, దేశీయ  ఇనుప గనుల సామర్ధ్యం వంటివి భారతీయ పరిశ్రమకు తోడ్పడే అంశాలని అన్నారు.

ఉక్కుతయారీదారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇతరదేశాలతో కలసి కృషిచేస్తోందని  శ్రీ గోయల్‌ అన్నారు. ప్రత్యేకించి అ్యతంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పోటీధరలకు అందుబాటులోకి తెస్తూ అంతర్జాతీయంగా అనుగుణమైనవాటిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. భారతదేశం స్టీలు ఉత్పత్తి రంగంలో ద్వితీయ స్థానం సాధించేందుకు 2017నాటి స్టీలు పాలసీ ఉపయోగపడిరదని ఆయన అన్నారు.

స్టీలుపైన, వివిధస్టీలు ఉత్పత్తులపైన ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకోవడం గురించిప్రస్తావిస్తూ, స్టీలుపై సుంకాన్ని తాత్కాలిక ప్రాతిపదికన , ధరల స్థిరీకరణకు, దేశంలో వృద్ధివేగాన్ని కాపాడేందుకు విధించినట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ద్రవ్యోల్బణం కట్టడికి ఉపకరించిందన్నారు. సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుని ప్రభుత్వానికి పూర్తిగా సహకరించినందుకు స్టీలు రంగానికి గోయల్‌ కృతజ్ఞతలు తెలిపారు.భారతీయ స్టీలు పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకే ఎఫ్‌.టి.ఎలో మెల్ట్‌ అండ్‌  పోర్‌ విధి విధనాలను నిర్ధేశించినట్టు చెప్పారు. దేశీయంగా తయారయ్యే స్టీలుకే ఇది వర్తిస్తుందని చెప్పారు. 

ఈ నిబంధన కింద ఆయా దేశాలలో స్థానికంగా తయారయ్యే స్టీలును మాత్రమే దిగుమతి చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. దీనివల్ల భారత స్టీలు పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రయోజనం ఉంటుందని, స్టీలుఎగుమతులపై సుంకాలు తొలగించడం జరిగిందని తెలిపారు.కోకింగ్‌ కోల్‌ అందుబాటులో ఉండడం స్టీలు రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ పరిష్కారాలు సాధించేందుకు పేరెన్నికగన్న సంస్థలతో సమన్వయం చేసుకోవలసిందిగా ఆయన స్టీలు పరిశ్రమకు సూచించారు. కోకింగ్‌ కోల్‌ విషయంలో కొన్ని దేశాలపై ఆధారపడే విధానం సరైనది కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో స్వావలంబన సాధించేందుకు కృషిచేయాలని ఆయన అన్నారు.

భారతదేశపు సగటు స్టీలు వినియోగం, ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉందని, ఈ విషయంలో అంతర్జాతీయ సగటును సాధించడానికి భారత స్టీలు పరిశ్రమ మూడురెట్ల ప్రగతి సాధించాలని ఆయన అన్నారు.ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఇవి) ఆటో మార్కెట్‌, సుసంపన్నత కారణంగా స్టీలు, అల్యూమినియం రంగాలలో మంచి అభివృద్ధి ఉండగలదని ఆయన అన్నారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

స్టీలు రంగంలో ఉమ్మడి పరిశోధనలుచేపట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించేందుకు ప్రయత్నించాల్సిందిగా ఆయన కోరారు. ఇది భారత స్టీలు రంగం ఇతర దేశాలకన్నా ప్రాధాన్యత పొందడానికి వీలు కలుగుతుందని , మరింత భారీ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు ఉపకరిస్తుందని చెప్పారు. ఇది సుస్థిర స్టీలుకు మరింత మెరుగైన విలువను ఇవ్వగలదన్నారు.స్టీలు రంగంలో చిన్న ఉత్పత్తిదారులకు మద్దతునిచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ రంగంలోని పెద్ద సంస్థలకు మంత్రి సూచించారు. ఎగుమతి సుంకాల ఉపసంహరణ చిన్న తయారీదారులను దెబ్బతీసేదిగా ఉండకుండా చూడాల్సిందిగా ఆయన కోరారు. ఎం.ఎస్‌.ఎం.ఇ పరిశ్రమను, ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులను నిరంతరం ప్రోత్సహించాల్సిందిగా ఆయన కోరారు. 

 

***

 



(Release ID: 1878994) Visitor Counter : 80