శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆరోగ్య సేవల్లో అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాల అందుబాటుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీమోడీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా మారింది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
17 NOV 2022 1:02PM by PIB Hyderabad
"ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా భారతదేశంలో సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం" అనే అంశంపై ఎకనామిక్ టైమ్స్ హెల్త్ కేర్ లీడర్స్ సమ్మిట్-2022ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ;
*2019-2022 మధ్య కాలంలో విదేశీయులకు 10 లక్షలకు పైగా మెడికల్ వీసాలు జారీ; ప్రపంచంలో మెడికల్ టూరిజం హబ్ గా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది: డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
*భారతదేశంలో 4,000 పైగా హెల్త్టెక్ స్టార్టప్లు ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడంలో సహాయపడే ప్లాట్ఫారమ్ల నుండి పని చేస్తున్నాయి; అనారోగ్యాలు , వ్యాధులను గుర్తించడానికి, రోగులను వైద్యులతో కనెక్ట్ చేయడానికి ఎ ఐ ని ఉపయోగించే యాప్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా మారిందని, అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలతో సంపూర్ణ ఆరోగ్య సేవలను అందిస్తోందని కేంద్ర సైన్స్ -టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
2019-2022 మధ్య కాలంలో విదేశీయులకు 10 లక్షలకు పైగా మెడికల్ వీసాలు జారీ అయ్యాయని, ప్రపంచంలో మెడికల్ టూరిజం హబ్ గా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎకనామిక్ టైమ్స్ హెల్త్ కేర్ లీడర్స్ సమ్మిట్-2022లో డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మహమ్మారి సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలపై దాదాపు పూర్తి నిషేధం ఉన్నందున ఈ సంఖ్య చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. భారత దేశంలో ప్రపంచ వ్యాప్తంగాను, జాతీయంగాను ప్రపంచ ప్రమాణాలతో చికిత్సను చౌకగా అందించే గుర్తింపు పొందిన 600 ఆసుపత్రులు ఉన్నాయని మంత్రి వివరించారు.
2025 నాటికి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, గ్లోబల్ మెడికల్ టూరిజం మార్కెట్ విలువ 72 బిలియన్ డాలర్లు ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 2023 నాటికి వైద్య పర్యాటక రంగం లో భారత దేశం వాటా 10
బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. అంతేకాక, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధాల సరఫరాదారు అని మంత్రి తెలిపారు.
"చురుకైన ప్రభుత్వ చొరవల ద్వారా భారతదేశంలో ఒక సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం" అనే అంశంపై డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గత నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో ఆరోగ్య సౌకర్యాలను ప్రారంభించిన సందర్భంగా, "ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ హృదయం, ఉద్దేశ్యం నిండిపోకపోతే, తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదు" అని అన్నారని గుర్తు చేశారు.
అందరికీ అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణను సృష్టించడానికి ప్రభుత్వ ఉద్దేశం , విధానాలు సరైన అమరికలో ఉన్నాయని మంత్రి నొక్కిచెప్పారు.
2014 నుండి, మోదీ ప్రభుత్వం శాస్త్రీయ నైపుణ్యం ఉత్సాహాన్ని ఉపయోగించుకోవడంలో , ప్రస్తుత తరానికి అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడంలో, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటంలో పట్టు బిగించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సైన్స్, రీసెర్చ్ ద్వారా బలమైన లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ ను నిర్మించడంలో కూడా భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఆరోగ్య అసమానతలను తగ్గిస్తుందని, ఇంకా వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్ , డయాగ్నోస్టిక్స్ రంగాల నిరంతర విజయాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ నిర్మిస్తుందని ఆయన అన్నారు.దేశంలో ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు ఒక శక్తివంతమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక నిధులు, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ- పరిశ్రమ-విద్యా భాగస్వామ్యం ఇంక్యుబేషన్ ద్వారా సాధ్యమవుతోందని ఆయన అన్నారు.
కోవిడ్-19 సమయంలో భారతదేశ నాయకత్వ పాత్రను యావత్ ప్రపంచం గుర్తించిందని, ఇది పూర్తిగా డిజిటల్ ప్లాట్ ఫాం - కోవిన్ -ద్వారా 220 కోట్లకు పైగా టీకాలను అందించే అరుదైన ఘనతను సాధించిందని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అంటువ్యాధులను ఎదుర్కోవడానికి అత్యంత చౌకైన ఆరోగ్య జోక్యాలలో ఒకటిగా వ్యాక్సిన్ ల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన మంత్రి, మహమ్మారి సమయంలో, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల వేగవంతమైన అభివృద్ధి , పంపిణీలో భారతదేశం కీలక పాత్ర పోషించిందని అన్నారు. పరిశ్రమ, విద్యాసంస్థలు ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం ద్వారా వ్యాక్సిన్ల కోసం ఎండ్-టు-ఎండ్ అభివృద్ధికి , టెస్టింగ్ పైప్లైన్కు మద్దతు లభించిందని ఆయన తెలిపారు.
2015లో ఎర్రకోట నుంచి మోదీ ప్రారంభించిన స్టార్ట్ అప్ ఇండియా కింద 2014లో 400 స్టార్టప్ ల నుంచి నేడు80,000కు పైగా స్టార్టప్ లను కలిగి ఉన్నామని ఈ శిఖరాగ్ర సమావేశం అంశంగా సానుకూల ప్రభుత్వ చొరవలను దీనిని ఉత్తమంగా వివరించవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శాస్త్ర , సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణలపై ప్రధాన మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించడం దేశంలోని యువతకు కొత్త ఆలోచనలతో సమస్యలను పరిష్కరించ డానికి స్ఫూర్తినిస్తొందని, ఐటి, వ్యవసాయ రంగం, వైమానిక రంగం, విద్య , ఇంధనం, ఆరోగ్యం ,అంతరిక్ష రంగాలలో స్టార్టప్ లు శరవేగంగా ఎదుగుతున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో 4,000కు పైగా హెల్త్ టెక్ స్టార్టప్ లు ఉన్నాయని, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి సహాయపడే వేదికలు, అస్వస్థతలు, వ్యాధులను గుర్తించడానికి ఎ ఐ ని ఉపయోగించే అనువర్తనాలు, రోగులను వైద్యులతో అనుసంధానించే వేదికలు ఇంకా మరెన్నో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ పర్యావరణ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రపంచంలో ప్రముఖ రంగంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2022 పట్టకం ద్వారా భారతదేశాన్ని @2047 ను ఎవ్వరూ ఊహించలేరని అంటూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగం ముగించారు. .ప్రధానమంత్రిగా ఎనిమిదేళ్ళ పాలన లో నరేంద్ర మోదీ 2047 కోసం భారతదేశానికి విజన్ ఇచ్చారని , తదుపరి 25 సంవత్సరాల అమృత్ కాల్ కు రోడ్మ్యాప్ను వేశారని, ఇది ఉత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పరంగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రశ్రేణి దేశంగా ఎదగడానికి సాక్షి గా
నిలుస్తుందని ఆయన అన్నారు.
<><><><><>
(Release ID: 1876831)
Visitor Counter : 225