జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జలజీవన్ సర్వేక్షణ్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లపై కలెక్టర్ల జాతీయ సమావేశం!


కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు
జల జీవన్ మిషన్, స్వచ్ఛభారత మిషన్ గ్రామీణ్ పథకం గుర్తింపు

Posted On: 23 NOV 2022 3:50PM by PIB Hyderabad

   దేశంలో నీటి అవసరాలను, పారిశుద్ధ్యం అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్ర తాగునీరు-పారిశుద్ధ్య శాఖ (డి.డి.డబ్ల్యుఎస్.) రెండు ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్.బి.ఎం.-జి), జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) పేరిట ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని అందించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా (ఒ.డి.ఎఫ్. ప్లస్‌గా) తీర్చిదిద్దాలని ఎస్.బి.ఎం.జి లక్ష్యంగా పెట్టుకోగా, ప్రతి ఇంటికి కులాయిల ద్వారా నాణ్యమైన నీటిని అందించాలని జె.జె.ఎం. పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్.బి.ఎం.-జి, జె.జె.ఎం. కార్యక్రమాల పర్యవేక్షణ, మధింపు పద్ధతుల్లో భాగంగా పలు సర్వేలు చేపడుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్.ఎస్.జి.), జలజీవన్ సర్వేక్షణ్ (జె.జె.ఎస్.) అనే ప్రక్రియలు ఈ కోవకే చెందుతాయి. స్వచ్ఛభారత్ మిషన్ అమలులో పనితీరు ప్రాతిపదికగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి పరిధిలోని జిల్లాలకు ఇవి ర్యాంకులను కేటాయిస్తాయి.  

    దేశంలోని గ్రామీణప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి 2019, ఆగస్టు15న ప్రారంభించారు. ఎర్రకోట బురుజునుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.  ఈ కార్యక్రమం ప్రారంభించే నాటికి దేశంలో కేవలం 3.23 కోట్ల మందికి, అంటే దేశ జనాభాలో 17శాతం మందికి మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఎన్నో అవాంతరాలు ఏర్పడినప్పటికీ ప్రభుత్వం చేసిన కృషితో ఈ పథకం అమలులో సత్ఫలితాలు వచ్చాయి. ఈ రోజున దేశంలోని 10.56 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు (54.58శాతం మంది) కుళాయి నీటిని పొందుతున్నాయి.

   దేశంలో ఇపుడు స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్.బి.ఎం.-జి) రెండవ దశ కొనసాగుతోంది.  మొదటి దశలో, అంటే 2019లో గ్రామీణ ప్రాంతాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా (ఒ.డి.ఎఫ్.లుగా)  స్వచ్ఛ భారత్ గ్రామీణ్ పథకం విజయవంతంగా ప్రకటించింది, 2014లో 39శాతం ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని, 2019కల్లా వందశాతానికి చేర్చగలిగింది. 2020లో మొదలైన 2వ దశలో, గ్రామీణ భారతదేశాన్ని ఒ.డి.ఎఫ్. ప్లస్‌గా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటుగా, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో పూర్తి పారిశుధ్యం సాధించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు దేశంలోని 1.27 లక్షల గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌గా మారిపోయాయి.  

   ఈ విషయంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.)లో భాగంగా కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్యం శాఖ ద్వారా జలజీవన్ సర్వేక్షణ్-2023 పేరిట కార్యక్రమం ప్రారంభమైంది.  జలజీవన్ సర్వేక్షణ్ టూల్ కిట్‌ను గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ 2022 అక్టోబరు 21న ఆవిష్కరించారు.  

  మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించేలా, మెరుగైన నీటి సరఫరా సేవలను అందించేలా రాష్ట్రాలు/జిల్లాల సంస్థలను ప్రోత్సహించడంమే జలజీవన్ సర్వేక్షణ్-2023 ధ్యేయంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు. నీటి కుళాయిల కనెక్షన్లు, కుటుంబాల నిష్పత్తి ఆధారంగా వివిధ జిల్లాలను 2022, అక్టోబరు ఒకటవతేదీనాటికి ఐదు శీర్షికల కింద వర్గీకరించారు.  

   గృహకనెక్షన్లకు సంబంధించి,  0 (సున్నా) నుంచి 25శాతం కంటే తక్కువ కనెక్షన్ల వర్తింపు ఉన్న జిల్లాలను ఆశావహ జిల్లాలుగా,  25 నుంచి 50 కంటే తక్కువ శాతం ఉంటే సామర్థ్యం ప్రదర్శించిన జిల్లాలుగా, 50 నుంచి 75శాతంకంటే తక్కువ ఉంటే సాధక జిల్లాలుగా, 75 నుంచి 100శాతంకంటే తక్కువ ఉంటే ఉన్నతస్థాయి సాధక జిల్లాలుగా, వందశాతం అయితే అగ్రగాములుగా వర్గీకరించారు.

