వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశంలో తేయాకు రంగ భవిష్యత్తును రూపొందించడంలో చిన్న తేయాకు పెంపకందారులు అతిపెద్ద పాత్ర పోషిస్తారు: శ్రీ పీయూష్ గోయల్


ఒక జిల్లా మరియు ఒక ఉత్పత్తి (ఓడిఓపి) పథకం భారతీయ టీ కీర్తిని వ్యాప్తి చేయడంలో సహాయపడుతుంది: శ్రీ పీయూష్ గోయల్

తేయాకు రైతులను స్వావలంబన చేసేందుకు, స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు తేయాకు రంగాన్ని ఆధునీకరించాలని వాణిజ్య మంత్రి పిలుపునిచ్చారు.

బ్రాండ్ ప్రమోషన్ మరియు మార్కెటింగ్ ద్వారా ఆర్గానిక్ మరియు జీఐ టీని ప్రోత్సహించాలని శ్రీ పీయూష్ గోయల్ టీ పరిశ్రమను కోరారు

Posted On: 11 NOV 2022 7:28PM by PIB Hyderabad


భారతదేశంలో తేయాకు రంగ భవిష్యత్తును రూపొందించడంలో చిన్న టీ పెంపకందారులు అతిపెద్ద పాత్ర పోషిస్తారని కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు అన్నారు. ఇండియన్ టీ అసోసియేషన్ (ఐటిఏ) ఇంటర్నేషనల్ స్మాల్ టీ గ్రోవర్స్ కన్వెన్షన్‌లో ఈరోజు ఆయన ప్రసంగించారు.

141 ఏళ్ల క్రితం 1881లో ప్రారంభించిన ఐటీఏ టీ పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని మంత్రి ప్రశంసించారు. కర్మాగారాలకు సురక్షితమైన సరఫరా మరియు ఎగుమతులను పెంచడం కోసం చిన్న టీ సాగుదారులను బలోపేతం చేయడానికి ఐటిఏ మరియు సొలిదారిదాద్‌ ఆసియా ప్రయత్నాలను కూడా ఆయన అభినందించారు.

టీ భారతీయ వారసత్వంలో అంతర్భాగమని శ్రీ గోయల్ పేర్కొన్నారు. చాయ్ కేవలం భారతీయ స్టైల్‌లో తయారయ్యే టీ మాత్రమే కాదని, ఇది టీకప్‌లోని ఇండియా అని ఆయన అన్నారు. “చాయ్ భారతీయులకు పానీయం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగం, ఐక్యత మరియు స్నేహానికి చిహ్నం. టీ అందించడం గౌరవానికి చిహ్నంగా మారింది మరియు భారతదేశ అతిథి దేవో భవ సంస్కృతిలో కీలకమైన భాగంగా మారింది” అని ఆయన అన్నారు.

భారత తేయాకు పరిశ్రమ ప్రపంచంలో 2వ అతిపెద్దదని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఆయన డార్జిలింగ్ టీ గురించి మాట్లాడారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా "షాంపైన్ ఆఫ్ టీస్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దాని పువ్వుల సువాసన మరియు అస్సాం టీ భారతదేశ ప్రపంచ గుర్తింపుకు చిహ్నమన్నారు.

ఉపాధి కల్పనలో టీ రంగం కీలక పాత్ర పోషించిందని మంత్రి ఉద్ఘాటించారు

“పెంపకందారులు, ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారులు మాత్రమే కాదు వివిధ స్టార్టప్‌లు మరియు వ్యాపార నమూనాలు కూడా టీ ఆధారంగా ఉద్భవించాయి..” అన్నారు.

మన చిన్న టీ సాగుదారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ లైసెన్సింగ్ సిస్టమ్‌ను అమలు చేయడం, 3 రకాల లైసెన్సుల స్వయంచాలకంగా పునరుద్ధరణ లైసెన్స్, టీ వేస్ట్ లైసెన్స్ మరియు టీ వేర్‌హౌస్ లైసెన్స్ మొదలైన అనేక చర్యలు తీసుకుందని శ్రీ గోయల్ చెప్పారు.

డార్జిలింగ్ టీ మొదటి జీఐ ట్యాగ్ ఉత్పత్తి అని, ఇప్పుడు దాని  2 ఇతర రకాలు గ్రీన్ & వైట్ కూడా జీఐ ట్యాగ్‌లను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. చాయ్ సహయోగ్ మొబైల్ యాప్ అభివృద్ధి భారతీయ టీ పర్యావరణ వ్యవస్థకు మరో మైలురాయి అని ఆయన తెలిపారు.

భారతీయ తేయాకు పెంపకందారులు ఇప్పుడు భారతదేశ టీ  వాసన, రుచి మరియు రంగును ప్రపంచానికి చాటుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సిక్కిం, నీలగిరి, కాంగ్రా & అస్సాం టీల రుచిని ప్రపంచం ఇప్పటికే రుచి చూసి మెచ్చుకున్నదని, ఇతర రకాల టీలు కూడా ప్రపంచానికి తెరతీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వన్ డిస్ట్రిక్ట్ అండ్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకం భారతీయ తేయాకు కీర్తిని వ్యాప్తి చేయడానికి ఊతమిస్తుందని శ్రీ గోయల్ అన్నారు.

తేయాకు రంగాన్ని లాభదాయకంగా, ఆచరణీయంగా మరియు నిలకడగా మార్చాలంటే, మనం టీ యొక్క ‘అరోమా’ని పెంచాలన్నారు

• సహాయం: స్థిరత్వంతో నాణ్యతను మెరుగుపరచడానికి చిన్న సాగుదారులకు మద్దతు ఇవ్వాలి. దేశీయ మరియు అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలి.

• తిరిగి శక్తివంతం చేయడం: ఎగుమతులను పెంపొందించడానికి మౌలిక సదుపాయాలను సృష్టించండి మరియు ఈయూ, కెనడా, దక్షిణ అమెరికా & మధ్యప్రాచ్యం వంటి అధిక విలువ గల మార్కెట్‌లపై దృష్టి పెట్టాలి.

• ఆర్గానిక్: బ్రాండ్ ప్రమోషన్ మరియు మార్కెటింగ్ ద్వారా ఆర్గానిక్ మరియు జీఐ టీని ప్రచారం చేయాలి

• ఆధునీకరణ: తేయాకు రైతులు స్వావలంబన పొందేందుకు మరియు స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి.

• అడాప్టబిలిటీ: రిస్క్ ప్రూఫ్ ఎకోసిస్టమ్ యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెట్టాలి. అంటే, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడానికి తేయాకు తోటలను తయారు చేయడానికి స్థిరమైన పరిష్కారాల అవసరం.

స్వర్గానికి వెళ్లే మార్గం టీపాయ్ గుండా వెళ్లిందని, అభివృద్ధి చెందిన & ఆత్మనిర్భర్ భారత్‌కు మార్గం దేశంలోని ప్రతి తేయాకు తోటల గుండా వెళుతుందని మంత్రి చమత్కరించారు!

 

 

********



(Release ID: 1875557) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi