పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

బెంగుళూరు విమానాశ్రయంలో నూతన టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించిన గౌరవనీయ ప్రధాన మంత్రి


గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ (పిపిపి) ఆధారంగా బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బిఓఓటి) మోడల్‌లో అమలు చేయబడింది.

సుమారు రూ. 2470 కోట్ల వ్యయంతో సుమారు 4008 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం 24.05.2008 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది.

ఈ విమానాశ్రయం 17 జూలై 2013న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.

Posted On: 11 NOV 2022 4:10PM by PIB Hyderabad


బెంగళూరులో దాదాపు రూ.5000 కోట్ల వ్యయంతో నిర్మించిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను గౌరవనీయ  ప్రధాన మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ టెర్మినల్  విమానాశ్రయ  ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని సంవత్సరానికి ప్రస్తుతం ఉన్న 2.5 కోట్ల నుండి 5-6 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహిస్తుంది.

 

image.png

 

టెర్మినల్ 2 బెంగుళూరు ఉద్యానవనం నగర స్ఫూర్తితో రూపొందించబడింది. ఇక్కడ ప్రయాణీకుల అనుభవం "గార్డెన్‌లో నడిచే విధంగా" ఉద్దేశించబడింది. ప్రయాణికులు 10,000+ చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోటలు మరియు అవుట్‌డోర్ గార్డెన్‌ల గుండా ప్రయాణిస్తారు. క్యాంపస్ అంతటా 100% పునరుత్పాదక ఇంధన వినియోగంతో విమానాశ్రయం ఇప్పటికే స్థిరత్వంలో ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. టెర్మినల్ 2 రూపకల్పనలో అల్లిన స్థిరత్వ సూత్రాలతో సృష్టించబడింది. సస్టైనబిలిటీ ఇనిషియేటివ్‌ల ఆధారంగా, టెర్మినల్ 2 అనేది కార్యకలాపాలను ప్రారంభించే ముందు యూఎస్‌ జిబిసి (గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ద్వారా ప్రీ సర్టిఫైడ్ ప్లాటినమ్ రేటింగ్‌ను పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్ అవుతుంది. 'నౌరస' థీమ్ టెర్మినల్ 2 కోసం కమీషన్ చేయబడిన అన్ని కళాకృతులను ఏకం చేస్తుంది. కళాఖండాలు కర్ణాటక వారసత్వం మరియు సంస్కృతిని అలాగే విశాల భారతీయ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

మొత్తంమీద, టెర్మినల్ 2 రూపకల్పన మరియు నిర్మాణం నాలుగు మార్గదర్శక సూత్రాల ద్వారా ప్రభావితమైంది: గార్డెన్‌లో టెర్మినల్, స్థిరత్వం, సాంకేతికత మరియు కళ & సంస్కృతి. ఈ అంశాలన్నీ టీ2ని టెర్మినల్‌గా ప్రదర్శిస్తాయి. ఇది ఆధునికమైనది అయినప్పటికీ ప్రకృతితో అనుసంధానమైంది. మరియు ప్రయాణికులందరికీ చిరస్మరణీయమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

image.png
image.png
బెంగళూరులో సుమారు రూ. 2470 కోట్ల వ్యయంతో సుమారు 4008 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం 24.05.2008 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ విమానాశ్రయం 17 జూలై 2013న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించబడింది.

విమానాశ్రయం  ప్రస్తుత కనెక్టివిటీ + కెపాసిటీ+ ప్యాక్స్ అందించబడుతోంది

ప్రస్తుతం బెంగుళూరు విమానాశ్రయం నుండి 76 దేశీయ మరియు 25 అంతర్జాతీయ గమ్యస్థానాలకు కలుపుతూ 36 విమానయాన సంస్థలు పనిచేస్తున్నాయి. 1,63,535 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న టెర్మినల్ 1 (టీ1)  ప్రస్తుత నిర్ణీత సామర్థ్యం ప్రతి సంవత్సరం 26.5 మిలియన్ల ప్రయాణీకులు (ఎంపిపిఏ), 33.3 ఎంపిపిఏ వరకు విస్తరించవచ్చు (2019-20 ఆర్ధిక సంవత్సరంలో ప్యాక్స్ నిర్వహించబడింది)

బెంగుళూరు విమానాశ్రయంలో ఆర్థిక సంవత్సరం వారీగా నిర్వహించబడిన ప్రయాణీకుల వివరాలు
 

 

సంవత్సరం

దేశీయ ప్రయాణీకులు (ఎంపిపిఏలో)

అంతర్జాతీయ ప్రయాణీకులు

 (ఎంపిపిఏలో)

మొత్తం ప్రయాణికులు

(ఎంపిపిఏలో)

ఆర్ధిక సంవత్సరం 18

23.09

3.81

26.9

ఆర్ధిక సంవత్సరం 19

28.82

4.48

33.3

ఆర్ధిక సంవత్సరం 20

27.78

4.58

32.36

ఆర్ధిక సంవత్సరం 21

10.44

0.46

10.9

ఆర్ధిక సంవత్సరం 22

15.18

1.11

16.29

ఆర్ధిక సంవత్సరం 23 (సెప్టెంబర్ 22 వరకు)

12.32

1.68

13.99

 

భవిష్యత్ కనెక్టివిటీ అంచనాల ఆధారంగా కొత్త టెర్మినల్ అవసరం

ఆర్ధిక సంవత్సరం'26లో వార్షిక ట్రాఫిక్ 50 మిలియన్లకు మించి పెరుగుతుందని మరియు ఆర్ధిక సంవత్సరం'28 నాటికి 60 మిలియన్లను దాటుతుందని బిఐఏఎల్ అంచనా వేసింది. విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్ 2, 2,55,645 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి. 25 ఎంపిపిఏ నిర్దేశిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది టి1+టి2 నుండి 51.5 ఎంపిపిఏ వరకు గరిష్టంగా వ్యాప్తి చెందడం మరియు సగటు పాక్స్ / ఏటీఎం ఆధారంగా 60 ఎంపిపిఎ వరకు సాగుతుంది. ఆగ్మెంటెడ్ కెపాసిటీ సమీప భవిష్యత్తులో ప్రయాణీకుల రాకపోకల వృద్ధిని తీర్చడానికి వీలు కల్పిస్తుంది. 

***(Release ID: 1875556) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi , Manipuri