రైల్వే మంత్రిత్వ శాఖ
యూటీఎస్‌ఆన్‌మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్ల బుకింగ్‌కు దూర పరిమితిని సడలించిన రైల్వే మంత్రిత్వ శాఖ
• నాన్ సబర్బన్ ప్రాంతాల్లో ఇప్పుడు 20 కి.మీ. దూరం వరకు అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు, గతంలో ఈ పరిమితి 5 కి.మీ.
• సబ్ అర్బన్ ప్రాంతాల్లో దూర పరిమితి 2 కి.మీ. నుంచి 5 కి.మీ.కు పెంపు
Posted On:
14 NOV 2022 4:07PM by PIB Hyderabad
యూటీఎస్‌ఆన్‌మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ మరింత సరళీకరించింది. అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లను బుక్ చేసుకునే దూరాన్ని సబర్బన్‌యేతర ప్రాంతాలకు 20 కి.మీ దూరం వరకు పొడిగించాలని నిర్ణయించింది. సబ్‌అర్బన్ ప్రాంతాలకు ఈ దూరాన్ని 5 కి.మీ. పెంచింది.
గతంలో, యూటీఎస్‌ఆన్‌మొబైల్ యాప్ ద్వారా నాన్ సబర్బన్ ప్రాంతాల్లో ప్రయాణీకులు 5 కి.మీ. వరకే అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకునేందుకు అనుమతి ఉంది. సబర్బన్ విభాగానికి గతంలో ఈ దూర పరిమితి 2 కి.మీ.గా ఉంది.
మరిన్ని వివరాలకు https://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
***
(Release ID: 1875920)