రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బీహార్‌లోని రోహ్‌తాస్‌లో పండుకా సమీపంలో సోన్ నదిపై 1.5 కిమీల పొడవైన 2- లేన్ ఎత్తైన వంతెనను ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
14 NOV 2022 3:45PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రూ. 210 కోట్ల విలువతో బీహార్‌లోని రోహ్‌తాస్ లో పండుకా సమీపంలో సోన్ నదిపై నిర్మించిన 2 లేన్ ఎత్తైన 1.5 కిమీ పొడవైన ఆర్.సి. బ్రిడ్జి పనులను ప్రారంభించారు.
ఈ వంతెనకు నిర్మాణానికి పునాదిరాయిని డిప్యూటీ ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, బీహార్ బిజెపి అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, ఎంపి ఛేదీ పాశ్వాన్, విష్ణు దయాళ్ రామ్, బీహార్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల సమక్షంలో వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణంతో ఎన్‌హెచ్-19, ఎన్‌హెచ్-39 నేరుగా అనుసంధానం అవుతాయని, ఇది బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మధ్య ట్రాఫిక్ సుగమం అవుతుందని శ్రీ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం, జార్ఖండ్‌లోని రోహతాస్ జిల్లాలోని పండుకా, గఢ్వా జిల్లా నుంచి శ్రీనగర్ చేరుకోవడానికి 150 కిమీల దూరం ప్రయాణించాల్సి ఉందని, ఈ వంతెన నిర్మాణంతో ఈ ప్రయాణంలో నాలుగు గంటల సమయం ఆదా అవుతుందన్నారు.
దీనితో ఢిల్లీ బ్రిడ్జి పై ఒత్తిడి తగ్గడమే కాక ఔరంగాబాద్, సాసారాం నగరాలు ట్రాఫిక్ జాం సమస్య నుంచి వదులుతుంది.
పండుకా ప్రాంతంలో ఈ వంతెన నిర్మాణంతో సమీప ప్రాంతాలు, రాష్ట్రాల పారిశ్రామిక, వ్యవసాయ, పాల ఉత్పత్తుల మార్కెట్‌లను సులభంగా చేరుకకోవచ్చని మంత్రి తెలిపారు. ఇది సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపారు.
***
(Release ID: 1875922)
Visitor Counter : 125