   ఫలితాలు సాధించిన రాష్ట్రాలను/ కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి పనితీరు ఆధారంగా నెలవారీగా, త్రైమాసికంగా,  వార్షికంగా సత్కరించనున్నారు. మొదటిసారిగా, నెలవారీ అవార్డులను 2022, నవంబరు 21న ప్రకటించారు.  కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి వినీ మహాజన్ ఈ మేరకు ప్రకటన చేశారు. అవార్డులు పొందిన జిల్లాల జాబితాను ఈ దిగువన చూడవచ్చు:

 

   కేటగిరీ

ర్యాంకు

జిల్లా, రాష్ట్రం

 

ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా

అగ్రగాములు (100శాతం వర్తింపు)

1వ ర్యాంకు

అంబాలా, హర్యానా

 

2వ ర్యాంకు

రోహ్తక్, హర్యానా

 

3వ ర్యాంకు

ఫరీదాబాద్, హర్యానా

 

ఉన్నతస్థాయి సాధన (75నుంచి 100శాతం వరకు వర్తింపు)

1వ ర్యాంకు

కొలాసిబ్, మిజోరాం

 

2వ ర్యాంకు

సెర్చిప్, మిజోరాం

 

3వ ర్యాంకు

రాణీపేట, తమిళనాడు

 

సాధించిన జిల్లాలు (50నుంచి 75శాతం వర్తింపు)

1వ ర్యాంకు

చంపాయ్, మిజోరాం

 

2వ ర్యాంకు

మమిత్, మిజోరాం

 

3వ ర్యాంకు

మైలాడుదురై, తమిళనాడు

 

పనితీరు ప్రదర్శించిన జిల్లాలు (25నుంచి 50శాతం వర్తింపు)

1వ ర్యాంకు

కాళ్లకురుచ్చి, తమిళనాడు

 

2వ ర్యాంకు

తూర్పు జైంతియా హిల్స్, మేఘాలయ

 

3వ ర్యాంకు

మోన్, నాగారాండ్

 

ఆశావహ జిల్లాలు (0నుంచి 25శాతం వరకు వర్తింపు)

1వ ర్యాంకు

షాజహాన్ పూర్, ఉత్తరప్రదేశ్

 

2వ ర్యాంకు

బులంద్ షహర్, ఉత్తరప్రదేశ్

 

3వ ర్యాంకు

బరేలీ, ఉత్తరప్రదేశ్

 

వేగంగా పురోగమిస్తున్న జిల్లా

సాధించిన జిల్లా

1వ ర్యాంకు

లేహ్, లడఖ్

 

2వ ర్యాంకు

కార్గిల్, లడఖ్

 

3వ ర్యాంకు

గ్యాంగ్టక్, సిక్కిం

 

పనితీరు ప్రదర్శించిన జిల్లాలు

1వ ర్యాంకు

మోన్, నాగాలాండ్

 

2వ ర్యాంకు

తూర్పు జైంతియా హిల్స్, మేఘాలయ

 

3వ ర్యాంకు

మహోబా, ఉత్తరప్రదేశ్

 

ఆశావహ జిల్లాలు

1వ ర్యాంకు

షాజహాన్ పూర్, ఉత్తరప్రదేశ్

 

2వ ర్యాంకు

మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్

 

3వ ర్యాంకు

బులంద్ షహర్, ఉత్తరప్రదేశ్

 

యోగ్యతా పత్రం పొందిన జిల్లా

ఉన్నత సాధనకు యోగ్యతా పత్రం పొందిన జిల్లాలు

నమక్కళ్, తమిళనాడు

 

కొడగు, కర్ణాటక

 

చామరాజనగర, కర్ణాటక

 

పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్

 

అనంతపురం, ఆంధ్రప్రదేశ్

 

రుద్రప్రయాగ్, ఉత్తరాఖండ్

 

సాధనా జిల్లాలుగా యోగ్యతా పత్రం పొందినవి

రాయ్‌పూర్, చత్తీస్‌గఢ్

 

హరిద్వార్, ఉత్తరాఖండ్

 

ఉమారియా, మధ్యప్రదేశ్

 

చిత్రదుర్గ, కర్ణాటక

 

సామర్థ్య ప్రదర్శనపై యోగ్యతాపత్రం పొందినవి

బులంద్‌షహర్, ఉత్తరప్రదేశ్

 

మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్

 

ఉదల్‌గుడి, అస్సాం

 

