వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మార్గ్ (ఎంఎఎఆర్‌జి) పోర్టల్ కోసం స్టార్టప్ దరఖాస్తులను ప్రారంభించిన స్టార్టప్ ఇండియా
Posted On:
23 NOV 2022 2:57PM by PIB Hyderabad
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) స్టార్టప్ ఇండియా నిర్వహించే నేషనల్ మెంటార్‌షిప్ ప్లాట్‌ఫాం అయిన ఎంఎఎఆర్‌జి పోర్ట్‌లపై నమోదు చేసుకునేందుకు స్టార్టప్ దరఖాస్తులు చేసుకోవలసిందిగా పిలుపిచ్చింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా అతిపెద్ద 3వ వ్యవస్థగా ర్యాంకింగ్ పొందిన భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, స్టార్టప్ సంస్కృతికి ప్రేరణను ఇచ్చేందుకు, భారతదేశంలో వ్యవస్థాపకతకు, ఆవిష్కరణకు సమగ్రమైన, బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై స్టార్టప్ ఇండియా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎంఎఎఆర్‌జి (మార్గ్) పోర్టల్ - మార్గదర్శకత్వం, సలహా, సహాయం, స్థితిస్థాపకత, వృద్ధి అంశాలతో కూడిన ఏకీకృత వేదిక. భిన్న రంగాలు, విధులు, దశలు, భౌగోళిక ప్రాంతాలు, నేపథ్యాలు కలిగిన స్టార్టప్‌లకు మార్గదర్శకత్వ సౌలభ్యాన్ని ఈ వేదిక అందిస్తుంది.
ఎంఎఎఆర్‌జి పోర్టల్ లక్ష్యాలు -
- స్టార్టప్‌లు ఉనికిలో ఉన్నంత కాలం ఆయా క్షేత్రాలు లేక రంగాలపై దృష్టితో మార్గదర్శకత్వం, సన్నిహిత తోడ్పాటు, మద్దతు అందించడం.
- మార్గదర్శకత్వం చేసేవారు, ఆయా శిష్యుల మధ్య తెలివైన లంకెను సులభతరం చేసేందుకు అధికారిక, నిర్మాణాత్మక వేదికను ఏర్పాటు చేయడం.
- స్టార్టప్‌లకు సమర్ధవంతమైన, నిపుణుల మార్గదర్శకత్వాన్ని మార్గదర్శకులు - శిష్యుల (మెంటీ) సంభాషణలను సకాలంలో ట్రాక్ చేసేందుకు అనుమతించే ఫలితాలపై దృష్టిగల క్రియావిధాన సౌలభ్యాన్ని కల్పించడం.
ప్రస్తుతం విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విజయవంతమైన వ్యవస్థాపకులు, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర నిపుణులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ఆధారిత లంకె ద్వారా వృద్ధి, వ్యూహం కోసం వ్యక్తిగత మార్గదర్శనం కోసం స్టార్టప్‌లు ప్రభావవంతంగా అనుసంధానం కావచ్చు. పోర్టల్‌లో పొందుపరిచిన కీలక అంశాలలో పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేవారి అవసరాలకు అనుగుణమైన మార్గదర్శన కార్యక్రమాలు, మొబైల్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్‌ఫేజ్ (మొబైల్ ద్వారా తేలికగా కార్యకలాపం నిర్వహించడం), దోహదం చేస్తున్న మార్గదర్శకులకు గుర్తింపు, వీడియో, ఆడియో కాల్ ఆప్షన్లు ఉన్నాయి.
మార్గ్ పోర్ట్‌లను మూడు దశలలో అమలు చేస్తున్నారు
1. దశ 1ః మార్గదర్శకుడిని కలుపుకోవడం
వివిధ రంగాల వ్యాప్తంగా 400+కి పైగా నిపుణులైన మార్గదర్శకులను కలుపుకునే ప్రక్రియను విజయవంతంగా ప్రారంభించి, అమలు చేసింది.
2. దశ 2 ః స్టార్టప్‌ను కలుపుకోవడం
మార్గ్ పోర్టల్‌పై 14 నవంబర్ 2022 నుంచి స్టార్టప్‌లను కలుపుకుపోయే ప్రక్రియను డిపిఐఐటి ప్రారంభించింది.
3. దశ 3ః మార్గ్ పోర్టల్ ప్రారంభం & మార్గదర్శకుల లంకె
మార్గదర్శకులను స్టార్టప్‌లతో కలిపే అంతిమ ప్రక్రియను డిపిఐఐటి ప్రారంభించింది. రెండవ దశ కింద స్టార్టప్‌లను కలుపుకుపోయే ప్రక్రియను డిపిఐఐటి ప్రారంభించింది. ఆసక్తి కలిగిన స్టార్టప్‌లు https://maarg.startupindia.gov.in.అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఏ దేశానికైనా ఆవిష్కరణలు అనేవి అనివార్య వృద్ధి ఇంజిన్లు. కేవలం భారతదేశమే 82,000కు పైగా డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్‌లు, 107 యునికార్న్‌లు ఉన్నాయి. మన గొప్ప దేశపు ఆర్థిక సంపదకు, సాఫల్యానికి వ్యవస్థాపకత అన్నది మూలం. మనం ప్రస్తుతం ఉపాధి కోరే దేశం నుంచి ఉపాధి సృష్టించే దేశంగా వేగంగా పరివర్తన చెందుతున్నాం.
***
(Release ID: 1878532)
Visitor Counter : 157