సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘సియా'- న్యాయం కోసం దుర్మార్గపు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ఒక అమ్మాయి హృదయ విదార గాథ


"అన్యాయానికి గురైన వ్యక్తుల మానవీయ కోణాన్ని చిత్రీకరించే ప్రయత్నం నా చిత్రం": మనీష్ ముంద్రా, దర్శకుడు

Posted On: 23 NOV 2022 3:45PM by PIB Hyderabad

 'సియా' మన సామాజిక న్యాయ వ్యవస్థను ప్రతిబింబించే ప్రభావవంతమైన చిత్రం. అన్యాయానికి గురైన వ్యక్తుల మానవీయ కోణాన్ని చిత్రీకరించే ప్రయత్నం ఇది. న్యాయం కోసం ఒక దుర్మార్గపు పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ఒక అమ్మాయి హృదయ విదారక గాథ తన 'సియా' చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు మనీష్ ముంద్రా తెలిపారు. ఆంఖోన్ దేఖీ, మసాన్, న్యూటన్ వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించిన మనీష్ ముంద్రా తొలిసారిగా 'సియా' కోసం దర్శక సారధ్యం వహించారు.

గోవాలో 53వ భారత్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా పీఐబీ నిర్వహిస్తున్న 'టేబుల్ టాక్స్' సెషన్లలో ఒకచోట మీడియా, ఫెస్టివల్ ప్రతినిధులతో మాట్లాడిన మనీష్ ముంద్రా, న్యాయం కోసం బాధితులు తమ ప్రయాణంలో ఎదుర్కొంటున్న బాధాకరమైన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నమని తెలిపారు. ‘‘మనమందరం కూడా బాధితుల బాధను, వేదనను అనుభవించాలని, ఇది బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండటానికి మనకు సహాయపడుతుందని‘‘ ఆయన అన్నారు.

ఉత్తర భారతదేశంలోని గ్రామానికి చెందిన ఒక యువతి లైంగిక వేధింపులకు గురైన తరువాత న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకునే నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొందిన 'సియా' చిత్రం హృదయాలను కదిలించే విధంగా అత్యాచార బాధితుల భయాందోళనలను, బాధలను ఆవిష్కరిస్తుంది. ఆమె న్యాయం కోసం పోరాడటానికి ధైర్యం చేస్తుంది . శక్తివంతమైన వారి చేతిలో కీలుబొమ్మగా మారిన లోపభూయిష్ట న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. ‘సియా' నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినందున, సినిమాలు తీయడానికి సబ్జెక్టులను ఎంచుకోవడం పై అడిగిన ప్రశ్నలకు మనీష్ ముంద్రా సమాధానం ఇస్తూ, "నాకు సినిమాలు చేయడానికి చాలా మక్కువ ఉంది. నేను కమర్షియల్ బ్లాక్ బస్టర్ల కోసం చూడను. నా హృదయం , మనసును విషయాలను నేను ఎంచుకుంటాను. కథ నిత్యం ప్రేక్షకుల హృదయాలను కదిలించాలి" అని అన్నారు.

బాధితులను సమాజం క్రూరంగా మూలకు నెట్టివేసే న్యాయ పోరాటాల విషయంలో మన సమాజంలో ఉన్న అతిపెద్ద సందిగ్ధత గురించి మాట్లాడుతూ, మొదటి అడుగు వేసే ధైర్యం ప్రజలకు లేదని మనీష్ అన్నారు.

ఏదో ఒకవిధంగా వారు ఆ అడుగు వేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, అది చాలా ధైర్యం అవసరమయ్యే అనూహ్యమైన నొప్పికి ప్రత్యయం అని వారికి ఖచ్చితంగా తెలుసు."ఇది మన సామాజిక న్యాయ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది," అటువంటి సమస్యలకు సంబంధించి మా ఆందోళనకు ఎటువంటి షెల్ఫ్ లైఫ్ లేదని ఆయన అన్నారు. మేము వాటిని వెంటనే మరచిపోతాము . బాధితులకు ఎటువంటి సాంత్వన కోరకుండా ముందుకు సాగాము.

