సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీకి ప్ర‌పంచ స్థాయిలో వ‌చ్చిన ప్రాచుర్యంతో ఐఐటిఎఫ్ లో ఖాదీ భార‌త్ పెవిలియ‌న్ వైపు విదేశీ రాయ‌బారుల చూపు


ఖాదీ దుస్తుల్లో వైవిధ్యాన్ని ప్ర‌శంసించిన రాయ‌బారులు

Posted On: 18 NOV 2022 3:04PM by PIB Hyderabad

ఖాదీకి ప్ర‌పంచ స్థాయిలో పెరుగుతున్న ప్రాచుర్యం శుక్ర‌వారంనాడు ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్ ఫెయిర్‌-2022లోని ఖాదీ ఇండియా పెవిలియ‌న్ కి భార‌త‌దేశంలో థాయ్ లాండ్ రాబారి ప‌ట్టార‌త్ హాంగ్ టాంగ్ ను, ఒమ‌న్ రాయ‌బారి ఇస్సా అల్షిబ‌నిని ఆక‌ర్షించింది. ఖాదీకి ప్ర‌పంచ స్థాయిలో పెరిగిన ప్రాచుర్యాన్ని రాయ‌బారులు ప్ర‌శంసిస్తూ ఖాదీ పెవిలియ‌న్ లోని సెల్ఫీ పాయింట్ లో మ‌హాత్మాగాంధీ, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చిత్ర‌ప‌టాల వ‌ద్ద సెల్ఫీలు తీసుకున్నారు. ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ డైరెక్ట‌ర్ (ప‌బ్లిసిటీ) శ్రీ సంజీవ్ పోస్వాల్ వారికి స్వాగ‌తం ప‌లికారు. ఖాదీ ఇండియా పెవిలియ‌న్ లోని ప‌లు ర‌కాల ఉత్ప‌త్తుల‌ను, ఖాదీ క‌ళాకారుల అద్భుత నైపుణ్యాన్ని రాయ‌బారులిద్ద‌రూ ప్ర‌శంసించారు.

రాయ‌బారులు నూలు వ‌డికే చ‌ర‌ఖాను వీక్షించ‌డంతో పాటు మ‌ట్టి పాత్ర‌ల త‌యారీ, అగ‌ర్ బ‌త్తీల త‌యారీ, చేతితో త‌యారుచేసే పేప‌ర్ త‌యారీ స‌హా నాణ్య‌మైన ఖాదీ దుస్తులు, రెడీమేడ్ గార్మెంట్లు, చేతితో త‌యారుచేసే ఆభ‌ర‌ణాలు, మూలికా ఆరోగ్య ఉత్ప‌త్తులు వంటి వివిధ గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించే స్టాల్స్ ను వీక్షించారు.

“ఐఐటిఎఫ్ లో ఇంత భారీగా ఖాదీ ఇండియా పెవిలియ‌న్ ను ఏర్పాటు చేసిన ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ను నేను అభినందిస్తున్నాను. ఖాదీ క‌ళాకారులు తాము త‌యారుచేసిన ఉత్ప‌త్తులు ఇంత పెద్ద వేదిక‌పై విక్ర‌యించే అవ‌కాశం ల‌భించింది. భార‌త‌దేశం, థాయ్ లాండ్ మ‌ధ్య ఖాదీ ప్ర‌త్యేక అనుబంధం క‌ల్పిస్తోంది. ప్ర‌పంచంలో క‌లిసిక‌ట్టుగా ఖాదీకి ప్ర‌చారం క‌ల్పించి ప్రోత్స‌హించేందుకు గ‌ల మార్గాల‌ను ఉభ‌య దేశాలు అన్వేషిస్తాయి” అని థాయ్ రాయ‌బారి అన్నారు.

రాంచి ఎంపి శ్రీ సంజ‌య్ శేఠ్ ఖాదీ పెవిలియ‌న్ ను సంద‌ర్శించ‌డంతో పాటు సెల్ఫీ పాయింట్ వ‌ద్ద ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చిత్ర‌ప‌టం వ‌ద్ద సెల్ఫీ తీసుకున్నారు.



(Release ID: 1877272) Visitor Counter : 92