సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్పర్శ ద్వారా తల్లీ బిడ్డల మధ్య కలిగే అనుబంధాన్ని కళ్లకు చూపించే 'లోటస్ బ్లూమ్స్'
సినిమా అంటే వ్యాపారం కాదు.. భావోద్వేగాల ద్వారా ప్రజలకు చేరువయ్యే సదనం.. చిత్ర నిర్మాత ప్రతీక్ శర్మ
విశ్వంలో మనకు రాసి ఉన్నది మనకు చేరుతుంది : స్క్రీన్‌ప్లే రచయిత అస్మిత శర్మ
ప్రాంతీయ సినిమాలు ఎక్కువగా భారతదేశ సారాన్ని ప్రతిబింబిస్తాయి: ప్రముఖ నటుడు అఖిలేంద్ర ఛత్రపతి మిశ్రా
ప్రతి వ్యక్తి జీవితంలో ప్రకృతి మరియు వ్యక్తుల మధ్య ముడిపడి ఉండే భావోద్వేగ సంబంధాలు ప్రధాన ఇతివృత్తంగా మైథిలి భాషలో 'లోటస్ బ్లూమ్స్' రూపుదిద్దుకుంది. భావోద్వేగ సంబంధాలను ప్రేరణగా తీసుకుని చిత్రాన్ని నిర్మించామని దర్శకుడు ప్రతీక్ శర్మ తెలిపారు. ఈ సందేశాన్ని వినోదాత్మకంగా 'లోటస్ బ్లూమ్స్' చిత్రం ద్వారా తెరకెక్కించామని ఆయన అన్నారు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పీఐబీ ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో 'లోటస్ బ్లూమ్స్' బృందం పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ఒక వ్యక్తి సిద్ధం చేసుకున్న ప్రణాళిక విఫలం అయ్యే ప్రమాదం ఉందని అయితే విశ్వంలో మనకు రాసి ఉన్నది మనకు చేరుతుంది అని స్క్రీన్‌ప్లే రచయిత అస్మిత శర్మ అన్నారు. అనుకోని విధంగా కొంత ఆలస్యంగా అయినా విశ్వంలో మనకు రాసి ఉన్నది మనకు చేరుతుంది అని అన్నారు. "కొన్నిసార్లు జీవిత ప్రయాణం దుర్భరంగా మారుతుంది. ఈ సమయంలో ప్రకృతి మరియు సర్వశక్తిమంతుడు అయిన అంతర్యామిని నమ్మి నమ్మకం ఉంచితే సమస్యలు అద్భుత మార్గాల్లో పరిష్కారం అవుతాయి" అని అస్మిత శర్మ అన్నారు.
మాట్లాడుతూ, “సందేశాన్ని వ్యక్తీకరించడానికి 'సినిమా భాష' లో సందేశాన్ని వినిపించే విధంగా రూపొందడంతో దీనిలో నటించడానికి అంగీకరించాను" అని ప్రముఖ నటుడు అఖిలేంద్ర ఛత్రపతి మిశ్రా అన్నారు. “జీవితం కూడా కమలం లాంటిదని, ఇది సూర్యోదయంతో వికసిస్తుంది మరియు సూర్యాస్తమయంతో ఎండిపోతుంది” అన్న ఇతివృత్తంతో సినిమా రూపొందింది" అని ఆయన చెప్పారు. మైథిలి భాషకు ప్రాచుర్యం కల్పించడం సినిమా ముఖ్య ఉద్దేశమని అన్నారు. భారతదేశ గొప్పదనం ప్రాంతీయ భాషా చిత్రాల ద్వారా ఎక్కువగా తెలుస్తుందని అన్నారు. ప్రాంతీయ భాషల్లో సినిమాలు ఎక్కువగా రావడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో సినిమాలు ఎక్కువగా రావాలని అఖిలేంద్ర ఛత్రపతి మిశ్రా ఆకాంక్షించారు. జీవితం కంటే సినిమా పెద్దదని పేర్కొన్న అఖిలేంద్ర ఛత్రపతి మిశ్రా జీవితానికి సినిమా పొడిగింపు అని అన్నారు. నవరసాలు ఉండే సినిమా సంస్కృతి, భాష మరియు ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉంటుందని ఆయన అన్నారు.
అఖిలేంద్ర ఛత్రపతి మిశ్రా ప్రస్తావించిన దర్శకుడు ప్రతీక్ శర్మ “సినిమా అనేది వ్యాపార వస్తువు కాదు. ప్రేక్షకుల భావోద్వేగాలకు సంబంధించినది” అని అన్నారు. ప్రతీక్ శర్మ సామాజిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు తీయడంలో పేరు తెచ్చుకున్నాడు. సినిమాల ద్వారా సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను అని శర్మ అన్నారు.
దర్శకుడు ప్రతీక్ శర్మ, నిర్మాత మరియు స్క్రీన్‌ప్లే రచయిత అస్మితా శర్మ, నటుడు అఖిలేంద్ర ఛత్రపతి మిశ్రా మరియు మాస్టర్ అథ్ శర్మ తో పాటు 'లోటస్ బ్లూమ్స్' చిత్రం నటీనటులు మరియు సిబ్బందిని నవంబర్ 23, 2022న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సన్మానించారు. సత్కరించారు.
మైథిలీ భాషలో నిర్మించిన ' లోటస్ బ్లూమ్స్ ' చిత్రాన్ని 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది. తల్లి మరియు బిడ్డల మధ్య స్పర్శ ద్వారా కలిగే బంధం ఆధారంగా తయారైన కథ ఆధారంగా సినిమా నిర్మాణం జరిగింది.సినిమాలో చాలా తక్కువ సంభాషణలు ఉన్నాయి. బీహార్‌లోని మారుమూల ప్రాంతాల్లో చిత్రాన్ని చిత్రీకరించారు.
ప్రకృతి, మానవుల్లో ఉండే మానవత్వం దీనికి సంబంధించిన విశ్వాసం తెలియజేసే విధంగా 'లోటస్ బ్లూమ్స్' చిత్ర నిర్మాణం జరిగింది. మనస్సాక్షి అనే కమలం ప్రకృతి మాత, అంతర్గత స్వభావంతో ఆత్మతో అనుసంధానం అయినప్పుడు మాత్రమే వికసిస్తుంది. కథానాయిక (సరస్వతి) ప్రేమతో నిండిన మాతృమూర్తి ప్రకృతికి ప్రతీకగా చిత్రంలో కనిపిస్తుంది. ప్రేమానుబంధాలు అందించే అత్యద్భుతమైన శక్తి మాతృమూర్తికి మాత్రమే ఉంటుంది. సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలు మాతృమూర్తిని దూరం చేయవు.
***
(Release ID: 1878686)
Visitor Counter : 199