సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

నేను కథలు రాయను, నేను కథలను దొంగిలిస్తాను : ఐ.ఎఫ్.ఎఫ్.ఐ-53 మాస్టర్‌ క్లాస్‌ లో వి. విజయేంద్ర ప్రసాద్


"మంచి అబద్ధం చెప్పగల వ్యక్తి మంచి కథకుడు కాగలడు"


కథ కోసం ప్రేక్షకుల్లో 'ఆకలి' సృష్టించాలనే తపన మీ సృజనాత్మకతను పరుగులు పెట్టిస్తుంది

"నేను కథలు రాయనునేను కథలను దొంగిలిస్తాను.  మీ చుట్టూ కథలు ఉన్నాయిఅది మహాభారతంరామాయణం వంటి ఇతిహాసాలు లేదా నిజ జీవిత సంఘటనలు కావచ్చుప్రతిచోటా కథలు ఉన్నాయి.  మీరుమీ ప్రత్యేక శైలిలో కథలకు ప్రాతినిధ్యం వహించాలి." అని, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. బజరంగీ భాయిజాన్, మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రచయిత, ప్రముఖ ప్రఖ్యాత స్క్రీన్ ప్లే రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్, వర్ధమాన రచయితలకు పలు సూచనలు చేశారు. 

మీ కథ కోసం ప్రేక్షకులలో ఆకలి పుట్టించాలనే తపన మీలో నిబిడీకృతమైన సృజనాత్మకతను పరుగులు పెట్టిస్తుంది. నేను ఎల్లప్పుడూ నా కథపాత్రల కోసం ప్రేక్షకులలో ఆకలిని సృష్టించడానికి ప్రయత్నిస్తాను.  అది నన్ను ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన కథను సృష్టించేలా చేస్తుంది”, అని ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వివరించారు.  గోవాలో జరుగుతున్న 53వ భారత్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ‘ది మాస్టర్స్ రైటింగ్ ప్రాసెస్’ అనే అంశంపై ఈ రోజు జరిగిన "మాస్టర్ క్లాస్‌" లో వర్ధమాన సినీ రచయితలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

శ్రీ విజయేంద్ర ప్రసాద్ తన చలన చిత్ర రచనా శైలి గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ఇంటర్వెల్‌ లో ట్విస్ట్ గురించి ముందుగా ఆలోచించి, ఆతర్వాత దానికి అనుగుణంగా కథను రూపొందిస్తానని, తెలియజేశారు.   “శూన్యం నుంచి మీరు ఏదైనా సృష్టించాలి. మీరు అబద్ధాన్ని ప్రదర్శించాలిఅది వాస్తవంగా కనిపించాలి.  ఒక మంచి అబద్ధాన్ని చెప్పగలిగిన వ్యక్తిఒక మంచి కథకుడు కాగలడు అని, ఆయన వివరించారు. 

ఒక వర్ధమాన కథా రచయిత అడిగిన ప్రశ్నకు, ఈ ప్రముఖ కథా రచయిత సమాధానమిస్తూ, ఒక వ్యక్తి తన మనస్సును తెరిచి ప్రతి విషయాన్నీ గ్రహించాలి, అని పేర్కొన్నారు.   "మీకు మీరే ఒక కఠినమైన విమర్శకుడిగా మారవలసిన అవసరం ఉంది. అప్పుడు మీ ఉత్తమ రచన మాత్రమే బయటకు వస్తుందితద్వారామీరు మీ రచనలను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళవచ్చుఅని ఆయన నొక్కి చెప్పారు.

బాహుబలి, ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు రాసిన అనుభవాన్ని శ్రీ ప్రసాద్ పంచుకుంటూ, నేను రాయనుకథలను డిక్టేట్ చేస్తాను.  నా మనసులో అన్నీ ఉంటాయి - కథా కథనంపాత్రలుమలుపులు”. అని చెప్పారు.  ఒక మంచి రచయిత తన దర్శకుడునిర్మాతప్రాథమిక కథానాయకుడు తో పాటు ప్రేక్షకుల అవసరాలను తీర్చాలిఅని, ఆయన సూచించారు. 

ఈ సదస్సుకు సినీ విమర్శకుడు, పాత్రికేయుడు మయాంక్ శేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

*****

 

iffi reel

(Release ID: 1877864) Visitor Counter : 216