మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళల్లో డిజిటల్ నైపుణ్యం మరియు అవగాహన కల్పించడానికి డిజిటల్ శక్తి 4.0ని ప్రారంభించిన ఎన్‌సిడబ్ల్యూ
Posted On:
16 NOV 2022 3:56PM by PIB Hyderabad
- దేశవ్యాప్తంగా మహిళల్లో డిజిటల్ ఫ్రంట్‌పై అవగాహన స్థాయిని పెంచడంలో సహాయపడటానికి 2018, జూన్‌లో డిజిటల్ శక్తి ప్రారంభమైంది.
- ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం అంతటా 3 లక్షల మంది మహిళలకు సైబర్ భద్రతా చిట్కాలు మరియు ఉపాయాలపై అవగాహన కల్పించారు
- ఇది రిపోర్టింగ్ & రిడ్రెసల్ మెకానిజమ్స్, డేటా గోప్యత మరియు వారి ప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించడంలో మహిళలకు సహాయం చేస్తోంది.
సైబర్‌స్పేస్‌లో మహిళలు మరియు బాలికలకు డిజిటల్ సాధికారత మరియు నైపుణ్యం కల్పించడానికి చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమం డిజిటల్ శక్తి క్యాంపెయిన్ నాల్గవ దశను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్ల్యూ) నిన్న ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు మరియు బాలికలకు సురక్షితమైన విధానాన్ని సృష్టించాలన్న నిబద్ధతకు అనుగుణంగా డిజిటల్ శక్తి 4.0 మహిళలను డిజిటల్ నైపుణ్యం కలిగిన వారిగా చేయడంపై దృష్టి సారించింది. అలాగే ఆన్‌లైన్‌లో ఏదైనా చట్టవిరుద్ధమైన/అనుచితమైన కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిలబడేలా చేస్తుంది. సైబర్‌పీస్ ఫౌండేషన్ మరియు మెటా సహకారంతో ఎన్‌సిడబ్ల్యూ దీన్ని ప్రారంభించింది.
ఎన్‌సిడబ్ల్యూ చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి రంగంలో మహిళల సాధికారత కోసం కమిషన్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మహిళలకు సురక్షితమైన సైబర్ ప్రదేశాలను నిర్ధారించడంలో ఈ కొత్త దశ ఒక మైలురాయిగా నిరూపిస్తుంది. డిజిటల్ శక్తి మహిళలు మరియు బాలికల డిజిటల్ భాగస్వామ్యాన్ని వారి ప్రయోజనాలకు అనుగుణంగా మరియు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచుకోవడానికి వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి డిజిటల్ భాగస్వామ్యాన్ని వేగవంతం చేస్తోంది. మహిళలు మరియు బాలికలపై సైబర్ హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి మరియు ఇంటర్నెట్‌ను వారికి సురక్షితమైన స్థలంగా మార్చే పెద్ద లక్ష్యం కోసం ప్రాజెక్ట్ దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను" అని అభిప్రాయపడ్డారు.
నాల్గవ దశ డిజిటల్ శక్తి ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎన్‌సిడబ్ల్యూ చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ
ఆన్‌లైన్ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమ, ప్రభుత్వం మరియు విద్యావేత్తలు, నిపుణుల నుండి మంచి అభిప్రాయాలను అందించడానికి "సేఫ్ స్పేసెస్ ఆన్‌లైన్ కంబాటింగ్ సైబర్-ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు ఇతర రకాల ఆన్‌లైన్ హింస"పై ఇంటరాక్టివ్ ప్యానెల్ చర్చ కార్యక్రమంలో ప్రారంభించబడింది. అన్ని టాంజెంట్‌ల నుండి మహిళల భద్రత మరియు ఆన్‌లైన్‌లో మెరుగైన మహిళల భద్రతను నిర్ధారించడానికి పూర్తి విధానాన్ని ఇది అందిస్తుంది.
పద్మశ్రీ సునీత కృష్ణన్, జనరల్ సెక్రటరీ, ప్రజ్వల, శ్రీ అశుతోష్ పాండే, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, ఎన్‌సిడబ్ల్యూ, పవన్ దుగ్గల్, అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరియు సలహాదారు, సిపిఎఫ్, వీరేంద్ర మిశ్రా,ఏఐజీ, ఎస్‌ఐఎస్‌ఎఫ్, మధ్యప్రదేశ్ పోలీస్ మరియు సలహాదారు, ఎన్‌సిడబ్ల్యూ, ప్రీతి చౌహాన్ , డైరెక్టర్-ఆపరేషన్స్, సిపిఎఫ్ ఈ చర్చలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా మహిళలకు డిజిటల్ ఫ్రంట్‌పై అవగాహన స్థాయిని పెంచడానికి, స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు సైబర్ నేరాలను అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఎదుర్కోవడానికి సహాయం చేయడానికి జూన్ 2018లో డిజిటల్ శక్తి ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం అంతటా 3 లక్షల మందికి పైగా మహిళలకు సైబర్ భద్రత చిట్కాలు మరియు ఉపాయాలు, రిపోర్టింగ్ & రిడ్రెసల్ మెకానిజమ్స్, డేటా గోప్యత మరియు వారి ప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించడం గురించి అవగాహన కల్పించారు.
మూడవ దశ కార్యక్రమం మార్చి 2021లో లెహ్‌లో ఎన్‌సిడబ్ల్యూ చైర్‌పర్సన్ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ రాధా కృష్ణ మాథుర్ & జమ్యాంగ్ త్సెరింగ్ నమ్‌గ్యాల్, ఎంపీ, లడఖ్ సమక్షంలో ప్రారంభించబడింది. ఒక మహిళ ఏదైనా సైబర్ నేరాన్ని ఎదుర్కొన్న సందర్భంలో నివేదించే అన్ని మార్గాలపై సమాచారాన్ని అందించడానికి ఒక వనరుల కేంద్రం కూడా మూడవ దశలో అభివృద్ధి చేయబడింది.
*****
(Release ID: 1876629)
Visitor Counter : 262