ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఉక్కు పై ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకున్న - కేంద్ర ప్రభుత్వం

Posted On: 19 NOV 2022 12:54PM by PIB Hyderabad

2022 మే, 22 వ తేదీకి ముందు ఉన్న యథాతథ స్థితిని పునరుద్ధరిస్తూ, 58 శాతం కంటే తక్కువ ఎఫ్.ఈ. కంటెంట్ ఉన్న ముడి ఇనుము లంప్స్, ఫైన్స్, ముడి ఇనుము గుళికలు, పిగ్-ఐరన్‌ తో సహా ప్రత్యేకంగా పేర్కొన్న ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని, కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  ఆంత్రాసైట్ / పి.సి.ఐ. బొగ్గు, కోకింగ్ బొగ్గు, కోక్, సెమీ కోక్, ఫెర్రోనికెల్‌ పై దిగుమతి సుంకం రాయితీలను కూడా ప్రభుత్వం ఉపసంహరించింది. 

2022 నవంబర్, 19 తేదీ నుంచి  ఉపసంహరణలు అమలులో ఉంటాయి:   

*  58 శాతం కంటే తక్కువ ఎఫ్.ఈ. కంటెంట్ ఉన్న ముడి ఇనుము లంప్స్, ఫైన్స్ ఎగుమతులపై ఎగుమతి సుంకం లేదు.

*  58 శాతం కంటే ఎక్కువ ఎఫ్.ఈ. కంటెంట్ ఉన్న ముడి ఇనుము లంప్స్, ఫైన్స్ ఎగుమతులపై 30 శాతం మేర మాత్రమే ఎగుమతి సుంకం ఉంటుంది. 

*     ముడి ఇనుము గుళికల ఎగుమతులపై ఎగుమతి సుంకం లేదు.

*     హెచ్.ఎస్-7201, 7208, 7209, 7210, 7213, 7214, 7219, 7222, 7227 కింద వర్గీకరించబడిన పిగ్ ఐరన్, స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులపై ఎగుమతి సుంకం లేదు.

*     ఆంత్రాసైట్ / పి.సి.ఐ., కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్ పై 2.5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. 

*     కోక్, సెమీ కోక్‌ లపై 5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది.

ఉక్కు ధరలు 2022 మే నెలలో ఒక్కసారిగా, స్థిరంగా పెరిగి పోతూ ఉండడంతో,  శుద్ధిచేసిన ఉక్కుతో పాటు ముడి పదార్థాలు లేదా ఉక్కు తయారీకి అవసరమైన ఇతర వస్తువుల లభ్యతను పెంచడానికి,  ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం అనేక సుంకాల చర్యలను చేపట్టింది.

2022 మే22 తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా  

58 శాతం కంటే ఎక్కువ ఎఫ్.ఈ. కంటెంట్ ఉన్న ముడి ఇనుము లంప్స్ పై ఎగుమతి సుంకం 30 శాతం నుండి 50 శాతానికి పెంచడం జరిగింది;  

58 శాతం కంటే తక్కువ ఎఫ్.ఈ. కంటెంట్ ఉన్న ఇనుప ఖనిజం పై 50 శాతం ఎగుమతి సుంకం విధించడం జరిగింది;

ముడి ఇనుము పెల్లెట్స్ పై 45 శాతం ఎగుమతి విధించడం జరిగింది;  పిగ్ ఐరన్ (హెచ్.ఎస్. 7201, 7208, 7209, 7210, 7213, 7214, 7219, 7222, 7227) తో సహా వివిధ రకాల మిశ్రమం, నాన్-అల్లాయ్ స్టీల్‌ పై 15 శాతం ఎగుమతి సుంకం విధించబడింది;  

ఆంత్రాసైట్ / పి.సి.ఐ. బొగ్గు, కోకింగ్ బొగ్గు, కోక్, సెమీ కోక్, ఫెర్రోనికెల్‌ లకు దిగుమతి సుంకం మినహాయింపులు ఇవ్వడం జరిగింది. 

ప్రస్తుత చర్యలు దేశీయ ఉక్కు పరిశ్రమకు ఊరటనిస్తూ, ఎగుమతులను పెంచుతాయి.

*****

 



(Release ID: 1877406) Visitor Counter : 176