'సియా' వంటి సినిమాలో సమాజంలో ఉన్న వివిధ సానుకూల అంశాలను చిత్రీకరించడం గురించి అడిగినప్పుడు, మనీష్ ముంద్రా మాట్లాడుతూ, సమాజ సత్యాన్ని 'సియా' వంటి చిత్రంలో అందించడం చాలా ముఖ్యమని అన్నారు."ఇది కేవలం విచారం కాదు. మా సినిమా ఆత్మీయంగా ఉంటుంది. ఇది సత్యానికి సంబంధించినది .సత్యంలో బాధ, ఆనందం, ఆశ ,నిరాశ ఉన్నాయి.‘

పొగడ్తలు , విమర్శలు , ఎల్లప్పుడూ ఉంటాయి, అయితే సినిమాల్లో సానుకూలతను ప్రతిబింబించడం,  సమాజ సత్యాన్ని చూపించడం ముఖ్యం. అదే నా సినిమా శైలి. “ వాస్తవిక సినిమాలకు ఎప్పుడూ గొప్ప జీవితకాలం ఉంటుంది .ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తాయి” అని అన్నారు.

భారతదేశం నలుమూలల నుండి సినిమాలు తీయాలనే తన అలుపెరగని అభిరుచిని పంచుకున్న మనీష్ ముంద్రా, పాన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ కావాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. "ఎవరైనా నా అన్ని సినిమాలను కొంతకాలం పాటు చూసినప్పుడు, అది వారికి భారతదేశం అభిరుచిని అందివ్వాలి" అని అన్నారు.

నిర్మాతగా తన ఎనిమిది సంవత్సరాల ప్రయాణాన్ని, ఇప్పుడు దర్శకుడిగా తన తొలి చిత్రం గురించి మనీష్ ముంద్రా మాట్లాడుతూ, ఒక మనిషిగా తాను ఎల్లప్పుడూ వివిధ సవాళ్లను ఎదుర్కొన్నానని అన్నారు.”దర్శకత్వం వైపు దాని స్వంత సవాళ్లు , ఒత్తిడి ఉన్నాయి, ఇది సినిమా నిర్మాణంలో రాణించడానికి నన్ను ప్రేరేపిస్తుంది" అని ఆయన అన్నారు.

తరువాతి తరం చిత్రనిర్మాతలు తెరపై ఊహించిన వాటిని ఉదహరించే ఆరు అంతర్జాతీయ, భారతీయ ఫిక్షన్ ఫీచర్ తొలి చిత్రాల సేకరణతో ఈ చిత్రం ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ విభాగంలో పోటీపడుతోంది. ఐ ఎఫ్ ఎఫ్ ఐ 53 ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ‘సియా’ ను ప్రదర్శించారు. నటీనటులు పూజా పాండే , వినీత్ కుమార్ సింగ్ ఈ చిత్రంలో కథానాయకులు సీత ,మహేంద్ర పాత్రలను పోషించారు.

సినిమా గురించి

డైరెక్టర్ : మనీష్ ముంద్రా

ప్రొడ్యూసర్ : దృశ్యం ఫిలిమ్స్

స్క్రీన్ ప్లే: మనీష్ ముంద్రా

ఛాయాగ్రహణం: రఫే మహమూద్ అండ్ సుబ్రాంశు కుమార్ దాస్

ఎడిటర్: మనేంద్ర సింగ్ లోధి

తారాగణం : పూజా పాండే, వినీత్ కుమార్ సింగ్

2022 | హిందీ | కలర్ | 108 నిమిషాలు.

సారాంశం:

ఈ చిత్రం ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామానికి చెందిన ఒక యువతి, శక్తివంతమైన ప్రస్తుత శాసన సభ సభ్యునిచే అత్యాచారం చేయబడిన తరువాత న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుని, తద్వారా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో దుర్మార్గపు పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించే ఒక నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొందిన నాటకం.

దర్శకుడు: మనీశ్ ముంద్రా అంఖోన్ దేఖి (2014), మసాన్ (2015), ధనక్ (2016), న్యూటన్ (2017), రామ్ ప్రసాద్ కి తెహ్ర్వి (2021), సియా (2022) వంటి చిత్రాలకు జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత మరియు దర్శకుడు.

నిర్మాత: దృశ్యమ్ ఫిల్మ్స్ .మనీష్ ముంద్రా నెలకొల్పిన ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో.  న్యూటన్ (2017) వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలను నిర్మించింది. ఇది 2018లో అకాడమీ అవార్డ్స్ కు భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక అయిన చిత్రం.

* * *



(Release ID: 1878294) Visitor Counter : 184