ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ టీబీ నిర్మూలన ప్రతిస్పందనలో భారత ప్రభుత్వ అపూర్వ నాయకత్వాన్ని అభినందించిన 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ లూసికా డిటియు
రాబోయే జీ20లో భారతదేశ అధ్యక్షత ద్వారా ప్రపంచవ్యాప్తంగా టీబీపై అవగాహన పెంచే అవకాశంపై చర్చించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
'ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్'ను ప్రశంసించిన 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్' బృందం; దేశవ్యాప్తంగా 10,45,269 మంది రోగులకు మద్దతుగా ముందుకు వచ్చిన 40,492 మంది దాతలు
Posted On:
10 NOV 2022 7:36PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయతో 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ లూసికా డిటియు బృందం సమావేశమైంది. ప్రపంచ టీబీ నిర్మూలన ప్రతిస్పందనలో భారత ప్రభుత్వ ఆదర్శ నాయకత్వాన్ని బృందం అభినందించింది. కొత్త రోగ నిర్ధరణ పరీక్షలు, సామాజిక మద్దతు కార్యక్రమాలు, కొత్త టీబీ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలు వేగవంతం చేయడం సహా సమర్థవంతమైన నిర్వహణ, కీలక కార్యక్రమాలు, విధానాలను వేగంగా తీసుకురావడం వంటి అంశాల మద్దతుతో బలమైన దృక్పథం కలిగిన భారతదేశం ప్రయత్నాలను డాక్టర్ డిటియు ప్రశంసించారు. టీబీ నిర్మూలనలో భారతదేశం పోషిస్తున్న బలమైన నాయకత్వ పాత్రపైన, రాబోయే జీ20లో భారతదేశ అధ్యక్షత ద్వారా ప్రపంచవ్యాప్తంగా టీబీపై అవగాహన పెంచే అవకాశంపై సమావేశంలో చర్చించారు.
డాక్టర్ మాండవీయ 2024 వరకు స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ బోర్డ్ అధ్యక్షుడిగానూ సేవలు అందిస్తున్నారు. 2023 మార్చి 25, 26 తేదీల్లో వారణాసిలో స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ 36వ బోర్డు సమావేశం నిర్వహించేందుకు డాక్టర్ మాండవ్య అంగీకరించారు. బోర్డ్ మీటింగ్‌కు ముందు, మార్చి 24న ఉన్నత స్థాయి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ రోజు ప్రపంచ టీబీ దినంగా కూడా.
'ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్'ను గ్రూప్ అభినందించింది. ఈ కార్యక్రమం ద్వారా, దేశవ్యాప్తంగా 10,45,269 మంది రోగులకు మద్దతు ఇవ్వడానికి 40,492 మంది దాతలు ముందుకు వచ్చారు. టీబీ రోగుల చికిత్స విషయంలో మరింత సామాజిక మద్దతు అందించడం, టీబీని అంతం చేయడానికి సమాజ నేతృత్వంలో ఉద్యమాన్ని తీసుకురావడం వంటివి ఈ కార్యక్రమంలో భాగం. ఈ కార్యక్రమం ద్వారా పది మంది టీబీ రోగులకు సహాయం చేయడానికి డాక్టర్ డిటియు కూడా సంకల్పించారు.
స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ గురించి
టీబీ రోగులకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన అంతర్జాతీయ సంస్థ 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్'. టీబీ నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంబంధిత వర్గాలను సమీకరించేందుకు పని చేస్తోంది. అవసరమైన అందరికీ అధిక నాణ్యమన రోగ నిర్ధరణలు, చికిత్స, సంరక్షణ అందుబాటులో ఉండేలా చూస్తోంది. 2001లో ఈ సంస్థను స్థాపించారు. 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్' ప్రధాన కార్యాలయాన్ని స్విట్జర్లాండ్ జెనీవాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ (యూనోప్స్) నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ & సాంకేతిక సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పరిశోధన & పెట్టుబడి ఏజెన్సీలు, ఫౌండేషన్లు, ఎన్‌జీవోలు, పౌర సమాజం, సామాజిక బృందాలు, ప్రైవేట్ రంగం సహా 1700కు పైబడి ఉన్న భాగస్వాముల ద్వారా, టీబీని ఓడించడానికి వైద్య, సామాజిక, ఆర్థిక అంశాల్లో సమృద్ధిగా ఉంది. బోర్డు పర్యవేక్షణలో, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్' కొనసాగుతుంది. ప్రస్తుతం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మాండవీయ 2024 వరకు, మూడేళ్ల కాలానికి 'స్టాప్ టీబీ పార్టనర్‌షిప్' బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్నారు. టీబీ నిర్మూలనలో ప్రపంచ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశ నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
****
(Release ID: 1875082)
Visitor Counter : 147