వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రూ. 47644 కోట్ల ఎంఎస్‌పి విలువతో దాదాపు 13.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 231 ఎల్ఎంటి దాటిన వరి సేకరణ
Posted On:
11 NOV 2022 6:34PM by PIB Hyderabad
కెఎంఎస్ 2022-23 (ఖరీఫ్ పంట)కు వరి సేకరణ ప్రక్రియ మొత్తం 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అయిన పంజాబ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ జె&కె, కేరళ, తెలంగాణ, హర్యానా, తమిళనాడులలో గత ఏడాది ఇదే సమయానికి కొనుగోలు చేసిన 228 ఎల్ ఎంటిలకన్నా ఎక్కువగా 10.11. 2022 నాటికి 231 ఎల్ ఎంటితో సజావుగా సాగుతోంది. సాగుతోంది. ఇప్పటికే 13.50 లక్షల మంది రైతులు కొనసాగుతున్న కెఎంఎస్ కార్యకలాపాల ద్వారా రూ. 47644 కోట్ల ఎంఎస్‌పి విలువ మేరకు లబ్ధిపొందారు.
ఈ ఏడాది వర్షపు పరిస్థితులు దేశంలో సజావుగా ఉండడంతో, వరి ఉత్పత్తి సాధారణంగా ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాది కెంఎఎస్ 2021-22 (ఖరీఫ్ పంట)లో వాస్తవంగా సేకరించిన 759ఎల్ ఎంటి (510ఎల్ ఎంటిల)లకు వ్యతిరేకంగా ప్రస్తుత కెఎంఎస్ 2022-23తో 771 ఎల్ఎంటి (బియ్యం రూపంలో 518 ఎల్ఎంటిలు)లను సేకరణ చేయాలని అంచనా. రబీ పంటను కూడా జోడించుకుని, 2022-23 కాలంలో మొత్తం 900 ఎల్ఎంటిల సేకరణ జరుగుతుందని అంచనా. ఎన్ఎఫ్ఎఎస్ఎ/ పిఎంజికెఎవై/ ఒడబ్ల్యుఎస్‌ల అవసరాలను తీర్చేందుకు సెంట్రల్ పూల్ కింద తగినంత ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలలో కూడా సేకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కార్యకలాపాలు ఎటువంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు ఏర్పాట్లు జరిగాయి.
***
(Release ID: 1875550)
Visitor Counter : 154