సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఇలకు పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీపై నిర్వహించిన సిపిఎస్ఇ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ
Posted On:
19 NOV 2022 11:04AM by PIB Hyderabad
ఎంఎస్ఇలకు పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ (బహిరంగ సేకరణ విధానం) ఆర్డర్ కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ళను అర్థం చేసుకునేందుకు వివిధ సిపిఎస్ఇలతో సంభాషించేందుకు కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ అధ్యక్షతన ఎస్‌సి-ఎస్‌టి హబ్ కింద సూక్ష్మ, చిన్న& మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఇ) మంత్రిత్వ శాఖ సిపిఎస్ఇ సదస్సును 18 నవంబర్ 2022న న్యూఢిల్లీలో నిర్వహించింది. సదస్సుకు వివిధ సిపిఎస్ఇలకు చెందిన అధికారులు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం అధికారి హాజరయ్యారు.
సూక్ష్మ, చిన్న& మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఇ)కు నిర్దేశించిన బహిరంగ సేకరణ విధానం కింద ప్రతి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తాము ఉపయోగించే వస్తువులు, సేవలలో కనీస మొత్తం 25శాతం ఎంఎస్ఇ నుంచి కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇందుకు అదనంగా, ఎస్‌సి& ఎస్‌టి వ్యాపారవేత్తల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థల నుంచి మొత్తం 4%, మహిళా వ్యాపారవేత్తల యాజమాన్యంలోని సంస్థల నుంచి 3% మొత్తం వస్తువులను, సేవలను కొనుగోలు లేదా సేకరించవలసి ఉంటుంది.
ఎస్‌సి/ ఎస్‌టి, మహిళా ఎంఎస్ఇల నుంచి లక్ష్యిత సేకరణను సాధించేందుకు కృషి చేసిన సిపిఎస్ఇలను గుర్తించి, సత్కరించి, చైతన్యవంతం చేయడంపై సదస్సు దృష్టి కేంద్రీకరించింది.
పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ (బహిరంగ సేకరణ విధానం) నిర్దేశాలను నెరవేర్చేందుకు సిపిఎస్ఇలు చేపట్టిన కృషిని శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ప్రోత్సహించడమే కాక ఎస్‌సి/ ఎస్‌టి /మహిళా పారిశ్రామికవేత్తలను సానుకూలంగా సంప్రదిస్తూ, వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1877396)
Visitor Counter : 145