సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫ్ఫీ 53 - ఎవరూ వెనుకబడి లేరు
ఇఫ్ఫీ ఇప్పుడు దివ్యాంగులకు అనుకూలమైనది
గోవాలో 2022 నవంబర్ 20 నుండి 28 వరకు జరగనున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం- ఇఫ్ఫీ దివ్యాంగులకు, సినిమా ఔత్సాహికులందరికీ అందుబాటులో ఉంటుంది.
ఇఫ్ఫీ, విభిన్న ప్రతిభావంతులైన సినీ-ఔత్సాహికుల కోసం ఆడియో వివరణతో అందుబాటులో ఉండేలా, అలాగే సబ్-టైటిల్ ఉన్న సినిమాలు, చలనచిత్ర నిర్మాణం, నటన వంటి అంశాల్లో టెక్నికల్ వర్క్‌షాప్‌లను నిర్వహించడం జరుగుతోంది. వారి కోసం తగు మౌలిక సౌకర్యాలైన ర్యాంప్‌లు, నడక మార్గాలు, బ్రెయిలీ సైన్‌బోర్డ్‌లు మొదలైన వాటిని కూడా సమకూర్చారు.
సమాచార ప్రసారాల శాఖ, ఇఫ్ఫీ ద్వారా ఈ సంవత్సరం దివ్యాంగజన్ ప్రత్యేక విభాగాన్ని రూపొందించడం అనేది సినిమాని అందరినీ కలుపుకొని, అందుబాటులో ఉండే మార్గంగా మార్చడానికి ఒక ముందడుగు. ఈ విభాగంలో, ఫిల్మ్ స్క్రీనింగ్, వెన్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్‌మెంట్ ఫార్మాట్‌ల పరంగా వారి అందుబాటును అవసరాలను దృష్టిలో ఉంచుకుని విభిన్న ప్రతిభావంతులైన ప్రేక్షకుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఈ విభాగంలోని చలనచిత్రాలలో పొందుపరిచిన సబ్ టైటిల్స్, అలాగే ఆడియో వివరణలు ఉంటాయి. ఆడియో వర్ణనలు ప్రత్యేకంగా రూపొందించబడిన ఆడియో ట్రాక్‌లు, ఇవి సినిమాలోని దృశ్యమాన సమాచారాన్ని వివరిస్తాయి. ప్రేక్షకులు అది వినగలరు, సినిమా లోని అంశాలను ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది
ఇంకా ఆస్కార్ పొందిన రిచర్డ్ అటెన్‌బరో సినిమా గాంధీ, అనంత్ నారాయణ్ మహదేవన్ దర్శకత్వం వహించిన ది స్టోరీటెల్లర్ వంటి చలనచిత్రాలు, ఇఫ్ఫీ లో ప్రీమియర్‌గా 'దివ్యాంగజన్' విభాగంలో ప్రదర్శిస్తారు. ఇవి ఆడియో-విజువల్‌గా పొందుపరిచిన ఆడియో వివరణలు, ఉపశీర్షికలతో ఉంటాయి. ఇది విభిన్న ప్రతిభావంతులైన చలనచిత్ర అభిమానులకు కూడా అందుబాటులో ఉంచుతుంది, వారిని కూడా ఈ ఆనందాల్లో కలుపుకొనిపోయే స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.
Richard Attenborough’s Oscar winning Gandhi
The Storyteller directed by Ananth Narayan Mahadevan
విలక్షణమైన కళ ప్రక్రియ అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలనే లక్ష్యంతో, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దివ్యాంగుల కోసం రెండు ఉచిత కోర్సులను నిర్వహిస్తోంది - ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం స్మార్ట్‌ఫోన్ ఫిల్మ్ మేకింగ్‌లో ప్రాథమిక కోర్సు, నటన ను నేర్పడానికి ప్రాథమిక కోర్సు నిర్వహిస్తున్నారు.
పైన పేర్కొన్న అంశాలతో పాటు, దివ్యాంగుల ప్రత్యేక అవసరాల కోసం వేదిక మౌలిక సదుపాయాలు కూడా పునరుద్ధరించారు. ఈఎస్జి, చలనచిత్రాలు ప్రదర్శించే ఇతర వేదికల ప్రాంగణాలు ర్యాంప్‌లు, హ్యాండ్‌రైల్‌లు, దివ్యాంగులకు అనుకూలమైన నడక మార్గాలు, పార్కింగ్ స్థలాలు, రెట్రోఫిట్ చేసిన టాయిలెట్‌లు, బ్రెయిలీ లిపిలో సైన్‌బోర్డ్‌లు మొదలైన వాటితో ఎలాంటి అవరోధాలు లేకుండా ఏర్పాటు చేశారు.
బ్రెయిలీ లిపితో సైన్ బోర్డులు
టాయిలెట్ల వద్ద వాయిస్ ఆధారిత సహాయ వ్యవస్థ
సులభంగా గుర్తించగలిగే సైన్ బోర్డ్‌తో దివ్యాంగజన్ స్నేహపూర్వక పార్కింగ్ స్థలాలు
సులభంగా అందుబాటులో ఉండే స్పర్శ నడక మార్గం
References :
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1875884
https://www.un.org/development/desa/disabilities/about-us/sustainable-development-goals-sdgs-and-disability.html
https://www.ftii.ac.in/p/vtwa/basic-course-in-screen-acting-21st-to-28th-november-2022-for-individuals-on-wheelchair-in-goa
* * *
(Release ID: 1877405)
Visitor Counter : 182