సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఎవరినైనా మరియు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించడం: #NotJustIFFIMemeContest ప్రారంభించడం
చూసిన దానితో కళ్ళు, విన్నదానితో చెవులు సంతృప్తి పడవని అంటారు. అవును, మనం ఐఫి ని జరుపుకుంటున్నాము, కానీ మనం చూసే దానితో, మనం వినే దానితో మనం సంతృప్తి చెందలేదు . అంటే మనం మంచివి, గొప్పవి , అందమైనవి వినవచ్చు ఇంకా చూడగలుగుతాము, కానీ మనం సంతృప్తి చెందలేము. మన ఆత్మ నిండదు. అనంతమైన సినిమా స్ఫూర్తి కోసం మన తనివి , తృష్ణ తీరదు.
అవును, యే దిల్ మాంగే మోర్ మీమ్స్! మరింత సృజనాత్మక కంటెంట్. కేవలం ఐఎఫ్ ఎఫ్ ఐలో మాత్రమే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా అందాల ఆరబోత గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఐ.ఎఫ్.ఎఫ్.ఐ 53 వ ఎడిషన్ లో గౌరవించబడుతున్న చిత్రనిర్మాతల కలలు, పోరాటాలు ,ఆకాంక్షల నుండి మనలో ఎక్కువ మంది మరింత ప్రేరణ పొందుతున్నారు. మనలో చాలా మంది ఆశ్చర్యం, ఉత్సాహం, ఆనందం, అంతర్దృష్టులు అన్నింటికీ మించి ఐఎఫ్ఎఫ్ఐ నుండి మాత్రమే కాకుండా, ఐఎఫ్ఎఫ్ఐ నుండి పొందిన స్ఫూర్తిని పంచుకుంటున్నారు.
ఇదిగో ఇక్కడ మనం ఉన్నాం. పిఐబి వద్ద మేము - అంటే పిఐబి ఐఎఫ్ఎఫ్ఐ సిబ్బంది, బృందం కలసి - #NotJustIFFIMemeContest అని పిలిచే మీమ్ పోటీని ప్రారంభిస్తున్నాము.
ఇక్కడ పెద్దగా నిబంధనలు ఏవిలేవు:
ఒకే ఒక నిబంధన ఉంది: మీ అనంతమైన నిబిడీకృత సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికి తీయండి. ప్రతి ఒక్కరూ సృజనాత్మకంగా ఉంటారు. ఉండవచ్చు. ఒక గొప్ప మీమ్ లేదా గొప్ప మీమ్స్ లను l ప్రచురించండి, లేదా గొప్ప మీమ్స్ యొక్క వరుసను ప్రచురించండి, ఇది ప్రజలు నవ్వేలా చేస్తుంది, దూకుతుంది, ఎగరుతుంది, ఒకరినొకరు కౌగిలించు కునేల చేస్తుంది. వారి తమ కష్టాలను మరచి పోతారు.. అన్నింటికీ మించి సినిమాలతో , జీవితంతో మళ్లీ ప్రేమలో పడతారు.
మేము రూల్ 1 ను తిరిగి చెబుతాం. మీమ్స్ ప్రజలు సినిమాలతో , జీవితంతో తిరిగి అన్నింటితో ప్రేమలో పడేలా చేయాలి. మీ మీమ్స్ ను సోషల్ మీడియాలో పబ్లిష్ చేయండి. మీ మీమ్‌లను సోషల్ మీడియాలో ప్రచురించండి. #NotJustIFFIMEmes అనే హ్యాష్‌ట్యాగ్‌ని మాత్రమే ఉపయోగించవద్దు, అంటే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించండి, కానీ కేవలం హ్యాష్‌ట్యాగ్‌ని మాత్రమే ఉపయోగించవద్దు, ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి మీ గొప్ప స్ఫూర్తిదాయకమైన మీమ్‌లను షేర్ చేయండి. అన్ని మీమ్స్ గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. సృజనాత్మకతకు ప్రయోగాలు కీలకం. నవ్వడానికి భయపడకండి (మేము మిమ్మల్ని చూసి నవ్వము, ఎవరైనా మమ్మల్ని చూసి నవ్వినా మేము మీతో నవ్వుతాము!).
పోటీకి ముగింపు తేదీ లేదు. మేము స్ఫూర్తిదాయకంగా ఉండే మీమ్స్ తో ముందుకు వచ్చే మీమ్ సృష్టికర్తలకు బహుమతులు ఇస్తాము, ఇది కృతజ్ఞతతో మాత్రమే కాకుండా, మా ప్రశంసలు , రివార్డులతో కూడిన బహుమతి.
విజేతల ఎంపికకు స్థిరమైన సంఖ్య లేదు. మేము తగినంత స్ఫూర్తిదాయకంగా భావించే గొప్ప మీమ్స్ తో ముందుకు వచ్చిన, మాకు వీలైన చాలా మందికి బహుమతి ప్రదానం చేస్తాము.
బహుమతులు ఏమిటి? సినిమాలు, జీవితం పట్ల మీరు మరింత ప్రేమలో పడటానికి మిమ్మల్ని ప్రేరేపించే బహుమతులను మేము ఇస్తాము, తద్వారా ... మీరు ఈ మీమ్స్ ను సృష్టిస్తూ ఉంటారు. సినిమాల పట్ల , ఐ ఎఫ్ ఎఫ్ కోసం మీ ప్రేమను పంచుకుంటూ ఉంటారు, మీరు పోటీలో గెలిచినా లేదా గెలవకపోయినా!
మరి ఇంకెందుకు ఆలస్యం… ఇప్పుడే ఆలోచించడం ప్రారంభించండి! మీరు సృష్టించే మీమ్స్ చూడటానికి మేము ఇక వేచి ఉండలేము. ప్రారంభించండి.. ఇప్పుడే… తక్షణం..
***
(Release ID: 1877862)
Visitor Counter : 189