పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషన్ లైఫ్ ను ప్రపంచ ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్లనున్న ఇండియా పెవిలియన్

Posted On: 19 NOV 2022 10:05AM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

వాతావరణ మార్పులలో భారతదేశం సాధించిన విజయాలను ప్రదర్శించిన పెవిలియన్ ; ఎల్ టి-ఎల్ ఇ డి ఎస్, లైఫ్ ప్రయాస్ సే ప్రభావ్ తక్ వంటి కీలక డాక్యుమెంట్లు విడుదల

పెవిలియన్ ను సందర్శించిన 25000 మంది కాప్ ప్రతినిధులు

2022 నవంబర్ 6 నుంచి 17 వరకు షార్మ్ ఎల్ షేక్ సి ఒ పి 27 వద్ద లైఫ్-లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ అనే ఇతివృత్తంతో భారతదేశం ఒక పెవిలియన్ కు ఆతిథ్యం ఇచ్చింది.వివిధ ఆడియో విజువల్స్, లోగో, 3 డి మోడల్స్, సెటప్, డెకరేషన్ ,సైడ్ ఈవెంట్ ల ద్వారా లైఫ్ సందేశాన్ని చాటేలా పెవిలియన్ ను రూపొందించారు.

పెవిలియన్ లో సిఓపి -27 జరిగినమొత్తం అన్ని రోజులూ వివిధ సైడ్ ఈవెంట్ లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పిఎస్ యులు, స్వయంప్రతిపత్త సంస్థలు/ సబార్డినేట్ సంస్థలు, థింక్ ట్యాంక్ లు , యుఎన్ ఆర్గనైజేషన్ లు ఈ సైడ్ ఈవెంట్ ల నిర్వాహకుల్లో ఉన్నాయి.పెవిలియన్ వద్ద 49 సైడ్ ఈవెంట్లు నిర్వహించారు. వీటిలో 16 కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. 10 కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాయి. ఈ పెవిలియన్ 23 ప్రైవేట్ సెక్టార్ ఈవెంట్ల కు కూడా సాక్షి గా నిలిచింది. కూడా చూసింది.

ఈ పెవిలియన్ ను నవంబ ర్ 6న

పర్యావరణ , అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రారంభించారు. తరువాత యు ఎన్ డిపి , యునిసెఫ్ సిఓపి 27 యంగ్ స్కాలర్స్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. నవంబర్ 14 వ తేదీని ఇండియా పెవిలియన్ లైఫ్ సంబంధిత ఈవెంట్ లకు కేటాయించారు. పర్యావరణ అనుకూలమైన , సుస్థిరమైన జీవనశైలిని వ్యాప్తి చేయడంలో యువత , పిల్లల భాగస్వామ్యాన్ని ప్రదర్శించడానికి ,ప్రోత్సహించడానికి ఆ రోజు కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.

పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశ దీర్ఘకాలిక తక్కువ ఉద్గార అభివృద్ధి వ్యూహాన్ని (ఎల్ టి - ఎల్ ఇ డి ఎస్) నవంబర్ 14న పెవిలియన్ లో విడుదల చేశారు.ఇండియా పెవిలియన్ నుండి లీడ్ ఐటి సమ్మిట్ స్టేట్ మెంట్ ను కూడా మంత్రి ప్రారంభించారు. లైఫ్ "ప్రయాస్ సే ప్రభవ్ తక్" సంకలనాన్ని విడుదల చేశారు. పర్యావరణం, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీమతి లీనా నందన్ కూడా ఇండియా పెవిలియన్‌లో సైడ్ ఈవెంట్‌లలో పాల్గొన్నారు, ఇందులో టెక్నాలజీ నీడ్స్ అసెస్‌మెంట్ , టి ఇ ఆర్ ఐ దీర్ఘకాలిక వ్యూహంపై అడాప్టేషన్ అడాప్టేషన్ రెడీనెస్ ఈవెంట్‌పై డి ఎస్ టి ఈవెంట్ కూడా ఉంది. సైడ్ ఈవెంట్ ల్లో 12 రోజుల వ్యవధిలో సుమారు 2000 మంది పాల్గొన్నారు.

పెవిలియన్ లో సుమారు 25,000 మంది సిఓపి ప్రతినిధులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, వస్త్రం , ఆహారంపై ప్రదర్శనతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాతావరణ మార్పులలో భారతదేశం సాధించిన విజయాలను ప్రదర్శించడం ద్వారా ఇండియా పెవిలియన్ సందర్శకులను ఉత్సాహపరిచింది. పెవిలియన్ వద్ద నిర్వహించిన బ్లాక్ ప్రింటింగ్ యాక్టివిటీలో సిఓపి వద్ద ప్రత్యేకంగా యువ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్శకులకు లైఫ్ బ్యాడ్జీలు బుక్ లెట్ ల డిస్ ప్లేలు, యాక్టివిటీలు , డిస్ట్రిబ్యూషన్ ద్వారా పెవిలియన్ జీవిత సందేశాన్ని వ్యాప్తి చేసింది.

***

 


(Release ID: 1877404) Visitor Counter : 193