ఆయుష్

2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆయుష్ రంగం మార్కెట్ వాటా 23 బిలియన్ డాలర్లకు చేరుతుంది :శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 12 NOV 2022 7:09PM by PIB Hyderabad

నాగ్‌పూర్‌లో ఈరోజు  జరిగిన ఆయుర్వేద వ్యాసపీఠం  రజతోత్సవంర్   ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులు, షిప్పింగ్  జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ ఇతర ప్రముఖ ఆయుర్వేద అభ్యాసకులు, వైద్యులు మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ  ఆయుర్వేదం భారతదేశ సుసంపన్నమైన వారసత్వ సంపదగా లభించిందని అన్నారు. ఆయుర్వేదం ఐదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని అన్నారు. స్థానిక సాధికారత అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమలు చేస్తున్న చర్యలు ఆయుర్వేద వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రజల  జీవితాలను సుసంపన్నం చేసే సామర్థ్యం కలిగిన   భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు పూర్వ వైభవం సిద్ధిస్తుందని అన్నారు. ఇతర సంప్రదాయ భారత వైద్య  విధానాలతో పాటు ఆయుర్వేద వైద్య విధానానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నదని శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు.   ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ రంగానికి గుర్తింపు లభించిందని అన్నారు.  2023 నాటికి భారతీయ ఆయుష్ రంగం 23 బిలియన్ అమెరికా డాలర్లకు విలువ చేసే  మార్కెట్‌ కలిగి ఉంటుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని ఆయుష్ రంగం నిర్ణయించిన గడువులో చేరుకోవడానికి వీలుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. 

గత  25 సంవత్సరాలుగా ఆయుర్వేద వ్యాసపీఠం నిస్వార్థంగా దేశానికి సేవలు అందిస్తున్న ఆయుర్వేద వ్యాసపీఠం కార్యక్రమాలను మంత్రి అభినందించారు. ఆయుర్వేదంపై   అవగాహన కల్పించడానికి ఆయుర్వేద వ్యాసపీఠం ఎనలేని కృషి చేసిందని అన్నారు.  శాస్త్రీయ మూల్యాంకన ప్రక్రియ ప్రకారం ఆయుర్వేద  వైద్య విద్య , పరిశోధన, శాస్త్రీయ పరిశోధన మరియు  ప్రచారం జరగాలని మంత్రి అన్నారు. నిపుణులు, వైద్యులు, ఔషధాల ఉత్పత్తిదారులు మరియు ఈ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ దిశలో  కృషి చేసి ఆయుర్వేద రంగం అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని మంత్రి కోరారు.

***



(Release ID: 1875642) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi