సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఓజు, మిజొగూచి, కురొసావా భూమి నుంచి
ఇఫ్ఫి 53లో ప్రదర్శితం కానున్న ఒక యానిమే సహా మూడు జపనీస్ చిత్రాలు
దాదాపు 100 ఏళ్ళు చరిత్ర కలిగిన జపాన్ సినిమా అన్ని కాలాలలో సినీ ప్రమకుల దృష్టిని ఆకట్టుకుంది. గతంలో సినిమా ప్రేమికుల కోసం ఇంటర్నషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లేదా ఇఫ్ఫి ఓజు, మిజుగూచి, కురుసావా భూమి నుంచి రత్నాలను అందించింది. గత ఏడాది 52వ ఇఫ్ఫిలో గోల్డెన్ పీకాక్‌ను పొందిన రింగ్ వాండరింగ్ అన్న జపనీస్ సినిమా మరుగున పడిన టోక్యో గత యుద్ధ కాలాన్ని పనరుజ్జీవింప చేసిన విషయం విస్మరించరాదు.
ఈ ఏడాది కూడా ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్‌గా ప్రసిద్ధి గాంచిన దేశం నుంచి మూడు సినిమాలను ఇఫ్ఫి ప్రదర్శిస్తోంది. అవి ఈ ఫెస్టివల్‌లోనే తొలి ప్రదర్శనను చేస్తోంది.
ఎ ఫార్ షోర్ (టూల్ టొకొరో) మసాకీ కుడో దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇండియన్ ప్రీమియర్‌ను కూడా ఇఫ్ఫి 53లో ప్రదర్శిస్తున్నారు. జపాన్‌లోని దక్షిణ ద్వీపమైన ఓకినావాలో ఉన్నత పాఠశాల నుంచి డ్రాప్ ఔట్ అయిన అయోయ్, మసాయాతో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన వైనాన్ని 2022లో నిర్మించిన ఈ చిత్రం చూపుతుంది. ఈ క్రమంలో మసాయా ఉద్యోగాన్ని కోల్పోవడంతో జీవనం కోసం ఆమె ఒక నైట్ క్లబ్ హోస్టెస్‌గా పని చేయడం ప్రారంభిస్తుంది కానీ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేకపోతుంది. వారి అపరిపక్వత, ఒకరిపై ఒకరు ఆధారపడడం వారి మధ్య బంధం నిరంతర గొడవలతో కొనసాగుతూ సామాజికంగా పతనానికి దారి తీస్తుంది. తన కొడుకు పట్ల ప్రేమతో పరిష్కారాలను కనుక్కోవడానికి అయోయ్ ఏం చేసిందో తెలుసుకోవడానికి చిత్రాన్ని చూడండి.
దర్శకుడి గురించి ః సినీ దర్శకుడు కుడో తొలి చిత్రం అయామ్ క్రేజీ 2018లో బుకాంవ్‌లో ఎన్ఇటిపిఎసి అవార్డును కైవసం చేసుకుంది. అతడు తదుపరి చిత్రం అన్‌ప్రెసిడెంటెడ్‌ను 2021లో తాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది, ఎ ఫార్ షోర్ అతడి మూడవ చిత్రం.
ఈ ఏడాది ఇఫ్ఫిలో ప్రదర్శితమవుతున్న మరొక జపనీస్ చిత్రం యమసాకీ జుల్చిరో దర్శకత్వం వహించిన యమబుకీ. 2022లో నిర్మించిన ఈ చిత్రం యమబుకీ అనే టీనేజ్ అమ్మాయి కథను వివరిస్తుంది. అంతిమంగా సమాజ చర్యగా పరిణమించే మౌన నిరసనలను ప్రారంభించి పోలీసు అయిన తండ్రిని నిరాశపరిచే అమ్మాయి కథ. గ్రామీణ ప్రాంతపు నిశబ్ద ఉపరితలాన్ని క్రమంగా ఒలిచేసి, నిరాశ, ఒంటరితనాన్ని బహిర్గతం చేసేందుకు, అభిప్రాయాన్ని ప్రకటించడం ద్వారా ప్రజలను ఒకరితో ఒకరిని అనుసంధానం చేయడం ప్రారంభిస్తుంది. జీవితంలో అడ్డంకులు మిమ్మల్ని కలవరపెట్టినప్పుడు మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవడానికి స్థలాన్ని కనుగొనే కథ ఇది.
దర్శకుడి గురించి: చిత్ర దర్శకుడు యమాసాకి జ్యుచిరో యూనివర్సిటీలో చదువుతుండగానే ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించాడు. అతడు ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్ (లఘు చిత్రాల)లను నిర్మించడమే కాక చిన్న పర్వత ప్రాంత గ్రామమైన ఒకయామాలో తరలివెళ్ళే ముందు సహాయ దర్శకుడిగా పని చేశారు. ది సౌండ్ ఆఫ్ లైట్ (2011) అతడి తొలి చిత్రం.
ఇవి కాకుండా, యానిమేషన్ ప్రేమికుల ఉల్లాసం కోసం కొజి యమమురా నిర్మించిన జపనీస్ యానిమే డజన్స్ ఆఫ్ నార్త్ (ఇకుత నొ కితా) అన్నతొలి పూర్తి నిడివి చిత్రాన్ని తొలిసారి భారత దేశంలో ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.
2011లో సంభవించిన భారీ తూర్పు జపాన్ భూకంపం తర్వాత యమమురా సృష్టించిన చిత్రాలు, విషయాలను, సందేశాలను విశిదం చేస్తుంది. ఈ చిత్రం ఆధునిక కాలంలో నిజ జీవితంలో ఎదురయ్యే సంకటాలను కాల్పనిక, సార్వత్రక కోణంలో పట్టిచూపుతూ, మానవ ఉనికి అసంబద్ధతలను, విఫాదాలను ఆశ అనే ఇంజెక్షన్లతో వివరిస్తుంది. అతడి అస్పష్టమైన, డార్క్ హ్యూమర్ తో కూడిన ప్రాపంచిక దృక్పదాన్ని రాజీపడకుండా తనకే ప్రత్యేకమైన చేతితో గీసిన్ యానిమేషన్ల ద్వారా ప్రదర్శితం అవుతోంది.
యమమురా యానిమేషన్ సంప్రదాయ యానిమేషన్ పై దృష్టిని కంద్రీకరిస్తుంది. అతడి అత్యంత ప్రసిద్ధ, ప్రశంసలు పొందిన రెండు చిత్రాలు మౌంట్ హెడ్, ఎ కంట్రీ డాక్టర్ ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి.
***
(Release ID: 1877799)
Visitor Counter : 193