బొగ్గు మంత్రిత్వ శాఖ
18%శాతం పెరుగుదలతో అక్టోబర్ నాటికి 448 మిలియన్ టన్నులకు చేరుకున్న బొగ్గు ఉత్పత్తి
మార్చి 2023 నాటికి విద్యుత్ ప్లాంట్లకు 45 ఎంటిల స్టాక్‌ను సేకరించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది
ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసికట్టుగా ఆటంకాలు లేకుండా బొగ్గ రవాణా చేసే ప్రక్రియ
Posted On:
24 NOV 2022 11:43AM by PIB Hyderabad
దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి అక్టోబర్ 2022 నాటికి 448 మిలియన్ టన్నులు (ఎంటి)గా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలానికి చసిన ఉత్పత్తికన్నా 18% ఎక్కువ. కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) నుంచి బొగ్గు ఉత్పత్తి వృద్ధి కూడా 17% కన్నా ఎక్కువగా ఉంది. దేశీయ బొగ్గు ఆధారిత ప్లాంట్లకు నవంబర్ 2020 చివరి నాటికి 30 మిలియన్ టన్నుల బొగ్గు స్టాక్‌ను సమకూర్చాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఈ స్టాక్‌ను సమకూర్చే ప్రక్రియను కొనసాగించాలని, తద్వారా 31 మార్చి 2023 నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల (టిపిపి) స్టాకు 45 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని శాఖ ప్రణాళికలు వేస్తోంది. గనులలో (pithead) బొగ్గు స్టాక్‌ను పెంచేందుకు ప్రణాళికలు కూడా వేస్తోంది.
ఈ ఏడాది మొదటి ఏడునెలలో, రోజువారి రేక్‌ల సౌలభ్యంలో 9% సగటు వృద్ధి కావడమన్నది పవర్ ప్లాంట్ల వద్ద స్టాక్‌లను సమకూర్చేందుకు ఎక్కువ పరిణామంలో బొగ్గును రవాణా చేయడానికి తోడ్పడుతోంది. ఇంధన మంత్రిత్వ శాఖ కూడా రైల్ కమ్ రోడ్డు మాధ్యమం ద్వారా బొగ్గు రవాణాను పెంచుతోంది. రానున్న ఎనిమిది నెలలకు విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు అన్నింటికీ ఆర్‌సిఆర్ మాధ్యమం ద్వారా రవాణా చేసే కోటా గురించి సిఐఎల్ సమాచారాన్ని ఇచ్చింది. ఇది విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు తమ రవాణా వ్యూహాన్ని ముందస్తుగా రూపొందించుకునేందుకు తోడ్పడుతుంది.
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఇంధన, రైల్వేలు, బొగ్గు మంత్రిత్వ శాఖలు బొగ్గును సముద్రమార్గం ద్వారా రవాణా చేసేందుకు కలిసి పని చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఎంసిఎల్ నుంచి పరదీప్ వరకు బొగ్గును రైలు మార్గం ద్వారా, ఆపైన తూర్పు తీరాన ఉన్న విద్యుత్ ప్లాంట్లకు రైలు- సముద్రం-రైలు మార్గం ద్వారా రవాణా చేస్తున్నారు. దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల నుంచి బొగ్గును పశ్చిమ తీరానికి లేదా ఉత్తర ప్రాంతాలకు రవాణా చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనుగుణంగానే పరదీప్‌కు రవాణా చేసే బొగ్గు సామర్ధ్యాన్ని పెంచడం జరిగింది. వచ్చే ఏడాది తొలి నెలలల్లో పశ్చిమ తీరంలో ఉన్న ప్లాంట్లకు బొగ్గును చేరవేసే పనిని ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సాధ్యమయ్య మూడు మాధ్యమాల ద్వారా బొగ్గును రవాణా చేయడాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఉత్పత్తి, రవాణా, దేశీయ బొగ్గు నాణ్యత అంశాలను బొగ్గు మంత్రిత్వ సన్నిహితంగా పర్యవేక్షిస్తోంది.
***
(Release ID: 1878687)
Visitor Counter : 148