లలిత్‌పూర్, ఉత్తరప్రదేశ్

 

శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్

 

షహ్రాన్‌పూర్, ఉత్తరప్రదేశ్

 

టోంక్, రాజస్థాన్

 

 

     స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్.బి.ఎం.-జి) కింద కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ కూడా 2018 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్.ఎస్.జి.) పేరిట ఒక సర్వేని నిర్వహిస్తూ వస్తోంది. కీలకమైన పరిమాణాత్మక, గుణాత్మక ప్రమాణాల ప్రాతిపదికన రాష్ట్రాలు, జిల్లాలు సాధించిన ఫలితాలను బేరీజు వేసి వారి పనితీరు ఆధారంగా ర్యాంక్‌లను ఈ సర్వే అందిస్తుంది.  అలాగే గ్రామీణ సమాజాన్ని వారి పారిశుద్ధ్య స్థితిని మెరుగుపరచడంలో నిమగ్నం చేస్తుంది. ఇందుకోసం ఉధృత స్థాయిలో, పరిపూర్ణంగా అధునాతన ప్రచార సామగ్రి సహాయంతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 పేరిట కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని కూడా కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ భావిస్తోంది, ఇది ఎస్.ఎస్.జి. ప్రచార ప్రక్రియను మరింత తీవ్రంగా అమలు చేయడానికి దోహదపడుతుంది.

   గ్రామం, గ్రామ పంచాయతీ, జిల్లా-రాష్ట్ర స్థాయిలలో విస్తృత భాగస్వామ్యాన్ని సృష్టించడమే స్వచ్ఛ సర్వేక్షణ్-2023 యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2వ దశకు, ఒ.డి.ఎఫ్. ప్లస్ కార్యక్రమానికి తగిన ప్రోత్సాహం కల్పించడం; ఒ.డి.ఎఫ్. ప్లస్ నమూనా గ్రామానికి సంబంధించిన అంశాలపై  సమాజంలో అవగాహన కల్పించడం,  వ్యవస్థలు- ప్రక్రియలను అమలు చేయడం; వెరిఫికేషన్ ద్వారా భాగస్వామ్యంపై మధింపు, అధ్యయనం; మెరుగైన పనితీరు కోసం పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం; జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో అత్యుత్తమ సామర్థ్యం చూపిన వారికి బహుమతులు, అవార్డులు అందించడం, గుర్తింపును ఇవ్వడం ఈ సర్వే లక్ష్యాలు.

   ఎస్.ఎస్.జి. 2023 టూల్‌కిట్, ఎస్.ఎస్.జి. 2023 డ్యాష్‌బోర్డ్‌ను కేంద్ర జలశక్తి మంత్రి నవంబర్ 2న ప్రారంభించారు. ఇండియా వాటర్ వీక్‌లోని రూరల్ వాష్ పార్టనర్స్ వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  ఆయన టూల్‌కిట్‌ను, డ్యాష్‌బోర్డును ప్రారంభించారు.

   2022 అక్టోబరు 1న ద్వారా నివేదించబడిన గ్రామాల ఒ.డి.ఎఫ్. ప్లస్ పురోగతి స్థాయి ప్రాతిపదికగా, జిల్లాల బేస్‌లైన్ ఒ.డి.ఎఫ్.+ స్కోర్లను రూపొందించారు.  తదనుగుణంగా పట్టికలో చూపిన విధంగా జిల్లాలను స్టార్ల ర్యాంకింగ్ పద్ధతిలో  వర్గీకరించారు. వర్గీకరణను ఈ దిగువన పట్టికలో చూడవచ్చు:

స్కోరు

స్టార్

0 (సున్నా)

స్టార్ లేదు

0< score <25

 

25నుంచి 50 వరకు స్కోరు

 

50నుంచి 75వరకు స్కోరు

 

75 నుంచి 100 వరకు స్కోరు

 

స్కోరు = 100

 

 

 2022 అక్టోబరు 1నుంచి నవంబర్ 1వరకు జిల్లాల పురోగతి ఆధారంగా గణించిన డెల్టా సాధన స్కోర్ల ఆధారంగా, ఎస్.ఎస్.జి.-2023కి మొదటి నెలవారీ ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. వాటిని రాష్ట్రాలకు/జిల్లాలకు కూడా పంపించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలను ఒక సదస్సులో ప్రకటించి సత్కరించారు. అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన వివిధ జిల్లాల జాబితా జాబితా (అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు) కింది విధంగా ఉంది:

:

