అంతరిక్ష విభాగం

శుక్రవారం శ్రీహరికోట నుండి జరగనున్న చారిత్రక తొలి ప్రైవేట్ విక్రమ్-సబార్బిటల్ (VKS) రాకెట్ ప్రయోగాన్ని వీక్షించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


•అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం అనుమతిస్తూ 2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయం తర్వాత జరగనున్న తొలి ప్రయోగం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

• అడ్డంకులను అధిగమించి ప్రయోగానికి సిద్ధమైన విక్రమ్ రాకెట్ తక్కువ ఖర్చుతో ప్రయోగం ఉపగ్రహ ప్రయోగ సేవలకు రంగం సిద్ధం చేస్తుంది : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 16 NOV 2022 6:39PM by PIB Hyderabad

 తొలిసారిగా ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించి సరికొత్త చరిత్ర సృష్టించడానికి  75 ఏళ్ల  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్దమయ్యింది. శుక్రవారం ఇస్రో  కొత్త మైలురాయిని నెలకొల్పుతూ ప్రైవేటు  రాకెట్‌ను ప్రయోగించడానికి ఏర్పాట్లు చేసింది.    విక్రమ్-సబార్బిటల్ (VKS) రాకెట్  చారిత్రాత్మక తొలి ప్రైవేట్ రాకెట్  ప్రయోగాన్ని నవంబర్ 18 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో  కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)శాస్త్ర, సాంకేతిక, సిబ్బంది, భూ శాస్త్రం  ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి మరియు అంతరిక్ష వ్యవహారాల సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ వీక్షించనున్నారు. ఈ  సందర్భంగా ఈరోజు ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో విక్రమ్-సబార్బిటల్ (VKS) రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు.  .విక్రమ్-సబార్బిటల్ (VKS) రాకెట్ ప్రయోగం నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుంది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశించడానికి అనుమతి ఇస్తూ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు సంవత్సరాల కిందట నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రైవేటు రాకెట్ ప్రయోగం జరుగుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రకటనలో వివరించారు. 

 ప్రభుత్వేతర సంస్థ/స్టార్టప్ అయిన  స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (SAPL) VKS రాకెట్‌ను అభివృద్ధి చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేసారు.  VKS రాకెట్‌   ఒక దశ స్పిన్ స్థిరీకరించిన ఘన ప్రొపెల్లెంట్ రాకెట్ గా . 550 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటుంది.  రాకెట్ గరిష్టంగా 101 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి సముద్రంలోకి దూసుకుపోతుందని, మొత్తం ప్రయోగం  300 సెకన్లలో పూర్తవుతుందని  ఆయన వివరించారు. 

రాకెట్ ప్రయోగం కోసం ఇస్రో తో  స్కైరూట్ సంస్థ తొలిసారిగా ఒప్పందం కుదుర్చుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. శుక్రవారం నాటి ప్రయోగం దేశంలో జరుగుతున్న మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  స్కైరూట్ ఏరోస్పేస్  మొదటి మిషన్ అయిన ప్రయోగానికి , "ప్రారంభ్" అని  పేరు పెట్టారు. రాకెట్ విదేశానికి చెందిన ఒక పేలోడ్ తో సహా  మొత్తం మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోప్రవేశపెడుతుంది. 

తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించడానికి వేదిక అందుబాటులోకి వస్తుంది. తొలుత ఎదురైన అడ్డంకులను అధిగమించి ప్రయోగానికి ఏర్పాట్లు జరిగాయని అన్నారు. దీనివల్ల నమ్మదగిన సౌకర్యాలు  సరసమైన ధరలకు  అంకుర సంస్థలు  (స్టార్టప్‌) అందించడానికి  సహాయపడుతుందని మంత్రి చెప్పారు.అంతరిక్ష రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సంస్కరణలు దేశ అంకుర సంస్థల వినూత్న సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  అతి తక్కువ కాలంలో దేశంలో అంతరిక్ష రంగంలో అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు.  మూడు-నాలుగు సంవత్సరాల క్రితం దేశంలో అంతరిక్ష రంగంలో కేవలం రెండు అంకుర సంస్థలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో102 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని అన్నారు. డెబ్రీస్ మేనేజ్‌మెంట్, నానో శాటిలైట్, లాంచ్ వెహికల్, గ్రౌండ్ సిస్టమ్స్, రీసెర్చ్ లాంటి  అత్యాధునిక రంగాల్లో పనిచేస్తున్నాయి. పరిశోధన అభివృద్ధి, విద్యా రంగం, పరిశ్రమ వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి  ఏకీకృతం చేయడంతో భారత అంతరిక్ష రంగంలో నవ శకం ప్రారంభమయ్యిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  ప్రైవేట్ రంగంతో పాటు ఇస్రో సారధ్యంలో సాగుతున్న   అంతరిక్ష విప్లవంలో పాల్గొనడానికి అంకుర సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారధ్యంలో శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.దేశానికి చెందిన అంకుర సంస్థలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు,  నానోశాటిలైట్‌లతో సహా సామర్థ్యాల పెంపుదల, ఉపగ్రహ నిర్మాణంలో వర్ధమాన దేశాలకు సహాయం చేస్తున్నందున ప్రపంచం మొత్తం భారత్‌ను స్ఫూర్తిదాయకమైన ప్రదేశంగా చూస్తోందని ఆయన అన్నారు.

రైల్వే, రహదారులు , వ్యవసాయం, జల వనరుల గుర్తింపు, స్మార్ట్ నగారాలు, టెలిమెడిసిన్ మరియు రోబోటిక్ సర్జరీ వంటి వివిధ రంగాలకు అంతరిక్ష సాంకేతికత  పరిజ్ఞానం సహకారం అందిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. దీనివల్ల ప్రజలకు జీవన సౌలభ్యం కలిగిందని అన్నారు.    వ్యవసాయం మరియు పంటల అభివృద్ధి, మొక్కలు మరియు నేల ఆరోగ్యం కోసం వ్యవసాయ సాంకేతికతలు మరియు ఆహార సంరక్షణ కోసం అణు, రేడియేషన్ సాంకేతికతలు, పండ్లు మరియు కూరగాయల రేడియేషన్ ప్రాసెసింగ్ మరియు పంట పెరుగుదల మరియు నీటి సంరక్షణను పెంచడానికి రేడియేషన్ ఆధారిత సాంకేతికతలు వంటివి అంతరిక్షం మరియు పరమాణు అభివృద్ధికి సరైన ఉదాహరణలు అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇదివరకు  ఉపగ్రహ ప్రయోగం మరియు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి లాంటి అంశాలకు పరిమితమైన అణు, రేడియేషన్ సాంకేతికతలు ఇతర రంగాలకు విస్తరించాయని అన్నారు. 

***



(Release ID: 1876688) Visitor Counter : 188


Read this release in: English , Urdu , Hindi , Marathi