విద్యుత్తు మంత్రిత్వ శాఖ
47వ ఐసిక్యూసిసి -2022లో గోల్డ్ అవార్డును గెలుచుకున్న ఎన్‌టిపిసి బృందం
Posted On:
17 NOV 2022 3:48PM by PIB Hyderabad
ఐసిక్యూసిసి -2022 ఇతివృత్తం బిల్ట్ బ్యాక్ బెటర్ త్రూ క్వాలిటీ ఎఫర్ట్స్ (గుణాత్మక కృషి ద్వారా మెరుగ్గా తిరిగి నిర్మాణం)
ఎన్‌టిపిసి బృందానికి ఫ్రీక్వెంట్ చోకింగ్ ఆఫ్ కలెక్టింగ్ ట్యాంక్స్ ఆఫ్ ఎహెచ్‌పి- IV (ఎహెచ్‌పి- IV సేకరణ ట్యాంకులలో తరచుగా అడ్డంకులు) అన్న అంశాన్ని ఇచ్చారు.
ఇమేజ్: గోల్డ్ అవార్డును అందుకున్న ఐసిక్యూసిసి-2022లో ఎన్‌టిపిసి క్యూసిసి అభ్యుదయ.
ఉంచహార్ అభ్యుదయ నుంచి వచ్చిన ఎన్‌టిపిసి క్యూసి బృందం 47వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ ( గుణ నియంత్రణ సర్కిల్‌పై 47వ అంతర్జాతీయ సదస్సు)లో గోల్డ్ అవార్డును దక్కించుకుంది. ఈ సదస్సును 15 నుంచి 18 నవంబర్ వరకు జకార్తాలో నిర్వహిస్తున్నారు. ఐసిక్యూసిసి-2022 ఇతివృత్తం- గుణాత్మక కృషి ద్వారా మెరుగ్గా నిర్మాణం. ఎన్‌టిపిసి క్యూసి బృందం ఫ్రీక్వెంట్ చోకింగ్ ఆఫ్ కలెక్టింగ్ ట్యాంక్స్ ఆఫ్ ఎహెచ్‌పి- IV (ఎహెచ్‌పి- IV సేకరణ ట్యాంకులలో తరచుగా అడ్డంకులు) అన్న అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది.
క్యూసి బృంద సభ్యులు- శ్రీరెయాజ్ అహమద్ (ఫెసిలిటేటర్ / సంధాత), శ్రీ మహేష్ చంద్ర, శ్రీ వీరేంద్ర కుమార్ యాదవ్, శ్రీ లక్ష్మీకాంత్ లు తమకు ఇచ్చిన సమస్యకు ప్రత్యేకమైన, ఆచరణీయమైన, నాణ్యమైన పరిష్కారాలను అందించేందుకు అవిశ్రాంతంగా పని చేశారు.
మార్చి 2022లో జరిగిన ప్రపంచ హెచ్ఆర్‌డి కాంగ్రెస్ 30వ సెషన్‌లో ఎన్‌టిపిసి ని డ్రీమ్ ఎంప్లాయర్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించారు.అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్‌మెంట్ (ఎటిడి) 2022కు గాను ఎటిడి ఉత్తమ అవార్డు విజేతగా ఎన్‌టిపిసిని ఎంపిక చేసినప్పుడే భవిష్యత్తు సవాళ్ళకు సంసిద్ధంగా ఉండే కార్మికశక్తిని సృష్టించేందుకు ఎన్‌టిపిసి చేస్తున్న కృషికి గుర్తింపు వచ్చింది. ఎన్‌టిపిసిలో కార్మిక పద్ధతులు ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు సమానంగా ఉన్నాయని ఈ అవార్డులు, గుర్తింపులు రూఢి చేస్తున్నాయి.
***
(Release ID: 1876938)
Visitor Counter : 178