వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశం చేరుకుందని ప్రపంచం నేడు గుర్తించింది : శ్రీ పీయూష్ గోయల్
భారతదేశ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది, విస్తృతమైన సంప్రదింపులు, ఆలోచనల తర్వాత మాత్రమే ఎఫ్.టి.ఏ. లలోకి ప్రవేశిస్తుంది : శ్రీ గోయల్
ఆర్.సి.ఈ.పి. నుండి వైదొలగడం మన దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయం : శ్రీ గోయల్
నూతన భారతదేశానికి ఉజ్వలమైన, శక్తివంతమైన, సుసంపన్నమైన భవిష్యత్తు ఉంది : శ్రీ గోయల్
Posted On:
12 NOV 2022 7:01PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశం చేరుకుందని, ప్రపంచం నేడు గుర్తించిందని, పేర్కొన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాజకీయ ప్రపంచంలో, వ్యాపార ప్రపంచంలో అందరూ ఇప్పుడు భారత దేశ విధానాలను అంగీకరిస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు. ఈ విషయాన్ని మరింతగా వివరిస్తూ, భారత దేశ విధానం చాలా సానుకూల మనస్తత్వాన్ని చూపుతుందని, తమ కోసం మెరుగైన జీవితాన్ని కోరుకునే బిలియన్లకు పైగా ప్రజల ఆకాంక్షలను చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం కేవలం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదని, అవినీతి రహిత సమాజానికి పెద్దపీట వేసే రాజకీయ స్థిరత్వాన్ని కూడా చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశం ప్రపంచంలోనే ఒక ప్రకాశవంతమైన ప్రదేశమనీ, ఇది బిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాలను మెరుగు పరచడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా సహాయం చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచం దాని స్వంత ఆర్థిక వృద్ధి, భారత దేశ మార్కెట్ కోసం మాత్రమే కాకుండా, భారత దేశ జనాభా డివిడెండ్ తో పాటు, భారీ టాలెంట్ పూల్ కోసం కూడా భారతదేశంపై ఆధారపడి ఉంది. రాబోయే 25 ఏళ్లలో భారతదేశం ప్రపంచ సూపర్ పవర్ గా అవతరించబోతోందని తాను నమ్ముతున్నానని శ్రీ గోయల్ అన్నారు.
దేశాలతో ఎఫ్.టి.ఎ. లలో ప్రవేశించేటప్పుడు భారతదేశ ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ గోయల్ హామీ ఇచ్చారు. భారతదేశం కేవలం తన కోసమే ఒప్పందాలను కుదుర్చుకోదు, అయితే అన్ని వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులతో పాటు, అన్ని సమస్యలను పరిష్కరించే లోతైన మేధోమథనం తర్వాత మాత్రమే ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ఆయన తెలియజేశారు. భారతదేశం బలం ఉన్న స్థానం నుండి మాత్రమే చర్చలు జరుపుతుందనీ, అయితే న్యాయమైన, సమతుల్య ఒప్పందాన్ని కోరుకుంటుందని, శ్రీ గోయల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆర్.సి.ఈ.పి. (ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం) నుంచి వైదొలగడం మన పరిశ్రమ, మన దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని శ్రీ గోయల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.
నూతన భారతదేశానికి ప్రకాశవంతమైన, చాలా శక్తివంతమైన, చాలా సంపన్నమైన భవిష్యత్తు ఉంది, అని శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని శక్తివంతమైన యువ దేశంగా ఆయన పేర్కొన్నారు. ఇది జీవితంలో మంచి విషయాలను కోరుకుంటుందనీ, ప్రయోగాలు చేయడానికి, ఆవిష్కరణలకు, ఒడిదుడుకులు తట్టుకోడానికి, సిద్ధంగా ఉందనీ, ఆయన పేర్కొన్నారు.
నిన్న వారణాసిలో అంకుర సంస్థల యువజనులతో మాట్లాడిన సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ, దేశంలో చాలా సానుకూల శక్తి ఉందని, జాతీయవాద స్ఫూర్తి ఉన్నత స్థాయిలో ఉందని, పేర్కొన్నారు. ప్రజల ఆలోచనా విధానం మారుతోంది, భారత దేశ విశ్వాసం బలపడుతోంది, భారత దేశ భవిష్యత్తు సురక్షితమైనది, అని అభివర్ణించారు.
*****
(Release ID: 1875651)
Visitor Counter : 125