రాష్ట్రం పేరు

జిల్లా పేరు

కేటగిరీ

ర్యాంకింగ్స్

అండమాన్-నికోబార్ దీవులు

దక్షిణ అండమాన్ దీవులు

5 స్టార్

-

నికోబార్ దీవులు

5 స్టార్

-

ఉత్తర-మధ్య అండమాన్ దీవులు

5 స్టార్

-

దాద్రా-నాగర్, హవేళీ-డామన్-డయ్యూ

డయ్యూ

5 స్టార్

-

దాద్రా-నాగర్, హవేళీ-డామన్-డయ్యూ

డామన్

4 స్టార్

1

నాగాలాండ్

లాంగ్‌లెంగ్

3 స్టార్

1

మధ్యప్రదేశ్

బుర్హాన్‌పూర్

3 స్టార్

2

హిమాచల్ ప్రదేశ్

హామీర్‌పూర్

3 స్టార్

3

కేరళ

కొల్లాం

2 స్టార్

1

మధ్యప్రదేశ్

ఝబువా

2 స్టార్

2

మధ్యప్రదేశ్

అనుప్పూర్

2 స్టార్

3

అస్సాం

మాజులీ

1 స్టార్

1

కర్ణాటక

రామనగర

1 స్టార్

2

కర్ణాటక

చిక్కమగళూరు

1 స్టార్

3

 

  తమ తమ పనితీరును మెరుగుపరుచుకుని, తదుపరి స్టార్ కేటగిరీకి యోగ్యతను పొందిన జిల్లాల వివరాలు  (అక్టోబరు 1నుంచి నవంబరు 1 వరకు) ఈ కింది విధంగా ఉన్నాయి.:

రాష్ట్రం పేరు

జిల్లా పేరు

స్టార్ కేటగిరీకి యోగ్యత

అస్సాం

మాజులీ

2 స్టార్

కర్ణాటక

రామనగర

2 స్టార్

కర్ణాటక

చిక్కమగళూరు

2 స్టార్

మధ్యప్రదేశ్

షాజాపూర్

2 స్టార్

దామోహ్

2 స్టార్

ఉజ్జయిని

2 స్టార్

బాలాఘాట్

2 స్టార్

రత్లాం

2 స్టార్

సింగ్రౌలీ

2 స్టార్

దిందోరీ

2 స్టార్

మాండ్ల

2 స్టార్

అస్సాం

బిశ్వనాథ్

1 స్టార్

   అవార్డుల ప్రదానం కోసం వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన సదస్సులో  కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, మిషన్ డైరెక్టర్లు, వివిధ జిల్లాల కలెక్టర్లు/జిల్లా మేజిస్ట్రేట్‌లు పాల్గొన్నారు.  కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి వినీ మహాజన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశంలో నీటి వనరుల సుస్థిరతపై దృష్టి సారించి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సరఫరా నిర్మాణాల నిర్వహణను ప్రజా సంఘాల చేపట్టాలని, తద్వారా నిరంతరం త్రాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుందని అన్నారు. ఎస్.ఎస్.జి.- 2023 పేరిట చేపట్టిన సర్వే ప్రక్రియలో అత్యుత్తమ సామర్థ్యం చూపిన వారిని ఆమె ప్రశంసించారు. ఎస్.ఎస్.జి. 2023కోసం తగిన సన్నాహాలు చేయాలని సూచించారు.  "స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అనేది ర్యాంకింగ్ కోసం జరిపే కసరత్తు మాత్రమే కాదు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవ దశ కార్యక్రమంలోని లక్ష్యాలను సాధించేందుకు సత్వర చర్యను నిర్ధారించే యానకం కూడా." అని ఆమె అభిప్రాయపడ్డారు. అన్ని గ్రామాల ఒ.డి.ఎఫ్. ప్లస్ స్థితి పురోగతిపై పంచాయతీల స్వీయ-మధింపు అనే కొత్త ప్రక్రియతో ప్రజా సంఘాల/పంచాయతీల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని వినీ మహాజన్ తెలిపారు.

  కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా మాట్లాడుతూ, ఈ పథకం అమలులో స్వయం సహాయక గ్రూపులు నిర్వహించిన పాత్రను ప్రస్తావించారు. వారిని ప్రగతి భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమం అమలులో అవసరమైనపుడు వారు తగిన సహాయం అందిస్తారన్నారు. 

  కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ, కార్యక్రమం అమలులో  జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని సృష్టించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కృషితో పనితీరును మెరుగుపడుతుందని, అందరికీ సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందడానికి వీలవుతుందని అన్నారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు నెలనెలా మరింత మెరుగైన పనితీరును కనబరిచేందుకు, ప్రజలకు మెరుగైన సేవలను బట్వాడా చేసేందుకు జలజీవన్ సర్వేక్షణ్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్- 2023 కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

 

***


(Release ID: 1878537) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Marathi , Hindi