సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
41వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటిఎఫ్). 2022లో ఎంఎస్ఎంఇ పెవిలియన్‌ను ప్రారంభించిన శ్రీ నారాయణ్ రాణె
Posted On:
15 NOV 2022 12:49PM by PIB Hyderabad
కేంద్ర ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణె ఎంఎస్ ఎంఇ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ సమక్షంలో మంగళవారం నాడు న్యూఢిల్లీలో జరుగుతున్న 41వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటిఎఫ్- భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన)లో ఎంఎస్ఎంఇ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఎంఎస్ఎంఇ పెవిలియన్‌ను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో హాల్ నెం. 4లో ఏర్పాటు చేశారు.
ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఈ ప్రదర్శన ఎంఎస్ఎంఇ వాణిజ్యవేత్తలకు, ముఖ్యంగా మహిళలు, ఎస్‌సి/ ఎస్‌టిలు, లక్ష్యిత జిల్లాలకు చెందిన వాణిజ్యవేత్తలు తమ నైపుణ్యాలను/ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించి, స్వయం సమృద్ధిని కలిగి ఉండటానికి అవకాశాన్ని కల్పిస్తుందని శ్రీ రాణె అన్నారు.
జౌళి, ఆహారం, మెటలర్జీ, సుగంధ ద్రవ్యాలు, పాదరక్షలు, బొమ్మలు, రసాయన, ఎలక్ట్రికల్, తోలు, ప్లాస్టిక్, రబ్బర్, రత్నాలు, ఆభరణాలు సహా 26 రంగాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న మొత్తం 205 ఎంఎస్ఎంఇలలో పలువురు ప్రదర్శకులను ఎంఎస్ఎంఇ పెవిలియన్ లో శ్రీ రాణె కలుసుకున్నారు. ఈ ఏడాది మహిళల నేతృత్వంలోని సంస్థలలో అత్యధిక భాగస్వామ్యాన్ని (74%) ఎంఎస్ఎంఇ పెవిలియన్ కలిగి ఉంది.
రెండవ జన జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా, దేశ చరిత్ర, సంస్కృతికి గిరిజన సమాజాలు చేసిన సేవలను, ఇచ్చిన సహకారాన్ని పట్టి చూపుతూ, గిరిజన ప్రాంతాల సామాజిక- ఆర్ధిక అభివృద్ధికి ప్రయత్నాలను పునఃశక్తివంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
***
(Release ID: 1876185)
Visitor Counter : 140